For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Success Story: ఐటీ జాబ్ మానేసి వ్యాపారం.. లక్షలు ఆర్జిస్తున్న తెలుగోడు..

|

Success Story: ఈ రోజుల్లో ఐటీ ఉద్యోగం కావాలని కష్టపడుతున్న వారితో పాటు మాకు సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు వద్దంటూ ఆ రంగానికి దూరం అవుతున్న వారు సైతం పెరిగిపోతున్నారు. అలా 20 ఏళ్లుగా పనిచేస్తున్న ఐటీ రంగాన్ని వదిలిన తెలుగు టెక్కీ సొంత వ్యాపారంతో రాణిస్తున్నాడు.

తీవ్రమైన ఒత్తిడి సవాళ్లతో కూడుకున్న ఐటీ ఉద్యోగాన్ని వీడి సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించాడు. సొంత వ్యాపారంలో లాభనష్టాలకు మనమే బాధ్యత వహించాల్సి ఉండటంతో పాటు సరిగా నిర్వహిస్తే లక్షలు గడించవచ్చు. అలా రాజేంద్రప్రసాద్ అనే టెక్కీ ప్రారంభించిన వ్యాపారం ఇప్పుడు పెద్ద బ్రాండ్‌గా మారిపోయింది.

T-SNACKS బ్రాండ్..

T-SNACKS బ్రాండ్..

హైదరాబాద్‌కు చెందిన రాజేంద్రప్రసాద్ కు ఆహారం, వంటల పట్ల మక్కువ. దీంతో T-SNACKS బ్రాండ్ క్రింద తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో బాగా ప్రాచుర్యం పొందిన ఆరోగ్యకరమైన సాంప్రదాయ స్నాక్స్‌లను తయారు చేసి విక్రయించడానికి CloudKitchen ఆధారంగా 2019లో చిన్న వ్యాపారాన్ని ప్రారంభించారు.

పిల్లల కోసం.. ఎగుమతులు..

పిల్లల కోసం.. ఎగుమతులు..

పిల్లలకు అనారోగ్యకమైన చిరుతిళ్లు మార్కెట్లో ఉండటంతో రాజేంద్రప్రసాద్ ఈ రంగాన్ని ఎంచుకున్నారు. ప్రస్తుతం టీ-స్నాక్స్ బ్రాండ్‌తో స్నాక్స్ మాత్రమే కాకుండా స్వీట్లు, పచ్చళ్లు, పొడులు కూడా విక్రయిస్తున్నాడు. పైగా వీటిని USA, UK, ఆస్ట్రేలియా వంటి అనేక దేశాలకు తన ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నారు. ఈ వ్యాపారాన్ని ఆయన 2019లో కేవలం రూ.5 లక్షల పెట్టుబడితో ప్రారంభించారు.

కష్ట సమయంలో..

కష్ట సమయంలో..

కరోనా వల్ల కష్ట సమయంలో రాజేంద్రప్రసాద్ నష్టంతో పాటు సంక్షోభాన్ని ఎదుర్కొన్నాడు. రాజేంద్రప్రసాద్ ఐటీ వర్క్ కొనసాగించగా.. ఆయన భార్య టీ-స్నాక్స్ క్లౌడ్ కిచెన్ నడిపేది. కరోనా కాలంలో విదేశాల్లో ఉన్న తన స్నేహితులు తనకు చాలా రకాలుగా సహాయం చేశారని రాజేంద్ర ప్రసాద్ చెప్పారు. ఈ బ్రాండ్ కింద మెుత్తం 25 రకాల స్నాక్స్ విక్రయిస్తున్నారు. ఈ వ్యాపారం ద్వారా నెలకు లక్ష వరకు సంపాదిస్తున్నట్లు రాజేంద్రప్రసాద్ తెలిపారు.

English summary

Success Story: ఐటీ జాబ్ మానేసి వ్యాపారం.. లక్షలు ఆర్జిస్తున్న తెలుగోడు.. | telangana techie started T-SNACKS know about his success story

telangana techie started T-SNACKS know about his success story
Story first published: Thursday, November 24, 2022, 10:44 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X