For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు, ఐటీ డౌన్: బలహీనపడిన రూపాయి

|

ముంబై: భారత స్టాక్ మార్కెట్లో భారీ నష్టాల్లో సాగుతున్నాయి. ఉదయం ప్రారంభంలోనే సెన్సెక్స్ 221.29 పాయింట్లు లేదా 0.59% నష్టపోయి 37,385.60 వద్ద, నిఫ్టీ 54.30 పాయింట్లు లేదా 0.49% పడిపోయి 11,019.20 వద్ద ప్రారంభమయ్యాయి. 572 షేర్లు లాభాల్లో, 465 షేర్లు నష్టాల్లో, 86 షేర్లలో ఎలాంటి మార్పులు లేకుండా ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత కాసేపట్లోనే సెన్సెక్స్ 350 పాయింట్లు నష్టపోయింది. మధ్యాహ్నం గం.2 సమయానికి సెన్సెక్స్ 575 పాయింట్లు నష్టపోయి 37,032 వద్ద ట్రేడ్ అయింది. బ్యాంకులు, ఫైనాన్స్, ఐటీ స్టాక్స్ తీవ్ర ఒత్తిడిలో కూరుకుపోయాయి. బంధన్ బ్యాంకు షేర్లు ఏకంగా 10 శాతం నష్టపోయాయి. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి.

టిక్‌టాక్ కొనుగోలుపై ట్రంప్‌కు సత్య నాదెళ్ల కీలక సమాచారం! ఇండియాలో ఏం చేస్తారు?టిక్‌టాక్ కొనుగోలుపై ట్రంప్‌కు సత్య నాదెళ్ల కీలక సమాచారం! ఇండియాలో ఏం చేస్తారు?

మెటల్, ఫార్మా స్టాక్స్ జూమ్

మెటల్, ఫార్మా స్టాక్స్ జూమ్

మధ్యాహ్నం గం.2 సమయానికి టాప్ గెయినర్స్ జాబితాలో టాటా మోటార్స్, టైటాన్ కంపెనీ, బీపీసీఎల్, టాటా స్టీల్, గ్రాసిమ్ ఉండగా, టాప్ లూజర్స్ జాబితాలో యూపీఎల్, ఇండస్ ఇండ్ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, యాక్సిస్ బ్యాంకు, కొటక్ మహీంద్ర ఉన్నాయి. బ్యాంకు, ఎనర్జీ, ఐటీ, ఇన్ఫ్రా స్టాక్స్ అమ్మకాలు వెల్లువెత్తాయి. నిఫ్టీ ఏకంగా 11,000 మార్క్ దిగువకు పడిపోయింది. కేవలం మెటల్, ఫార్మా స్టాక్స్ మాత్రమే కొనుగోళ్లు చూశాయి. జూలైలో ఆటో సేల్స్ కాస్త పుంజుకోవడంతో ఈ రంగం స్టాక్స్ లాభాల్లో ఉన్నాయి.

ఈ షేర్లు భారీగా జంప్

ఈ షేర్లు భారీగా జంప్

ఎన్ఎస్ఈలో ప్రయివేటు బ్యాంక్స్ రెండు శాతానికి పైగా నష్టపోయాయి. ఐటీ, రియాల్టీ షేర్లు దాదాపు ఒక శాతం పడిపోయాయి. ఫార్మా, మెటల్‌తో పాటు పీఎస్‌యూ బ్యాంక్ షేర్లు ఒక శాతానికి పైగా లాభాల్లో ఉన్నాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ లాభాల్లో ఉన్నాయి. ఎన్ఎస్ఈలో బంధన్ బ్యాంకు పది శాతానికి పైగా కుంగిపోయింది. పలు షేర్లు 52 వారాల గరిష్టాన్ని తాకాయి. కొన్ని ఎంపిక చేసిన మిడ్, స్మాల్ క్యాప్ కౌంటర్లు నష్టాలకు ఎదురీదుతున్నాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడ్డారు. కొన్ని కౌంటర్లలో ట్రేడింగ్ పరిమాణం పెరిగింది. ఎన్ఎస్ఈలో యాంబర్ ఎంటర్ ప్రైజెస్, లారస్ ల్యాబ్స్, గ్రాన్యూల్ ఇండియా, డిక్సన్ టెక్నాలజీస్ ఏడు శాతం నుండి 15 శాతం ఎగిశాయి.

అంతర్జాతీయ మార్కెట్లు

అంతర్జాతీయ మార్కెట్లు

కార్పోరేట్ ఆదాయాలు క్షీణించాయి. ఈ ప్రభావం కూడా అంతర్జాతీయ మార్కెట్లపై ఈ వారం పడుతుంది. అమెరికా సహా వివిధ దేశాల ఉద్దీపనలు, ఎర్నింగ్స్ నేపథ్యంలో యూరోపియన్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమవుతాయని అంటున్నారు. పాన్-యూరోపియన్ స్టాక్స్ 600 ప్రారంభంలో 0.2 శాతం నష్టపోయింది. ఆ తర్వాత స్వల్పంగా కోలుకుంది. ట్రావెల్ స్టాక్స్ 1.8 శాతం, కెమికల్, ఆటో 0.6 శాతం చొప్పున నష్టపోయాయి.

బలహీనపడిన రూపాయి

బలహీనపడిన రూపాయి

డాలర్ మారకంతో రూపాయి ఈ రోజు 74.90 వద్ద ప్రారంభమైంది. 20 పైసల నష్టంతో 75.01 వద్ద ముగిసింది. డొమెస్టిక్ ఈక్విటీ మార్కెట్లో అమ్మకాలు వెల్లువెత్తడంతో ఈ ప్రభావం రూపాయి పైన పడింది. ఈ రోజు 74.88-75.03 మధ్య ట్రేడ్ అయింది. అంతకుముందు సెషన్‌లో 74.81 వద్ద ముగిసింది.

English summary

భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు, ఐటీ డౌన్: బలహీనపడిన రూపాయి | Sensex, Nifty at day's low: bank, IT stocks under pressure

Benchmark indices extended the losses with Nifty below 11,000 mark on the back of selling seen in the bank, energy, IT and infra stocks, while metal and pharma stocks are witnessing buying.
Story first published: Monday, August 3, 2020, 15:00 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X