For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Stock Market: ఈ వారం మార్కెట్లను నడిపించేవి ఇవే.. ట్రేడర్స్ ఇవి తప్పక గమనించండి..

|

Stock Market: కొత్త సంవత్సరం ప్రారంభమైన తర్వాత కేవలం కొన్ని రోజులు మినహా దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నష్టాలను చవిచూస్తున్నాయి. వందల పాయింట్ల మేర సూచీలు పతనం కావటం ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేస్తోంది. అయితే వచ్చే వారం మార్కెట్ల గమనాన్ని నిర్ణయించటానికి కొన్ని అంశాలు కీలకంగా మారనున్నాయి.

ప్రధాన అంశాలు..

ప్రధాన అంశాలు..

గత వారం ఎఫ్ఐఐలు తమ పెట్టుబడులను విక్రయించటంతో బెంచ్ మార్క్ సూచీలు నిఫ్టీ, సెన్సెక్స్ భారీగా పతనాన్ని నమోదు చేశాయి. దీనికి తోడు డిసెంబర్ మాసం తర్వాత చాలా మంది లాభాల స్వీకరణకు మెుగ్గు చూపుతున్నారు. జనవరి 4 నుంచి 6 మధ్య వరుసగా మూడు రోజుల పాటు నష్టాల్లోకి ప్రవేశించాయి. అయితే రానున్న వారం ద్రవ్యోల్బణం డేటా, ఐటీ కంపెనీలు మూడో త్రైమాసిక ఫలితాలు మార్కెట్ల గమనాన్ని నిర్ధేశించనున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

ఆవిరైన ఇన్వెస్టర్ల సంపద..

ఆవిరైన ఇన్వెస్టర్ల సంపద..

జనవరి 4 నుంచి 6 మధ్య కాలంలో BSE లిస్టెడ్ సంస్థల మార్కెట్ క్యాప్ దాదాపు రూ.4,90,293.28 కోట్లు క్షీణించింది. ఈ భారీ పతనం తర్వాత సెన్సెక్స్ సూచీ విలువ దాదాపుగా రూ.279.75 లక్షల కోట్ల వద్ద స్థిరపడింది. విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారులు సెల్లర్స్ గా నిలవటం దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఈ కాలంలో భారతీయ ఈక్విటీల నుంచి ఎఫ్‌ఐఐలు రూ.7,813.44 కోట్లను ఉపసంహరించుకున్నట్లు వెల్లడైంది.

క్షీణిస్తున్న రూపాయి..

క్షీణిస్తున్న రూపాయి..

మరోపక్క భారతీయ కరెన్సీ రూపాయి విలువ రోజురోజుకూ అధ్వానంగా మారుతోంది. మాంద్యం కారణంగా డాలర్ల కొరత ఏర్పడటం అంతర్జాతీయంగా అనేక దేశాల కరెన్సీలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తోంది. 2022 సంవత్సరంలో భారతీయ రూపాయి చరిత్రలో అత్యంత చెత్త పనితీరును కనబరిచింది. బలమైన US డేటా తర్వాత గ్రీన్‌బ్యాక్ ఒక నెల గరిష్ట స్థాయికి చేరుకుంది. ఇది US Fed ద్రవ్య విధానంలో మరింత హాకిష్ విధానంపై అంచనాలను రేకెత్తించింది. మరోపక్క ఫెడ్ అధికారులు దూకుడు వైఖరిని కొనసాగించడం ద్వారా ద్రవ్యోల్బణాన్ని అరికట్టాలని నిర్ణయించుకున్నారని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ వెల్లడించారు.

తప్పక పరిశీలించాల్సినవి..

తప్పక పరిశీలించాల్సినవి..

వచ్చే వారం మార్కెట్లో ట్రేడర్లు రానున్న బడ్జెట్ పై కూడా ఓ కన్నేసి ఉంచాల్సిన సమయమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. దీనికి తోడు ఆర్థిక డేటా, ఫెడ్ పాలసీ, ఇండియా క్యూ-3 ఫలితాలు వంటి ఇతర ముఖ్యమైన అంశాలు కూడా కీలకంగా మారనున్నాయి. ఐటి, బ్యాంకింగ్ రంగాలు మ్యూట్ చేసిన ఆదాయాల అంచనాతో అస్థిరంగా కొనసాగుతున్నాయి. అలాగే స్థూల ఆర్థిక రంగంలో IIP, CPI ద్రవ్యోల్బణం జనవరి 12న వెల్లడికానున్నాయి.

కొనుగోలు చేయడానికి స్టాక్స్..?

కొనుగోలు చేయడానికి స్టాక్స్..?

కొనసాగుతున్న కన్సాలిడేషన్ సమయంలో BFSI, PSU, IT, ఇన్‌ఫ్రా రంగాలపై దృష్టి కేంద్రీకరించాలని ICICI డైరెక్ట్ భావిస్తోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్, SBI, HDFC లైఫ్, L&T, అల్ట్రాటెక్ సిమెంట్, NTPC, టాటా స్టీల్, హిందాల్కో, మారుతీ సుజుకి వంటి బ్రోకరేజీలు ఇష్టపడే లార్జ్ క్యాప్‌ కంపెనీలు. ఇక మిడ్ క్యాప్ విషయంలో PFC, IDFC ఫస్ట్ బ్యాంక్, PNB, KEC, NCC, IOC, GPPL, నేషనల్ అల్యూమినియం, మహీంద్రా CIE, నెల్‌కాస్ట్ ఉన్నాయి. వీటికి తోడు రాబోయే వారంలో టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, విప్రో, HDFC బ్యాంక్ వంటి కంపెనీలు తమ ఫలితాలను వెల్లడించనున్నాయి కాబట్టి ఓలుక్కేయాల్సిందే.

English summary

Stock Market: ఈ వారం మార్కెట్లను నడిపించేవి ఇవే.. ట్రేడర్స్ ఇవి తప్పక గమనించండి.. | Traders should Know points that might drive Indian stock markets Next week

Traders should Know points that might drive Indian stock markets Next week
Story first published: Sunday, January 8, 2023, 16:00 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X