జెఫ్ బెజోస్, ఎలాన్ మస్క్, వారెన్ బఫెట్ తదితర ప్రపంచ కుబేరుల సంపాదన భారీగా ఉంటుంది. వారు చెల్లించే పన్నులు కూడా అంతేస్థాయిలో ఉంటాయని భావిస్తారేమో. కానీ చెల్లించే పన్నులు తక్కువ లేదా దాదాపు ఏమీ ఉండదని చెప్పవచ్చు. అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ 2007, 2011లో ఎలాంటి పన్నులు చెల్లించలేదట. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కూడా 2018లో చెల్లించలేదు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతులుగా కొనసాగుతున్న కొంతమంది ప్రముఖ అమెరికన్లు చెల్లించిన ఆదాయపు పన్ను వివరాలు ఇప్పుడు సంచలనంగా మారాయి.

పన్ను వ్యవస్థ పటిష్టమా అంటే
ప్రోపబ్లికా మీడియా సంస్థ తమ పరిశోధనాత్మక కథనంలో ఇందుకు సంబంధించిన వివరాలు వెలుగులోకి తెచ్చింది. గత పదిహేనేళ్ల ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్(IRS) డేటా రికార్డ్స్‌ని సంపాదించి ఈ విషయాల్ని వెలుగులోకి తెచ్చింది. కుబేరుల జాబితాలోని తొలి 25 మంది ఆదాయ పన్ను వివరాలు చూస్తే షాక్ కావాల్సిందే. వారి సంపద పెరిగిన తీరుకు, చెల్లిస్తున్న పన్నులకు పొంతన లేదు. తద్వారా అమెరికా పన్ను వ్యవస్థ పటిష్టమైనదనే వాదన తేలిపోయిందని అంటున్నారు. అయితే ఈ సమాచారాన్ని అధికారికంగా ధృవీకరించాలి.

కుబేరులు ఇలా
జెఫ్ బెజోస్ 2007లోనే కుబేరుడిగా ఉన్నారు. ఆ ఏడాది ఆయన ఆదాయ పన్ను కింద ఒక్క రూపాయి చెల్లించలేదు. 2011లోను ఆయన ఎలాంటి పన్నులు చెల్లించలేదు. ప్రస్తుతం జెఫ్ బెజోస్ ప్రపంచంలో కుబేరుడిగా ఉన్నారు. ఎలాన్ మస్క్ కూడా 2018లో ఒక్క డాలర్ కూడా ఆదాయపు పన్ను చెల్లించలేదు. మైకేల్ బ్లూమ్‌బెర్డ్, బిలియనీర్ ఇన్వెస్టర్ కార్ల్ ఇకాన్, జార్జ్ సోరోస్ కూడా పలుమార్లు ఒక్క డాలర్ ఆదాయపుపన్ను చెల్లించలేదు. ఇక వారెన్ బఫెట్, బిల్‌గేట్స్, ముర్డోచ్, మార్క్ జుకర్‌బర్గ్ ఆర్థిక విషయాలు కూడా విస్తుగొలిపేలా ఉన్నట్లు తెలిపింది.

70వేల డాలర్ల ఆర్జన
అగ్రరాజ్యం అమెరికాలో ఒక్కో వ్యక్తి సగటున ఏడాదికి 70 వేల డాలర్లు ఆర్జిస్తున్నాడు. ఇందులో 14 శాతం పన్ను కింద చెల్లిస్తున్నారు. 6,28,300 డాలర్లకు పైగా ఆర్జించే దంపతులు గరిష్ఠంగా 37 శాతం ఆదాయపు పన్ను చెల్లిస్తున్నారు. కుబేరులు మాత్రం ఈ వ్యవస్థను కొల్లగొడుతున్నారని ప్రోపబ్లికా పేర్కొంది.
More From GoodReturns

March 31: రేపటితో ముగియనున్న ఆర్థిక సంవత్సరం.. ఈ 15 పనులు చేయకపోతే భారీ జరిమానా!

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications