డిజిటల్ సేవా పన్నులపై విచారణ చేస్తున్నాం: భారత్‌కు అమెరికా ఝలక్
ఇండియా, బ్రిటన్, యూరోప్‌లోని దేశాలు అమెరికా టెక్ కంపెనీలు టార్గెట్‌గా డిజిటల్ సేవల పన్నులు విధిస్తున్నాయని, దీనిపై విచారణ ప్రారంభిస్తున్నట్లు అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం ప్రకటించారు. గత ఏడాది ప్రాన్స్‌లో ట్రేడ్ ఇన్వెస్టిగేషన్ చేసిన అమెరికా ట్రేడ్ రిప్రజెంటేటివ్ ఆఫీస్ ఇప్పుడు బ్రిటన్, యూరోపియన్ యూనియన్, ఇండోనేషియా, టర్కీ, ఇండియా వాణిజ్య పన్నుల పరిశీలనపై దృష్టి సారించనుంది.

అమెరికా కంపెనీలు లక్ష్యంగా ట్యాక్స్ డిజైన్
అన్యాయమైన పన్ను విధానాల నుండి తమ కంపెనీలను కాపాడుకునేందుకు ఆయా దేశాల్లో పన్నులు విధిస్తున్న తీరుపై విచారణ చేపడుతోంది అమెరికా. తమ వాణిజ్య భాగస్వాముల్లో చాలామంది అమెరికా కంపెనీలను లక్ష్యంగా చేసుకొని డిజైన్ చేసిన ట్యాక్స్ స్కీమ్స్ అవలంభిస్తున్నారని ట్రంప్ అన్నారు. తమ బిజినెస్‌లు, వర్కర్స్‌ను కాపాడేందుకు తగిన చర్యలు తీసుకోవడానికి అమెరికా సిద్ధమని తెలిపారు.

గూగుల్, అమెజాన్, ఫేస్‌బుక్‌లను ఏకాకులు చేసే ప్రయత్నం
కొన్ని తమ వాణిజ్య భాగస్వామ్య దేశాలు అనుచిత ట్యాక్స్ డిజైన్ చేశాయని, దీనిపై ట్రంప్ ఆందోళన చెందుతున్నారని అమెరికా ట్రేడ్ రిప్రజెంటేటివ్ (USTR) రాబర్ట్ లిథిజర్ అన్నారు. ఆన్ లైన్ ద్వారా జరిగే సేల్స్, ప్రకటనల నుండి వచ్చే ఆదాయానికి పన్ను విధించే ప్రయత్నాలను వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. గూగుల్, ఆపిల్, ఫేస్‌బుక్, అమెజాన్, నెట్ ఫ్లిక్స్ వంటి అమెరికా టెక్ దిగ్గజాలను టార్గెట్ చేస్తున్నారని, వీటిని ఏకాకులు చేస్తున్నారని విమర్శించారు.

ఇండియాలో ఏప్రిల్ 1 నుండి
భారత్‌తో పాటు వివిధ దేశాల డిజిటల్ సేవల పన్ను(DST)పై USTR దర్యాఫ్తు చేయనుంది. తొలుత DST అంశాలపై ఈ విచారణ దృష్టి సారిస్తుంది. అమెరికా కంపెనీలపై వివక్ష, అసమంజస పన్ను విధానం వంటి అంశాలను పరిశీలిస్తుంది. భారత్ విషయానికి వస్తే ఈ ఏడాది మార్చి నెలలో డిజిటలైజేషన్ ట్రాన్సాక్షన్ పైన 2 శాతం పన్నును విధించాలని నిర్ణయించింది. ఈ పన్ను ప్రవాస సంస్థలకు మాత్రమే వర్తిస్తుంది. ఏడాదిలో రెవెన్యూ రూ.20 మిలియన్స్ (దాదాపు 267,000 మిలియన్ డాలర్లు) దాటితే ఇది వర్తిస్తుంది. ఈ పన్ను ఏప్రిల్ 1, 2020 నుండి అమల్లోకి వచ్చింది.


Click it and Unblock the Notifications