భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు, 50,000 పాయింట్ల వద్ద సెన్సెక్స్
ముంబై: స్టాక్ మార్కెట్ నేడు భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. అయితే మధ్యాహ్నం సమయానికి లాభాల్లో ఉన్నప్పటికీ తగ్గుముఖం పట్టాయి. సెన్సెక్స్ నేడు ఓ సమయంలో 50 పాయింట్లను దాటింది. ఉదయం గం.9.30 సమయానికి సెన్సెక్స్ 400 పాయింట్లకు పైగా లాభపడింది. మధ్యాహ్నం గం.1 సమయానికి 135 పాయింట్ల లాభంతో ఉంది. ఆసియా మార్కెట్లు దాదాపు స్థిరంగా ఉండగా, జపాన్ సూచీ నిక్కీ 0.4 శాతం, హాంకాంగ్ సూచీ హాంగ్‌షెంగ్ 0.7 శాతం, షాంఘై కాంపోజిట్ 0.8 శాతం నష్టాల్లో ఉంది.
సోమవారం అమెరికా మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఆర్థిక ప్యాకేజీ, జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సీన్ వార్తలు అగ్రరాజ్యం మార్కెట్లకు ఊతమిచ్చాయి. దేశీయంగా సోమవారం FPIలు నికరంగా రూ.125 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. దేశీయ ఇన్వెస్టర్లు రూ.195 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. ఈ పరిణామాలు సూచీలపై ప్రభావం చూపాయి.
బాగా నడవండి, చెప్పింది తినండి! 80%-100% వరకు ఆఫర్, వారు చెప్పింది చేస్తే ఆఫర్లు

సెన్సెక్స్ భారీ లాభాల నుండి స్వల్ప లాభాల్లోకి
నిన్న 49,850 పాయింట్ల వద్ద ముగిసిన సెన్సెక్స్ నేడు ఆరంభంలోనే 410 పాయింట్లు లాభపడి 50,258.09 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఓ సమయంలో 570 పాయింట్ల వరకు లాభపడింది. మధ్యాహ్నం గం.1 సమయానికి 0.23 శాతం లాభంతో 114 పాయింట్లు ఎగిసి 49,965 వద్ద ట్రేడ్ అయింది. 49,807 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది.
నిఫ్టీ 14,865 పాయిట్ల వద్ద ప్రారంభమై, 14,933 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 17,760 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది.

టాప్ గెయినర్స్, లూజర్స్
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో మహీంద్రా అండ్ మహీంద్రా 4.69 శాతం, టాటా మోటార్స్ 4.36 శాతం, హీరో మోటో కార్ప్ 3.79 శాతం, విప్రో 3.60 శాతం, బజాజ్ ఆటో 2.94 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో ONGC 3.08 శాతం, HDFC 1.98 శాతం, పవర్ గ్రిడ్ కార్పోరేషన్ 1.41 శాతం, UPL 0.97 శాతం, హిండాల్కో 0.87 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో టాటా మోటార్స్, రిలయన్స్, బీపీసీఎల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, భారతీ ఎయిర్ టెల్ ఉన్నాయి.
రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ నేడు ప్రారంభంలో భారీగా లాభపడినప్పటికీ ఆ తర్వాత అతి స్వల్పంగా నష్టపోయింది. మధ్యాహ్నం గం.1.00 సమయానికి రిలయన్స్ 0.24 శాతం నష్టపోయి రూ.2097 వద్ద ట్రేడ్ అయింది.

రంగాలవారీగా...
నిఫ్టీ 50 సూచీ 0.38 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 1.16 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ఆటో 2.81 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.19 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.86 శాతం, నిఫ్టీ ఐటీ 1.86 శాతం, నిఫ్టీ మీడియా 0.39 శాతం, నిఫ్టీ మెటల్ 0.35 శాతం, నిఫ్టీ ఫార్మా 0.76 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.35 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ బ్యాంకు 0.30 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.51 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 0.15 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.39 శాతం నష్టపోయాయి.