విదేశీ మార్కెట్లో బలహీనం కావడం, జూన్లో పారిశ్రామిక ఉత్పత్తి దారుణంగా పడిపోవడం వంటి కారణాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు మునుపటి రెండు సెషన్ లలో డోజి నమూనాలు ఏర్పడడంతో బలహీనతలతో నిరుత్సాహంగా ప్రారంభమయ్యాయి. మిడ్ సెషన్ నుండి రికవర్ అయినప్పటికీ చివరికి ఈరోజు దేశీయ స్టాక్ మార్కెట్లలో సెన్సెక్స్ 37 పాయింట్లు క్షీణించి స్వల్ప నష్టాలతో ముగిసింది.
దేశీయ స్టాక్ మార్కెట్ సెన్సెక్స్ 38370 పాయింట్లు వద్ద ముగిసింది. 37 పాయింట్లు క్షీణించి సెన్సెక్స్ స్వల్ప నష్టాలతో ముగియగా, 14 పాయింట్లు స్వల్ప నష్టంతో నిఫ్టీ 11308 పాయింట్ల వద్ద నిలిచింది. స్వల్ప ఒడిదుడుకులతో అటు సెన్సెక్స్, ఇటు నిఫ్టీ హెచ్చుతగ్గులను చవి చూస్తూ మార్కెట్ ను స్వల్ప నష్టాల్లో ముగించాయి . అయితే అమ్మకాలు పెరగడంతో మొదట సెన్సెక్స్ 38,126 దిగువన కనిష్టాన్ని తాకింది. తదుపరి చివర్లో 38,414 వరకూ చేరుకుంది. ఇక నిఫ్టీ 11,243- 11,322 పాయింట్ల మధ్య కొట్టుమిట్టాడింది.

బ్యాంకుల నిధుల సేకరణకు ప్రోత్సాహకరమైన ప్రతిస్పందన కారణంగా బ్యాంకింగ్ స్టాక్స్ పట్ల పెట్టుబడిదారుల ఆసక్తి పెరిగింది. ఎన్‌ఎస్‌ఈలో ప్రభుత్వ రంగ బ్యాంకులు జోరు చూపించాయి. పీఎస్‌యూ బ్యాంక్స్, ఆటో, మీడియా షేర్లు 2.7-3 శాతం మధ్య ఎగిశాయి. అయితే ప్రైవేట్ బ్యాంకులు మాత్రం కాస్త వెనకడుగు వేశాయి. ప్రైవేట్ బ్యాంక్స్, మెటల్, రియల్టీ, ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ షేర్లు 1.5 శాతం నుండి 0.4 శాతం మధ్య నష్టపోయాయి.
ఇక నిఫ్టీ విషయానికి వస్తే ఎస్‌బీఐ, టెక్ మహీంద్రా, ఐషర్,హెచ్‌సీఎల్ టెక్, టాటా మోటార్స్, అదానీ పోర్ట్స్, హీరో మోటర్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, మారుతీ, యూపీఎల్ 5-1 శాతం మధ్య లాభపడ్డాయి. ఇదే సమయంలో కొటక్ బ్యాంక్, బ్రిటానియా,సిప్లా, సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, హిందాల్కో, బీపీసీఎల్, విప్రో, బజాజ్ ఫిన్, ఎల్‌అండ్‌టీ, ఐవోసీ, బజాజ్ ఫైనాన్స్ 2-1 శాతం మధ్య క్షీణించాయి.
More From GoodReturns

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ ప్రధాన సూచీలు..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications