For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మూడేళ్లుగా డిసెంబర్ నెలలో 10% నుండి 70 శాతం లాభాలు ఇచ్చిన స్టాక్స్

|

గత నెల రోజులుగా భారత స్టాక్ మార్కెట్లు దిద్దుబాటులో ఉన్నాయి. సెన్సెక్స్ ఆల్ టైమ్ గరిష్టంతో 5,000 పాయింట్లకు పైగా క్షీణించగా, గత నెల రోజుల్లోనే 3000కు పైగా నష్టపోయింది. కరోనా కొత్త వేరియంట్ ఓమిక్రోన్, ద్రవ్యోల్భణ ఆందోళనలు, అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో సూచీలు నష్టపోవడం కనిపించింది. అయినప్పటికీ కొన్ని స్టాక్స్ లాభాల్లో పయనించాయి. చాలా వరకు నష్టాల్లో ఉన్నాయి. అయితే గత ఏడాది కరోనా, అంతకుముందు ఏడాది మందగమనం వంటి వివిధ ప్రతికూల పరిస్థితుల్లోను కొన్ని స్టాక్స్ వరుసగా గత మూడేళ్లలో డిసెంబర్ నెలలో సానుకూల రిటర్న్స్ ఇచ్చాయి. గతమూడు పర్యాయాలు డిసెంబర్ నెలలో లాభాలు అందించిన ఎనిమిది స్టాక్స్ ఇవే. ఈ స్టాక్స్ పది శాతం మేర రిటర్న్స్ ఇచ్చాయి.

డబుల్ డిజిట్ గ్రోత్

డబుల్ డిజిట్ గ్రోత్

గత మూడేళ్లలో డిసెంబర్ నెలలో మంచి రిటర్న్స్ ఇచ్చిన ఈ స్టాక్స్ లో-వ్యాల్యూమ్‌వి. వీటి మార్కెట్ క్యాప్ రూ.500 కోట్లకు పైన ఉంది. ఇంగ్లీష్ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం... బ్లాక్ బాక్స్ లిమిటెడ్ వరుసగా మూడేళ్ల పాటు డిసెంబర్ నెలలో డబుల్ డిజిట్ రిటర్న్స్ అందించింది. 2018 డిసెంబర్ నెలలో 11 శాతం, 2019 డిసెంబర్ నెలలో 19 శాతం, 2020 డిసెంబర్ నెలలో 24 శాతం రిటర్న్స్ ఇచ్చింది.

హిందూస్తాన్ ఫుడ్స్ లిమిటెడ్ కూడా డబుల్ డిజిట్ రిటర్న్స్ ఇచ్చింది. 2018 డిసెంబర్ నెలలో 16 శాతం, 2019 డిసెంబర్ నెలలో 14 శాతం, 2020 డిసెంబర్ నెలలో 75 శాతం రిటర్న్స్ ఇచ్చింది.

జేఎస్‌డబ్ల్యు ఇస్పాట్ స్పెషల్ ప్రోడక్ట్స్ లిమిటెడ్ 2018 డిసెంబర్ నెలలో 14 శాతం, 2019 డిసెంబర్ నెలలో 45 శాతం, 2020 డిసెంబర్ నెలలో 61 శాతం రిటర్న్స్ ఇచ్చింది.

ఇవి కూడా

ఇవి కూడా

జేటీఎల్ ఇన్ఫ్రా లిమిటెడ్ 2018 డిసెంబర్ నెలలో 15 శాతం, 2019 డిసెంబర్ నెలలో 14 శాతం, 2020 డిసెంబర్ నెలలో 12 శాతం రిటర్న్స్ ఇచ్చింది.

కెల్టాన్ టెక్ సొల్యూషన్స్ లిమిటెడ్ 2018 డిసెంబర్ నెలలో 32 శాతం, 2019 డిసెంబర్ నెలలో 19 శాతం, 2020 డిసెంబర్ నెలలో 39 శాతం రిటర్న్స్ ఇచ్చింది.

రానే లిమిటెడ్ 2018 డిసెంబర్ నెలలో 11 శాతం, 2019 డిసెంబర్ నెలలో 34 శాతం, 2020 డిసెంబర్ నెలలో 15 శాతం రిటర్న్స్ ఇచ్చింది.

పెట్టుబడి పట్ల అప్రమత్తం

పెట్టుబడి పట్ల అప్రమత్తం

టాటా స్టీల్ బీఎస్ఎల్ లిమిటెడ్ 2018 డిసెంబర్ నెలలో 46 శాతం, 2019 డిసెంబర్ నెలలో 11 శాతం, 2020 డిసెంబర్ నెలలో 13 శాతం రిటర్న్స్ ఇచ్చింది.

యారీ డిజిటల్ ఇంటెగ్రేటెడ్ సర్వీసెస్ 2018 డిసెంబర్ నెలలో 21 శాతం, 2019 డిసెంబర్ నెలలో 20 శాతం, 2020 డిసెంబర్ నెలలో 70 శాతం రిటర్న్స్ ఇచ్చింది.

ఈ స్టాక్స్‌లో కొన్నింటికి బలాల కంటే బలహీనతలు, మరికొన్నింటికి బలహీనతల కంటే బలాలు ఎక్కువగా ఉన్నాయి.

స్టాక్ మార్కెట్ లేదా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి రిస్క్‌తో కూడుకున్న వ్యవహారం. కాబట్టి స్టాక్స్ లేదా ఫండ్స్ గురించి పూర్తి అవగాహనతో, నిపుణుల సలహాలతో ఇన్వెస్ట్ చేయాలి.

English summary

మూడేళ్లుగా డిసెంబర్ నెలలో 10% నుండి 70 శాతం లాభాలు ఇచ్చిన స్టాక్స్ | These stocks rose morethan 10 percent in december of last 3 years

The Indian market has been weak for over a month now. The benchmark index Sensex has fallen about 3,000 points, or 5 percent, from its closing high of 61,765 during this period.
Story first published: Sunday, November 28, 2021, 13:49 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X