For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మార్కెట్ మహా పతనం, ఒక్కరోజులో ఇన్వెస్టర్ల సంపద రూ.5 లక్షల కోట్లు మటాష్

|

ముంబై: స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాల్లో ముగిశాయి. స్టాక్ మార్కెట్లు శుక్రవారం (ఫిబ్రవరి 26) భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఏకంగా 1,939 పాయింట్లు నష్టపోగా, నిఫ్ట 14,430 పాయింట్ల దిగువన ముగిసింది. క్రితం సెషన్లో 51,000కు పైగా ఉన్న సెన్సెక్స్ ఏకంగా 49,000 పాయింట్లకు పడిపోయింది. అన్ని రంగాలు పతనమయ్యాయి. శుక్రవారం స్టాక్ మార్కెట్లు మరో బ్లాక్ ఫ్రైడేను చూశాయి. సూచీలు ఒకే రోజు మూడు శాతానికి పైగా నష్టపోయాయి.సెన్సెక్స్ నేడు 1,939 పాయింట్లు లేదా 3.80 శాతం నష్టపోయి 49,099.99 వద్ద, నిఫ్టీ 568 పాయింట్లు లేదా 3.76 శాతం నష్టపోయి 14,529.15 పాయింట్ల వద్ద ముగిసింది.

సెన్సెక్స్, నిఫ్టీ దాదాపు నాలుగు శాతం మేర నష్టపోవడంతో ఇన్వెస్టర్లు నేడు ఒక్కరోజే రూ.5 లక్షల కోట్లు నష్టపోయారు. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.206.18 కోట్ల నుండి రూ.200.81 లక్షల కోట్లకు తగ్గింది. అన్ని రంగాలు కూడా భారీ నష్టాల్లోనే ముగిశాయి. నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 4.93 శాతం, నిఫ్టీ బ్యాంకు 4.78 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 4.67 శాతం నష్టపోయింది.

Sensex, Nifty tank 4 percent, investors lose Rs 5 lakh crore in a single day

అంతర్జాతీయంగా మార్కెట్లలో నెలకొన్న ఒడుదొడుకులు దేశీయ సూచీలను తీవ్రంగా దెబ్బతీశాయి. కరోనా నుండి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటున్న సంకేతాలతో గతవారం అంతర్జాతీయ మార్కెట్లు ర్యాలీ అయ్యాయి. దీనికి దేశీయంగా బడ్జెట్‌లోని సానుకూల ప్రతిపాదనలు తోడు కావడంతో సూచీలు జీవనకాల గరిష్ఠాల్ని తాకాయి. కానీ, ఈ వారంలో బేర్ పంజాతో ఇటీవల ఆవిరవుతున్నాయి. నేడు మరింత దారుణంగా పతనమైంది. మార్కెట్ల ఒడుదొడుకుల్ని సూచించే వొలటాలిటీ ఇండెక్స్ 19 శాతం నుంచి ఏకంగా 27 శాతానికి ఎగిసింది. సాధారణంగా దీని పెరుగుదల ఇన్వెస్టర్లలో నెలకొన్న ఆందోళన, భవిష్యత్తు భయాల్ని సూచిస్తుంది.

English summary

మార్కెట్ మహా పతనం, ఒక్కరోజులో ఇన్వెస్టర్ల సంపద రూ.5 లక్షల కోట్లు మటాష్ | Sensex, Nifty tank 4 percent, investors lose Rs 5 lakh crore in a single day

A sharp across-the-board sell-off wreaked havoc in the Indian equity market, dragging the benchmark Sensex down by 2,149 points in intraday trade, its worst performance since May 2020. Rising bond yields, geopolitical tensions and concerns over inflation weighed on the market.
Story first published: Friday, February 26, 2021, 21:54 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X