భారీగా ఎగిసి, అంతలోనే పతనం: 50,000 పాయింట్లను నిలుపుకోని సెన్సెక్స్
ముంబై: ఉదయం భారీగా లాభపడి సరికొత్త శిఖరాలను తాకిన స్టాక్ మార్కెట్లు సాయంత్రానికి కుప్పకూలాయి. సెన్సెక్స్ తొలిసారి 50,000 మార్కును దాటినప్పటికీ, నిలుపుకోలేకపోయింది. రోజంతా 50,000కు పైనే ఉన్న సూచీ చివరి గంటలో మాత్రం తేలిపోయింది. చివరకు 167 పాయింట్ల నష్టాల్లో ముగిసింది. ఓ సమయంలో 49,400 దిగువకు చేరుకున్న ఆ తర్వాత స్వల్పంగా పుంజుకున్నప్పటికీ, నష్టాల్లోనే ముగిశాయి.
అది సరిపోదు.. ఇంకా: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లకు గట్టి షాకిచ్చే దిశగా కేంద్ర ప్రభుత్వం!

సెన్సెక్స్ భారీగా ఎగిసి, అంతలోనే పతనం
సెన్సెక్స్ 50,096 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. 50,184 పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకింది. 49,399 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ దాదాపు 800 పాయింట్ల మధ్య కదలాడింది. అలాగే, నేటి రికార్డ్ గరిష్టం నుండి 560 పాయింట్ల నష్టంతో ముగిసింది. సెన్సెక్స్ 167 పాయింట్లు లేదా 0.34 శాతం క్షీణించి 49,624.76 పాయింట్ల వద్ద, నిఫ్టీ 54 పాయింట్లు లేదా 0.37 శాతం పడిపోయి 14,590.35 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు నష్టపోయాయి.

టాప్ గెయినర్స్, లూజర్స్
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో టాటా మోటార్స్ 5.71 శాతం, బజాజ్ ఫైనాన్స్ 2.74 శాతం, రిలయన్స్ 2.18 శాతం, బజాజ్ ఆటో 1.63 శాతం, ఐచర్ మోటార్స్ 1.56 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో ONGC 4.20 శాతం, టాటా స్టీల్ 3.40 శాతం, గెయిల్ 3.08 శాతం, కోల్ ఇండియా 2.93 శాతం, SBI 2.55 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో టాటా మోటార్స్, రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, బజాజ్ ఫిన్ సర్వ్ ఉన్నాయి.

రంగాలవారీగా..
నిఫ్టీ 50 స్టాక్స్ 0.37 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 1.64 శాతం మేర నష్టపోయాయి. నిఫ్టీ ఆటో 0.01 శాతం, నిఫ్టీ బ్యాంకు 1.10 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.18 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.74 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.32 శాతం, నిఫ్టీ ఐటీ 0.64 శాతం, నిఫ్టీ మీడియా 2.04 శాతం, నిఫ్టీ మెటల్ 2.18 శాతం, నిఫ్టీ ఫార్మా 1.43 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 3.27 శాతం, నిఫ్టీ రియాల్టీ 2.56 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 1.00 శాతం నష్టపోయాయి.