For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Markets: డిసెంబర్ లో చావుదెబ్బతిన్న ఇన్వెస్టర్లు.. 32 ఏళ్ల కనిష్ఠానికి మార్కెట్లు.. వచ్చే ఏడాది..?

|

Markets Fall: 2022 డిసెంబర్ మాసంలో భారత స్టాక్ మార్కెట్ సూచీలు భారీగా క్షీణించాయి. క్రిస్మస్ పండుగకు ముందు వారం ట్రేడింగ్ సమయంలో సూచీలు అమాంతం పాతాళానికి జారుకున్నాయి. ఈ క్రమంలో స్టాక్ మార్కెట్ రాబడులు 32 ఏళ్ల కనిష్ఠానికి చేరుకుంది. దీనికి ముందు 2021 డిసెంబర్ క్రిస్మస్ సమయంలో మార్కెట్లు మంచి బూమ్ లో ఉన్నాయి. అయితే ఈ వారం తొలిరోజు మార్కెట్లు తిరిగి పుంజుకోవటంతో ఇన్వెస్టర్లు ఊపిరి పీల్చుకుంటున్నారు.

సెన్సెక్స్ పతనం..

సెన్సెక్స్ పతనం..

డిసెంబర్ మాసంలో సెన్సెక్స్ సూచీ ఏకంగా 5.2 శాతం నష్టపోయింది. ఇది గడచిన 32 ఏళ్లలో డిసెంబర్‌ నెలలో దేశీయ స్టాక్ మార్కెట్లు చూపిన అత్యంత పేలవ ప్రదర్శనగా నమోదైంది. దీనికి ముందు ఇంత భారీ స్థాయిలో అమ్మకాలు చివరగా 2018లో కనిపించాయి. 2021 డిసెంబర్ మాసంలో సూచీలు 2.1 శాతం పెరిగాయి.

లాభాల డిసెంబర్..

లాభాల డిసెంబర్..

సహజంగా డిసెంబర్ మాసంలో మార్కెట్లు లాభాలను నమోదు చేస్తుంటాయి. ఈ ప్రకారం సగటున డిసెంబర్ నెలలో ఇన్వెస్టర్లు 3.5 శాతం రాబడిని పొందుతారు. డిసెంబర్ తర్వాత సెప్టెంబర్ నెలలో సగటు రాబడి 2.7 శాతంగా ఉంది. అలాగే మార్చి నెల అత్యల్ప రాబడిని ఇస్తుంది. సగటున మార్చి నెలలో ఇన్వెస్టర్లకు -1.4 శాతం వరకు రాబడి లభిస్తుంది.

ర్యాలీ అంచనాలు..

ర్యాలీ అంచనాలు..

దేశీయ మార్కెట్లలో నమోదైన భారీ పతనం కారణంగా.. ర్యాలీ అంచనాలు గణనీయంగా తగ్గాయి. 2020లో 2.3 వృద్ధి కనిపించింది. మార్కెట్ రికవరీకి కొంత సమయం పట్టవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. కరోనా భయాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు అమ్మకాలకు మెుగ్గుచూపడంతో ఒత్తిడి నెలకొంది. ఫెడ్ వేగంగా రేట్లను పెంచటం కూడా మరో కారణంగా నిలుస్తోంది. ఫ్రంట్‌లైన్ ఇండెక్స్ మార్చిలో గరిష్టంగా 24 సార్లు క్షీణించింది. అక్టోబర్, జనవరిలో వరుసగా 22-22 సార్లు క్షీణించింది. S&P 500 ఇండెక్స్ ప్రస్తుతం 6.3% క్షీణించింది. జర్మనీ, అమెరికా మార్కెట్లు సైతం ప్రస్తుత మాసంలో నష్టాల్లో ఉండగా.. గత ఏడాది ఇదే కాలంలో లాభాల్లో కొనసాగాయి.

వచ్చే ఏడాది పరిస్థితి..?

వచ్చే ఏడాది పరిస్థితి..?

రానున్న 2023 మార్కెట్లు బూమ్‌ను చూడవచ్చని నిపుణులు అంటున్నారు. ప్రధానంగా అమెరికా, భారత ఈక్విటీ మార్కెట్లపై నిపుణులు సానుకూలంగా ఉన్నారు. ఆర్థిక వ్యవస్థలు బలంగా ఉన్నాయని తెలుస్తోంది. ఫెడ్ రేటు పెంపు ఉన్నప్పటికీ.. అమెరికా ఆర్థిక వ్యవస్థ 0.5 శాతం నుంచి 1 శాతం వరకు వృద్ధి చెందుతుందని అంచనాలు చెబుతున్నాయి. ఇదే క్రమంలో భారత ఆర్థిక వ్యవస్థ వాస్తవ పరంగా 6 శాతానికి పైగా వృద్ధిని నమోదు చేస్తుందని నిపుణుల అంచనాలు చెబుతున్నాయి.

English summary

Markets: డిసెంబర్ లో చావుదెబ్బతిన్న ఇన్వెస్టర్లు.. 32 ఏళ్ల కనిష్ఠానికి మార్కెట్లు.. వచ్చే ఏడాది..? | Stock markets performed worst in december 2022 for last 32 years

Stock markets performed worst in december 2022 for last 32 years
Story first published: Monday, December 26, 2022, 16:22 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X