For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రికార్డుల మోత మోగించిన సెన్సెక్స్, నిఫ్టీ.. సరికొత్త చరిత్రతో పరుగులు పెట్టిన సూచీలు

|

భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ సరికొత్త రికార్డును సృష్టించాయి. గ్లోబల్ మార్కెట్లలో వీచిన ప్రతికూల పవనాల సహకారంతోపాటు, ప్రభుత్వ సంస్కరణల వార్తలు, జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ నేపథ్యంలో సూచీలు పరుగులు పెట్టాయి. దాంతో సెన్సెక్స్, నిఫ్టీలు ఆల్ టైమ్ గరిష్టస్థాయి వద్ద ముగిసాయి.

సెన్సెక్స్ అరశాతం వృద్ధిని సాధించింది. క్రితం ముగింపుకు 206.40 పాయింట్ల లాభంతో 41,558.57 వద్ద క్లోజైంది. ఇంట్రాడే ట్రేడింగ్‌లో 41,442.75 పాయింట్ల వద్ద ఆరంభమై, 41,614.77 పాయింట్ల గరిష్టస్థాయిని, 41,358.47 కనిష్టస్థాయిని తాకి చివరకు 41558.57 పాయింట్ల వద్ద ముగిసింది.

 Sensex, Nifty closes at all time highs

మరో ప్రధాన సూచీ నిఫ్టీ విషయానికి వస్తే క్రితం ముగింపుకు 56.25 వృద్ధిని సాధించి 12221.65 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రాడే ట్రేడింగ్‌లో 12,197.00 పాయింట్ల వద్ద మొదలై, 12,237.70 పాయింట్ల గరిష్టస్థాయిని, 12,163.45 కనిష్టస్థాయిని నమోదు చేసి చివరకు 12221.65 వద్ద క్లోజైంది. గత 52 వారాల్లో నిఫ్టీ, సెన్సెక్స్‌కు ఇదే అత్యుత్తమ గరిష్టస్థాయి.

ప్రధాన సూచీలు లాభాల బాట పట్టడానికి టాటా స్టీల్, టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టాటా మోటార్స్ సహకారం అందించాయి. అయితే టాటామోటార్స్, గెయిల్, గ్రాసిం, ఎస్‌బీఐ, ఎస్ బ్యాంక్ సూచీలు నష్టాల్ని నమోదు చేసుకొన్నాయి.

English summary

రికార్డుల మోత మోగించిన సెన్సెక్స్, నిఫ్టీ.. సరికొత్త చరిత్రతో పరుగులు పెట్టిన సూచీలు | Sensex, Nifty closes at all time highs

Indian Stock Market prime indexes Sensex, Nifty, Bank Nifty end at record highs ahead of GST council meet. Sensex closes at 41,558.57, Nifty 12221.65.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X