ముంబై: స్టాక్ మార్కెట్లు సోమవారం (డిసెంబర్ 7) భారీ లాభాల్లో ముగిశాయి. సూచీలు సరికొత్త గరిష్టాన్ని తాకాయి. లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు ఏ దశలోను కిందకు పడిపోలేదు. మధ్యాహ్నం సెషన్ వరకు 45,200 స్థాయిలో ట్రేడ్ అయిన సెన్సెక్స్, 12 గంటల తర్వాత 45,300 స్థాయికి చేరుకొన్నాయి. ఆ తర్వాత 45,200 కిందకు పడిపోలేదు. ఓ సమయంలో 44,450 సమీపానికి చేరుకొని, చివరకు 350 పాయింట్ల లాభంతో ముగిసింది. ఫైనాన్షియల్, ఫార్మా, ఎఫ్ఎంసీజీ షేర్లు రాణించాయి.

సెన్సెక్స్, నిఫ్టీ సరికొత్త రికార్డులు
నేడు సెన్సెక్స్ 347.42 పాయింట్లు(0.77%) లాభపడి 45,426.97 పాయింట్ల వద్ద, నిఫ్టీ 97.30 పాయింట్లు(0.73%) ఎగిసి 13,355.80 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. 1972 షేర్లు లాభాల్లో, 936 షేర్లు నష్టాల్లో ముగియగా, 190 షేర్లలో ఎలాంటి మార్పులేదు.ఎఫ్‌ఎంసీజీ, ఫైనాన్షియల్ స్టాక్స్ అండతో నిఫ్టీ 13,350 పాయింట్లను క్రాస్ చేసింది. నిఫ్టీ మీడియా కూడా లాభపడింది. జీ ఎంటర్టైన్మెంట్, సన్ టీవీ స్టాక్స్ ఎగిశాయి.
నిఫ్టీ స్మాల్ క్యాప్, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీలు ఒక్కో శాతం చొప్పున లాభపడ్డాయి. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు, ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ, మీడియా స్టాక్స్ ర్యాలీ చేశాయి. రియాల్టీ నష్టాల్లో ముగిసింది.

IRCTC, రిలయన్స్ జంప్
నిఫ్టీ వరుసగా లాభాల్లో కొనసాగుతోంది. IRCTC స్టాక్ జంప్ కావడంతో నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీలు 7వ రోజు లాభపడింది. నిఫ్టీ మీడియా 7వ రోజు మంచి లాభాలు నమోదు చేసింది. నిఫ్టీ PSU బ్యాంకులు 3వ రోజు లాభపడింది. ఎంటీడీ స్టాక్స్ 10 శాతం పెరిగింది. ఎఫ్ఎంసీజీ 4వ రోజు పెరిగింది. ఫార్మా 1 శాతం ఎగిసింది.
రంగాలవారీగా నిఫ్టీ ఆటో 0.10 శాతం, నిఫ్టీ బ్యాంకు 0.53 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.44 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.52 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 1.58 శాతం, నిఫ్టీ ఐటీ 0.59 శాతం, నిఫ్టీ మీడియా 2.79 శాతం, నిఫ్టీ ఫార్మా 1.64 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 2.12 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.45 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ రియాల్టీ 0.34 శాతం నష్టపోయాయి.
IRCTC నేడు దాదాపు 7 శాతం ఎగిసి రూ.1678, రిలయన్స్ షేర్ ధర 0.60 శాతం రూ.1958.35 డాలర్ల వద్ద ముగిసింది.

అందుకే సూచీలు జంప్
అమెరికా-చైనా మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో యూరోపియన్ మార్కెట్లు నష్టపోయాయి. అయితే వ్యాక్సీన్ అందుబాటులోకి రానుందనే వార్తలు ఇన్వెస్టర్లలో ఉత్సాహం నింపాయి. FDIలు కూడా రికార్డుస్థాయిలో ఉన్నాయి. కరోనా కేసులు దేశంలో తగ్గడం, రికవరీలు పెరగడం, ఆర్థిక కార్యకలాపాలు వేగంగా పెరుగుతున్నాయనే అంచనాల నేపథ్యంలో మార్కెట్లు పుంజుకున్నాయి. దీనికి తోడు ఫైనాన్షియల్, బ్యాంకింగ్ స్టాక్స్ ఎగిశాయి.
More From GoodReturns

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Reliance Share: రిలయన్స్ షేర్లు ఎందుకు పడిపోతున్నాయి? ఇన్వెస్టర్లు ఇప్పుడేం చేయాలి?

Stock market: యుద్ధ భయాల్లోనూ దూసుకుపోతున్న షేర్లు.. ఇన్వెస్టర్లకు బంపర్ రిటర్న్స్ ఇచ్చిన పెన్నీ స్టాక్స్!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

పెట్టుబడిదారుల కొంపలు ముంచుతున్న ట్రంప్.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. ఎంతలా అంటే..

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications