For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారీ లాభాల నుండి కాస్త కిందకు, మార్కెట్ లాభాలకు కారణాలివే

|

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం (మార్చి 1) భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. 2020-21 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి జీడీపీ గణాంకాలు ఉత్సాహంగా ఉండటం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను బలపరిచింది. దీనికి తోడు అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల నుండి సానుకూల సంకేతాలు కనిపించాయి. దీంతో మార్కెట్లు భారీగా జంప్ చేశాయి. సెన్సెక్స్ ఓ సమయంలో 50,000 మార్కు దాటింది. అన్ని రంగాలు కూడా నేడు లాభాల్లోనే ఉన్నాయి. ఆటో సూచీలు దాదాపు రెండు శాతం లాభపడ్డాయి.

పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ తర్వాత నెత్తిన మరో పిడుగు: లీటర్‌కు ఏకంగా రూ.12 పెంపు!పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ తర్వాత నెత్తిన మరో పిడుగు: లీటర్‌కు ఏకంగా రూ.12 పెంపు!

భారీగా ఎగిసిన సెన్సెక్స్

భారీగా ఎగిసిన సెన్సెక్స్

క్రితం సెషన్లో సెన్సెక్స్ 49,099 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. నేడు ప్రారంభమే 650 పాయింట్ల ఎగిసిపడింది. 49,747.71 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్, 50,058.42 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 49,485.00 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 14,702.50 పాయింట్ల వద్ద ప్రారంభమై, 14,806.80 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 14,638.85 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.11.45 సమయానికి సెన్సెక్స్ 702 (1.43%) పాయింట్లు లాభపడి 49,802 పాయింట్ల వద్ద, నిఫ్టీ 212.95 (1.47%) పాయింట్లు ఎగిసి 14,742 పాయింట్ల వద్ద ఉంది. సెన్సెక్స్ ఓ సమయంలో 950 పాయింట్లు కూడా ఎగిసింది. తొలుత 950 పాయింట్ల లాభాల్లో కనిపించిన సెన్సెక్స్ మధ్యాహ్నం గం.12 సమయానికి 570 పాయింట్లకు తగ్గింది.

రిలయన్స్ అప్ అండ్ డౌన్

రిలయన్స్ అప్ అండ్ డౌన్

నేటి టాప్ గెయినర్స్ జాబితాలో మహీంద్రా అండ్ మహీంద్రా 5.06 శాతం,

ONGC 5.00 శాతం, పవర్ గ్రిడ్ కార్పోరేషన్ 4.36 శాతం, UPL 4.31 శాతం, హీరో మోటో కార్ప్ 3.62 శాతం ఉన్నాయి.

టాప్ లూజర్స్ జాబితాలో భారతీ ఎయిర్ టెల్ 4.04 శాతం, SBI లైఫ్ ఇన్సురా 0.93 బజాజ్ ఆటో 0.63 శాతం నష్టపోయింది.

మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో భారతీ ఎయిర్ టెల్, టాటా మోటార్స్, రిలయన్స్, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంకు ఉన్నాయి.

రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ నేడు స్వల్పంగా లాభపడినప్పటికీ, ఆ తర్వాత అంతే అతి స్వల్పంగా నష్టాల్లో ట్రేడ్ అయింది.

రంగాలవారీగా...

రంగాలవారీగా...

నిఫ్టీ 50 సూచీ 1.39 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 1.23 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ఆటో 1.23 శాతం, నిఫ్టీ బ్యాంకు 1.26 శాతం, నిఫ్టీ ఎనర్జీ 1.26 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 1.48 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.35 శాతం, నిఫ్టీ ఐటీ 0.93 శాతం,నిఫ్టీ మీడియా 3.06 శాతం, నిఫ్టీ మెటల్ 1.72 శాతం, నిఫ్టీ ఫార్మా 0.79 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 0.13 శాతం, నిఫ్టీ రియాల్టీ 1.07 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 1.14 శాతం లాభపడ్డాయి.

అందుకే మార్కెట్ జంప్

అందుకే మార్కెట్ జంప్

సూచీలు భారీగా లాభపడటానికి పలు కారణాలు ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం జీడీపీ వృద్ధి రేటు సానుకూలంగా ఉంది. దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్ల నుండి ఉత్సాహకర సంకేతాలు ఇన్వెస్టర్ల సెంటిమెంటును బలపరిచింది. అమెరికా 1.9 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక ప్యాకేజీకి అమోదం తెలిపింది. యూఎస్ పదేళ్ల ట్రెజరీ ఈల్డ్స్‌కు విరామం కనిపించింది. అలాగే, ఆసియా మార్కెట్లో రికవరీ వేగవంతంగా కనిపిస్తోంది. భారత్‌తో పాటు అంతర్జాతీయ ఎకనమిక్ డేటా కూడా సానుకూలంగా ఉంది. అందుకే మార్కెట్లు భారీగా లాభపడ్డాయి.

English summary

భారీ లాభాల నుండి కాస్త కిందకు, మార్కెట్ లాభాలకు కారణాలివే | Sensex surges 700 points: Reasons behind the rebound

A host of triggers on Monday helped benchmark indices rebound from Friday's selloff. Investors cheered progress over the $1.9 trillion Covid rescue plan in the US while welcoming a halt in the rising 10-year US treasury yields. The kickstart of the next phase of coronavirus vaccination in India, rallying Asian markets, data showing expansion in the December quarter GDP and a technical pullback in stocks also boosted the indices.
Story first published: Monday, March 1, 2021, 13:00 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X