అసలే కరోనా మహమ్మారి కారణంగా వ్యాపారాలు పడిపోయాయి. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. చిన్న వ్యాపారుల నుండి దిగ్గజ సంస్థల వరకు ఇప్పుడు రానున్న పండుగలపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి. కనీసం ఈ పండుగ నుండి వ్యాపారాలు కోలుకుంటాయని భావిస్తున్నారు. అయితే టెలివిజన్ (టీవీ) మ్యానుఫ్యాక్చరర్స్ శాంసంగ్, ఎల్జీ, సోనీ, టీసీఎల్‌కు ఊహించని షాక్ తగిలింది. ఇటీవలి ఇంపోర్ట్ లైసెన్స్ రూల్స్ కారణంగా 21,000 లార్జ్ స్క్రీన్ టీవీలు పోర్ట్‌ల్లోనే నిలిచిపోయాయి. ప్రస్తుతం దిగుమతికి సంబంధించి లైసెన్స్‌లు రాలేదని చెబుతున్నారు.

శాంసంగ్‌పై ప్రభావం.. 20 ఏళ్లలో తొలిసారి
ఎక్కువ టీవీలు పోర్టుల్లోనే ఉండిపోవడంతో ఇండియాలో అతిపెద్ద మార్కెట్ వాటా కలిగిన శాంసంగ్ ఇండియాపై ఎక్కువ ప్రభావం పడనుంది. ఈ టీవీల్లో 35 శాతం దిగుమతులే ఉంటాయి. ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమంలో భాగంగా స్థానికంగా తయారీని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం జూలై 30న టీవీ సెట్ల దిగుమతిపై ఆంక్షలు విధించింది. దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్‌ను ప్రోత్సహించేందుకు ఇలా నిర్ణయం తీసుకోవడం 20 ఏళ్లలో మొదటిసారి.

పండుగ సీజన్‌లో ఈ రూల్ దెబ్బకొట్టేనా
దాదాపు 35 శాతానికి పైగా టీవీలు దిగుమతి అవుతాయి. ఇందులో 15 శాతం నుండి 20 శాతం టీవీలు ప్రీమియం, లార్జ్ స్క్రీన్ సెట్స్ ఉంటాయి. దేశంలో టీవీ మార్కెట్ వాటా రూ.25,000 కోట్లుగా ఉంటుంది. టీవీలు సహా చాలా వ్యాపారాలు పండుగల సీజన్‌పై ఎక్కువగా ఆధారపడుతాయి. దీపావళి, దసరా సీజన్‌లో ఆఫర్లు వెల్లువెత్తుతాయి. ఇప్పుడు టీవీలు పోర్టుల్లోనే నిలిచిపోవడంతో ఈ పండుగ సీజన్‌లో విక్రయించాలనుకున్న టీవీ ఉత్పత్తి కంపెనీల ప్లాన్ బెడిసికొట్టేలా కనిపిస్తోంది. త్వరితగతిన అనుమతులు వస్తే మాత్రం ఇబ్బందులు తప్పవచ్చు.

ఇప్పుడేం చేయాలి...! ఇప్పటికే దరఖాస్తు
దేశంలోకి కలర్ టీవీల దిగుమతులపై జూలై 31న కేంద్రం ఆంక్షలు విధించింది. కలర్ టీవీల దిగుమతి విధానాన్ని స్వేచ్ఛా విభాగం నుండి తొలగించి, పరిమిత విభాగానికి మార్చింది. దీంతో దిగుమతులు చేసుకోవాలంటే వాణిజ్య మంత్రిత్వ శాఖ నుండి లైసెన్స్ పొందాలి. దేశంలోకి కలర్ టీవీలు అధికంగా దిగుమతి అయ్యేది చైనా నుండి కాబట్టి ఈ నిర్ణయం తీసుకుంది కేంద్రం. అయితే శాసంగ్, టీసీఎల్, సోనీ వంటి కంపెనీలు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నాయట. అయితే అనుమతులు ఎప్పుడు వస్తాయో క్లారిటీ లేదు.

పండుగ సీజన్లో కలవరపాటు
భారత్‌లో విక్రయించే టీవీల్లో 35 శాతం దిగుమతి అయ్యేవే. పండుగ సీజన్‌లో దిగ్గజ బ్రాండ్స్‌ను కలవరపాటుకు గురి చేస్తోంది. మరోవైపు, ఇన్నాళ్లు స్టాక్ రాకపోవడం, ఇటీవలే కార్యకలాపాలు తెరుచుకోవడంతో రిటైల్ స్టాక్స్ కూడా లేకుండా పోతున్నాయట.55 ఇంచుల శాంసంగ్, ఎల్జీ, సోనీ టీవీ సెట్స్ కొరత ఉందని ముంబై, ఢిల్లీల్లోని లీడింగ్ ఎలక్ట్రానిక్స్ రిటైల్ చైన్ విజయ్ సేల్స్ డైరెక్టర్ నీలేష్ గుప్త అన్నారు.
లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు సోని ఇండియా టెలివిజన్ బిజినెస్ హెడ్ తెలిపారు. పోర్టుల్లో చిక్కుకున్న టెలివిజన్ల గురించి ఆయన మాట్లాడలేదు. అయితే 99 శాతం టీవీలు ఇక్కడే తయారవుతాయని తెలిపారు. పండుగ సీజన్ కోసం తాము సిద్ధంగానే ఉన్నామని తెలిపారు.
దరఖాస్తు చేసుకున్నామని, అనుమతుల కోసం వేచి చూస్తున్నట్లు టీసీఎల్ ఇండియా జనరల్ మేనేజర్ తెలిపారు. పండుగ సీజన్లో కస్టమర్లకు తగినంత సరఫరా చేయడానికి స్థానికంగా అన్నీ సిద్ధం చేసినట్లు చెప్పారు. లైసెన్స్ పొందడం అంత సులభం కాదని, ఆ నోటిఫికేషన్ హఠాత్తుగా వచ్చిందని కొంతమంది అంటున్నారు.
More From GoodReturns

Jobs: జాబ్స్ రాకపోవడానికి అసలు కారణం ఇదే! యువతలో ఆ ఒక్కటి తక్కువైంది!

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications