For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఉద్యోగాలపై గుడ్‌న్యూస్: భారత్‌లో సేవారంగానికి ఫుల్ డిమాండ్, జనవరిలో 7ఏళ్ల గరిష్టం

|

భారత ఆర్థిక వ్యవస్థ ముందు ముందు పుంజుకుంటుందని చాలా రోజులుగా వివిధ సర్వేలు చెబుతున్నాయి. మన ఆర్థిక వ్యవస్థ బాగుంటుందని మరో సర్వేలోనూ నిరూపితమైంది. గత ఏడేళ్లలోనే తొలిసారి జనవరి నెలలో ఇండియా ఆధిపత్య సేవ పరిశ్రమ అత్యంత వేగంతో ప్రారంభమైందని బుధవారం ఓ ప్రయివేటు సర్వేలో వెల్లడైంది.

బెంగళూరు తర్వాత.. హైదరాబాద్‌లో యాక్సెంచర్ ఇన్నోవేషన్ హబ్, తొలి నానో ల్యాబ్బెంగళూరు తర్వాత.. హైదరాబాద్‌లో యాక్సెంచర్ ఇన్నోవేషన్ హబ్, తొలి నానో ల్యాబ్

నిన్న తయారీ.. నేడు సేవారంగం

నిన్న తయారీ.. నేడు సేవారంగం

కేంద్ర ప్రభుత్వం చర్యల వల్ల వివిధ రంగాలు పుంజుకొని, భారత ఆర్థిక వ్యవస్థ వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆశాజనకంగా ఉంటుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆ దిశగా దేశ తయారీ రంగ కార్యకలాపాలు పుంజుకుంటున్నాయి. ఇప్పుడు సేవారంగ కార్యకలాపాలు కూడా పరుగు పెడుతోంది. జనవరి నెలలో సేవారంగ కార్యకలాపాలు ఏడేళ్ళ గరిష్టానికి చేరుకున్నాయి. ఈ మేరకు IHS మార్కిట్ ఇండియా సర్వీసెస్ సర్వేలో తేలింది.

ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి

ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి

నిక్కీస్/IHS మార్కిట్ సర్వీసెస్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ డిసెంబర్ 2019లో 53.3గా ఉన్న జనవరి నెలలో 55.5కు చేరుకుంది. సేవారంగం ఇండెక్స్ 2కు పైగా పెరిగింది. దేశీయంగా కొత్త ఆర్డర్లు రావడం, డిమాండ్ పెరగడంతో ఉద్యోగ అవకాశాలు కూడా పెరిగే అవకాశముందని ఈ సర్వే తెలిపింది.

మ్యాన్ పవర్ పెంచుకునే యోచనలో కంపెనీలు

మ్యాన్ పవర్ పెంచుకునే యోచనలో కంపెనీలు

ఆర్డర్స్ పెరుగుతుండటంతో కంపెనీలు కూడా తమ సామర్థ్యాన్ని (మ్యాన్ పవర్ సహా) పెంచుకునే యోచనలో ఉన్నట్లు ఈ సర్వేలో వెల్లడైంది. భారత తయారీ రంగ కార్యకలాపాలు ఈ ఏడాది జనవరి నెలలో 8 ఏళ్ల గరిష్టానికి చేరుకుంది. తయారీ PMI 2019 డిసెంబర్ నెలలో 52.7 పాయింట్లు కాగా, జనవరిలో 55.3 పాయింట్లుగా ఉంది. PMI 50 పాయింట్ల పైన వరుసగా 30వ నెల నమోదయింది. PMI 50 పాయింట్లకు పైన ఉంటే తయారీ రంగ విస్తరిస్తున్నట్లుగా భావించవచ్చు.

ఉద్యోగం కోసం వేచి చూసేవారికి శుభవార్త

ఉద్యోగం కోసం వేచి చూసేవారికి శుభవార్త

ఉద్యోగం కోసం వేచి చూస్తున్న వారికి ఇది శుభవార్త. గత ఆర్థిక సంవత్సరంలో వివిధ రంగాలు కుప్పకూలాయి. కేంద్రం చర్యలతో అన్ని రంగాలు పుంజుకుంటాయని వివిధ సర్వేలు వెల్లడించాయి. ఇప్పుడు అది వాస్తవ రూపం దాల్చుతున్నట్లుగా కనిపిస్తోంది. ఇటీవల నిరుద్యోగిత 45 ఏళ్ల గరిష్టానికి చేరుకున్న విషయం తెలిసిందే.

సామర్థ్యాన్ని పెంచుకునే దిశలో..

సామర్థ్యాన్ని పెంచుకునే దిశలో..

బిజినెస్ రెవెన్యూ పెరుగుతుంటే.. సర్వీస్ ప్రొవైడర్లు తమ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని IHS మార్కిట్ ప్రిన్సిపల్ ఎకనమిస్ట్ పాలీన్నా డీ లీమా అన్నారు. ఇది ఉద్యోగాన్వేషణలో ఉన్న వారికి గుడ్ న్యూస్ అన్నారు. ఆగస్ట్ 2012 నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ భారీగా పడిపోయిన నేపథ్యంలో ఇది శుభపరిణామం అన్నారు.

English summary

ఉద్యోగాలపై గుడ్‌న్యూస్: భారత్‌లో సేవారంగానికి ఫుల్ డిమాండ్, జనవరిలో 7ఏళ్ల గరిష్టం | Solid domestic demand lifts services PMI to seven year high of 55.5 in Jan

India’s service sector started the year with output growth hitting a seven-year high on the basis of strong domestic demand, showed a private survey released on Wednesday.
Story first published: Wednesday, February 5, 2020, 17:23 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X