కరోనా మహమ్మారి-లాక్ డౌన్ నేపథ్యంలో వేతనాలపై ప్రభావం పడిందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియా ఎకానమీ (CMIE) చీఫ్ మహేష్ వ్యాస్ అభిప్రాయపడ్డారు. నిరుద్యోగిత రేటు గ్రామాల్లో తగ్గినప్పటికీ, దేశంలో ఉద్యోగ గణాంకాల ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ఎక్కువమంది ఉద్యోగులు తక్కువ వేతనంతో కూడిన ఉద్యోగాల్లో చేరుతున్నారని తెలిపారు. కరోనా-షట్ డన్ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా భారీగా పడిన విషయం తెలిసిందే. ఆయన ఇండియా టుడే టీవీతో ఇంటర్వ్యూలో మాట్లాడారు.

నిరుద్యోగిత రేటు తగ్గినా
జూన్ 21వ తేదీతో ముగిసిన వారంలో నిరుద్యోగిత రేటు బారీగా తగ్గిందని, ఉపాధి పెరిగిందని మహేష్ వ్యాస్ తెలిపారు. దీనికి ప్రధానం కారణం mgnrega కింద గ్రామాల్లో ఉపాధి అవకాశాలు పెరగడమేనని చెప్పారు.ఉపాధి పెరిగి నిరుద్యోగిత రేటు తగ్గినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కువమంది తక్కువ వేతనానికి సిద్ధపడ్డారని తెలిపారు. ఉపాధి అంశంలో గ్రామీణంలో భారీగా పెరిగిందని, పట్టణాల్లోను పెరిగినప్పటికీ గ్రామీణంలో ఉన్నంతగా లేదన్నారు.

తక్కువ వేతనాలకు మొగ్గు
ఏప్రిల్, మే నెలల్లో ఉద్యోగ పరిస్థితి దారుణంగా ఉందని, నిరుద్యోగిత రేటు భారీగా పెరిగిందని అభిప్రాయపడ్డారు. కరోనా వ్యాప్తిని తగ్గించేందుకు దీర్ఘకాలిక లాక్ డౌన్ విధించడం చాలామందిని ప్రభావితం చేసిందన్నారు. దీంతో చాలామంది తక్కువ వేతనాలకు కూడా మొగ్గు చూపే పరిస్థితి అన్నారు. అయినప్పటికీ ఉద్యోగాలు ఆశాజనకంగా లేవన్నారు. ఎందుకంటే కంపెనీలు నష్టాల్లోకి వెళ్లి ఎక్కువ వేతనాలు ఇచ్చే పరిస్థితుల్లో లేవు. కాబట్టి తక్కువ వేతనాల ఉద్యోగాలు తీసుకునేందుకు మొగ్గు చూపుతున్నారు.
నిరుద్యోగిత రేటు గ్రామీణ ప్రాంతాల్లో 7.26 శాతానికి తగ్గితే, పట్టణ ప్రాంతంలో 11.2 శాతంగా ఉందని తెలిపారు. ఫార్మల్ సెక్టార్లు కోలుకోవడానికి కాస్త సమయం పడుతుందన్నారు.

గ్రామీణంలో ఆశాజనకం
గ్రామీణ ప్రాంతాల్లో ఆశాజనకంగా కనిపించిందని, గతంలో ఎన్నడు లేనివిధంగా MGNREGA కింద మే నెలలో కేంద్రం ఉపాధిని కల్పించడం ఉపయుక్తంగా మారిందని చెప్పారు. దేశంలో ఉపాధి రేటును పెంచడంలో దీని పాత్ర కచ్చితంగా ఉందని చెప్పారు. అలాగే గ్రామీణ ప్రాంతంలో ఈ సంవత్సరం పంటలు బాగున్నాయని, గత ఏడాదితో పోలిస్తే 30 శాతం వరకు పెరుగుదల కనిపిస్తోందన్నారు. కాబట్టి ఈసారి వృద్ధిలో గ్రామీణం పాత్ర గతంలో కంటే ఎక్కువ అని అభిప్రాయపడ్డారు.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications