For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కరోనా వైరస్ వల్ల చైనా దెబ్బతింటే.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు నష్టం, ఎందుకంటే?

|

చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. గ్లోబల్ వ్యాప్తంగా ఆర్థిక పరిస్థితిపై ఇది ప్రభావం చూపిస్తోంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఈ ప్రాణాంతక వైరస్ అల్లకల్లోలం చేస్తోంది. చైనా జీడీపీ తగ్గిపోతుందని అంచనాలున్నాయి. 2003లో సార్స్ ప్రపంచ వాణిజ్యంపై తీవ్ర ప్రభావం చూపింది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత కరోనా అంతకుమించిన ప్రభావం చూపిస్తోందని అంటున్నారు. చైనాపై ఈ ప్రభావం తీవ్రంగా ఉంది.

రుణాలు ఇవ్వకుంటే ఫిర్యాదు చేయండి: నిర్మలా సీతారామన్రుణాలు ఇవ్వకుంటే ఫిర్యాదు చేయండి: నిర్మలా సీతారామన్

2003 కంటే ఇప్పుడు చైనా ప్రభావం ఎక్కువే

2003 కంటే ఇప్పుడు చైనా ప్రభావం ఎక్కువే

లగ్జరీ ఉత్పత్తులు, టూరిజం, కార్లు, ఇతర వాహనాలపై చేసే ఖర్చులు భారీగా తగ్గాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రభావం ఉంది. 2003లో సార్స్ కారణంగా చైనా జీడీపీ పడిపోయింది. అప్పుడు ప్రపంచంలో చైనా జీడీపీ దాదాపు 4 శాతంగా ఉంది. ఇప్పుడు అది 16 శాతానికి పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రభావం అంతర్జాతీయంగా ఎక్కువే ఉంటుంది.

సార్స్ కంటే ప్రమాదకరం కరోనా..

సార్స్ కంటే ప్రమాదకరం కరోనా..

నాడు 8 వేలమందికి పైగా సార్స్ సోకింది. 774 మంది మృతి చెందారు. ఇప్పుడు కరోనా వైరస్ కారణంగా ఈ మృతుల సంఖ్య 800 దాటింది. ఈ వ్యాధి సోకిన వారి సంఖ్య 34వేలకు పైగా ఉంది. ఈ వ్యాధి ప్రభావం 25కు పైగా దేశాల్లో ఉంది. దీంతో కరోనా వైరస్ ప్రభావం ఆయా దేశాల, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం ఎక్కువే ఉంటుందని చెబుతున్నారు.

మూతబడిన పరిశ్రమలు

మూతబడిన పరిశ్రమలు

కరోనా ప్రభావంతో చైనాలో పరిశ్రమలు, లాజిస్టిక్ హబ్స్ మూతపడ్డాయి. ఇప్పటికే లూనార్ కొత్త సంవత్సరంలో మూసివేసిన పరిశ్రమలు చాలా వరకు ఇప్పటికీ తెరుచుకోలేదు. అవి ఎప్పుడు తెరుచుకుంటావో కూడా తెలియదు. దీంతో ప్రపంచవ్యాప్తంగా క్రమేపి వీటికి ముడి సరుకులు, ఉత్పత్తుల అనుసంధానత దెబ్బతింటోంది. విమాన, రోడ్డు, నౌకాయానంలో రావాల్సిన వస్తువుల రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

నిలిచిపోయిన రాకపోకలు

నిలిచిపోయిన రాకపోకలు

వూహాన్‌కు సమీపంలోని యాంగ్జీ నది మీదుగా నౌకల రాకపోకలు నిలిచిపోయాయి. చైనా నుంచి ఐరోపాకు వెళ్లే రైళ్లను వూహాన్ నుండి దారి మళ్లిస్తున్నారు. రవాణా మార్గాలు మూసివేయడంతో వూహాన్ నుంచి ఏమీ బయటకు రావడం లేదు. అత్యవసర మందులు మాత్రమే రవాణా చేస్తున్నారు.

జీడీపీ తగ్గొచ్చు.. ఆటో పరిశ్రమపై భారీ ప్రభావం

జీడీపీ తగ్గొచ్చు.. ఆటో పరిశ్రమపై భారీ ప్రభావం

ఆర్థిక కార్యకలాపాలు ఎక్కువకాలం ఆగిపోతే చైనా జీడీపీపై ప్రభావం ఉంటుందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. చైనాలో ఆటో రంగానికి చెందిన పరిశ్రమలు దాదాపు 48 శాతం వూహాన్, దాని పరిసర ప్రాంతాల్లోనే ఉన్నాయి. దీంతో ఈ రంగంపై భారీగా ప్రభావం పడింది. కరోనా వైరస్ కారణంగా గ్రేటర్ నోయిడాలో జరుగుతున్న ఆసియా అతిపెద్ద వాహన ప్రదర్శనకు వీక్షకులు, కంపెనీలు తగ్గాయి కూడా.

ఇప్పుడు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ

ఇప్పుడు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ

ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావం 2003లోని సార్స్ వల్ల కలిగిన నష్టం కంటే ఎంతో భారీగా ఉంటుందని, సార్స్ ప్రబలినప్పుడు ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఆరో స్థానంలో నిలువడంతోపాటు ప్రపంచ జీడీపీలో 4 శాతం వాటాను మాత్రమే కలిగి ఉందని, ఇప్పుడు చైనా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో రెండో స్థానంలో నిలిచిందని గుర్తు చేస్తున్నారు.

ప్రపంచానికి భారీ నష్టం

ప్రపంచానికి భారీ నష్టం

ప్రస్తుతం ప్రపంచ జీడీపీలో 16.3 శాతం వాటాను కలిగి ఉన్న చైనా ఆర్థిక వ్యవస్థ ఏమాత్రం మందగించినా ఆ ప్రభావం ప్రపంచానికి భారీ నష్టాన్ని కలిగిస్తుందని ఐహెచ్ఎస్ మార్కిట్ స్పష్టం చేసింది.

కరోనాను కట్టడి చేయకుంటే..

కరోనాను కట్టడి చేయకుంటే..

కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు విస్తృతస్థాయిలో చేపడుతున్న చర్యలు ఫిబ్రవరి నెలాఖరు వరకు కొనసాగి మార్చి ఆరంభం వరకు పురోగతి సాధిస్తే కనుక ప్రపంచ వాస్తవిక జీడీపీ 2020 ఆర్థిక సంవత్సర తొలి త్రైమాసికంలో 0.8% మేరకు, రెండో త్రైమాసికంలో 0.5% మేరకు తగ్గుతుందని, తద్వారా 2020 సంవత్సరం మొత్తం మీద దాదాపు 0.4% వరకు తగ్గుతుందని ఐహెచ్ఎస్ మార్కిట్ పేర్కొంది.

English summary

కరోనా వైరస్ వల్ల చైనా దెబ్బతింటే.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు నష్టం, ఎందుకంటే? | The coronavirus is already hurting the world economy

The number of new coronavirus deaths on the Chinese mainland hit 811 by end of Feb. 8, the National Health Commission said on Sunday morning, surpassing that of the SARS epidemic in 2002/2003.
Story first published: Sunday, February 9, 2020, 10:03 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X