For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆ ప్రభావంతో... సెన్సెక్స్ సరికొత్త శిఖరాలకు, రిలయన్స్ డౌన్

|

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం (డిసెంబర్ 14) లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం గం.9.17 సమయానికి సెన్సెక్స్ 210.60 పాయింట్లు(0.46%) లాభపడి 46,309.61 పాయింట్ల వద్ద, నిఫ్టీ 65.50 పాయింట్లు(0.48%) ఎగిసి 13,579.40 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. 1292 షేర్లు లాభాల్లో, 255 షేర్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. 60 షేర్లలో ఎలాంటి మార్పులేదు. సెన్సెక్స్ గతవారం 46వేల పాయింట్లని క్రాస్ చేయగా, వారం మొత్తంలో సెన్సెక్స్ 1,019.46 పాయింట్లు లేదా 2.26 శాతం లాభపడింది. ఈ రోజు కూడా 46వేల పాయింట్లకు పైనే కదలాడింది.

రిలయన్స్ డౌన్

రిలయన్స్ డౌన్

నేటి టాప్ గెయినర్స్ జాబితాలో ONGC 3.41 శాతం, కోల్ ఇండియా 3.44 శాతం, సిప్లా 2.93 శాతం, టాటా స్టీల్ 2.19 శాతం, ఐవోసీ 1.86 శాతం లాభపడ్డాయి.

టాప్ లూజర్స్ జాబితాలో ఐచర్ మోటార్స్ 1.67 శాతం, హీరో మోటోకార్ప్ 1.24 శాతం, విప్రో 1.10 శాతం, బజాజ్ ఆటో 1.07 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా 0.97 శాతం నష్టాల్లో ఉన్నాయి.

ఇక, మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో సిప్లా, రిలయన్స్, టాటా స్టీల్, ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఉన్నాయి.

ఉదయం గం.10.30 సమయానికి సెన్సెక్స్ 75 పాయింట్లు లాభపడి 46,175 వద్ద ముగిసింది.

రిలయన్స్ స్టాక్ మళ్లీ రూ.2,000 దిగువకు వచ్చింది. నేడు ప్రారంభ సెషన్లో 0.55 శాతం నష్టపోయి రూ.1955 వద్ద ట్రేడ్ అయింది.

నిఫ్టీ బ్యాంకు

నిఫ్టీ బ్యాంకు

నిఫ్టీ బ్యాంకు 0.36 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.69 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.19 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.01 శాతం, నిఫ్టీ మీడియా 1.02 శాతం, నిఫ్టీ మెటల్ 1.51 శాతం, నిఫ్టీ ఫార్మా 0.62 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 1.37 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.36 శాతం లాభాల్లో ఉన్నాయి.

నిఫ్టీ ఆటో 0.82 శాతం, నిఫ్టీ ఐటీ 0.19 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.22 శాతం నష్టాల్లో ఉన్నాయి.

నిఫ్టీ 50 స్టాక్స్ 0.13 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ 0.61 శాతం లాభపడ్డాయి.

సెన్సెక్స్ ఇప్పటికీ 46,150 పాయింట్లకు పైగానే ట్రేడ్ అవుతోంది. ఉదయం 46,370 పాయింట్లను తాకింది. ఆ తర్వాత స్వల్ప లాభాల్లోకి వచ్చింది.

అందుకే లాభాల్లో...

అందుకే లాభాల్లో...

సెన్సెక్స్ ఓ దశలో 46,370 పాయింట్ల వద్ద ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకింది. పలు దేశాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమవుతోంది. మరిన్ని దేశాల్లో ఆ దిశగా ప్రణాళికలు సాగుతున్నాయి. ఇది ఇన్వెస్టర్ల సెంటిమెంటును బలపరిచి, ఈక్విటీ మార్కెట్లు పుంజుకునేలా చేసింది. కరోనా సంక్షోభం నుండి త్వరలో బయటపడతామనే వార్తలు కూడా దోహదపడ్డాయి. ఇక, డాలర్ మారకంతో రూపాయి మారకం 73.64 వద్ద ఫ్లాట్‌గా ట్రేడ్ అయింది. శుక్రవారం 73.65 వద్ద క్లోజ్ అయింది.

English summary

ఆ ప్రభావంతో... సెన్సెక్స్ సరికొత్త శిఖరాలకు, రిలయన్స్ డౌన్ | Sensex up 100 points, Nifty sub 13600: Burger King Lists At 92 percent Premium

Except IT and Auto, other sectoral indices are trading in the green. Cipla, Coal India, IOC, ONGC and Tata Steel were among major gainers on the Nifty.
Story first published: Monday, December 14, 2020, 11:05 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X