For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చివర్లో అమ్మకాల ఒత్తిడి, నష్టాల్లో మార్కెట్లు: మిశ్రమంగా ఆసియా మార్కెట్

|

ముంబై: స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. ఉదయం లాభాల్లో మొదలైన మార్కెట్లు, చివరి గంటలో అమ్మకాల ఒత్తిడికిగురై వరుసగా రెండో రోజు నష్టాలను చవిచూశాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, ఎఫ్ఎంసీజీ రంగాల్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఫార్మారంగ షేర్లు కొనుగోళ్ల మద్దతుతో ఎగిసిపడ్డాయి. దీంతో మార్కెట్ భారీ నష్టాల నుండి తప్పించుకుంది. సెన్సెక్స్ 134 పాయింట్లు (0.34 శాతం) నష్టపోయి 38,845.82 పాయింట్ల వద్ద, నిఫ్టీ 11 పాయింట్లు (0.10 శాతం) క్షీణించి 11,504.95 పాయింట్ల వద్ద ముగిసింది. ఉదయం సెన్సెక్స్ 150 పాయింట్లు పైగా లాభంతో ప్రారంభమైంది. చివరకు నష్టాల్లో ముగిసింది.

అనవసర ఫోన్ కాల్స్‌పై 'దూస్రా', రూ.700తో సబ్‌స్క్రైబ్: హైదరాబాద్ కంపెనీ కంపెనీ యాప్అనవసర ఫోన్ కాల్స్‌పై 'దూస్రా', రూ.700తో సబ్‌స్క్రైబ్: హైదరాబాద్ కంపెనీ కంపెనీ యాప్

చివరలో అమ్మకాల ఒత్తిడి

చివరలో అమ్మకాల ఒత్తిడి

టాప్ గెయినర్స్ జాబితాలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, సిప్లా, అదానీ పోర్ట్స్, భారతీ ఎయిర్‌టెల్, గ్రాసీమ్ ఉండగా, టాప్ లూజర్స్ జాబితాలో HDFC బ్యాంకు, కొటక్ మహీంద్రా, బజాజ్ ఫిన్ సర్వ్, శ్రీ సిమెంట్స్, మారుతీ సుజుకీ ఉన్నాయి. డాక్టర్ రెడ్డీస్ స్టాక్స్ 10 శాతానికి పైగా, నాట్కో షేర్ ధర 14 శాతం వరకు లాభపడింది. సిప్లా 7 శాతానికి పైగా ఎగిసింది. ఎయిర్‌టెల్ 3 శాతానికి పైగా లాభపడింది. బ్యాంకింగ్, ఫైనాన్స్ స్టాక్స్ చివరి గంటలో అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్ 0.26 శాతం లాభంతో, బీఎస్ఈ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.32 శాతం నష్టంతో లాభపడ్డాయి. బీఎస్ఈ హెల్త్ కేర్ 3 శాతం మేర లాభపడింది. టెలికం, రియాల్టీ, యుటిలిటీ స్టాక్స్ ఒక శాతం మేర లాభపడ్డాయి.

ఎగిసిపడిన ఫార్మా

ఎగిసిపడిన ఫార్మా

- సెన్సెక్స్, నిఫ్టీ స్వల్పంగా క్షీణించాయి. నిఫ్టీ బ్యాంకు 1 శాతం నష్టపోయింది.

- నిఫ్టీ బ్యాంకు 289 పాయింట్లు కోల్పోయింది. మిడ్ క్యాప్ ఇండెక్స్ 12 పాయింట్లు నష్టపోయింది.

- HDFC బ్యాంకు, HDFC, ఇన్ఫోసిస్, కొటక్ బ్యాంకు, హెచ్‌యూఎల్, టీసీఎస్ నిఫ్టీ టాప్ లూజర్స్.

- ఫార్మా స్టాక్స్ ఎగిసిపడ్డాయి. నిఫ్టీ ఫార్మా అయిదేళ్ల గరిష్టాన్ని తాకింది.

- డాక్టర్ రెడ్డీస్, సిప్లా, నాట్కో, లారస్, దివిస్, లుపిన్, కాడిలా, 52 వారాల గరిష్టాన్ని తాకాయి.

- మహీంద్రా అండ్ మహీంద్రా 52 వారాల గరిష్టాన్ని తాకింది.

- ఈ వారం సెన్సెక్స్ నష్టాల్లోనే ముగిసింది. ఈ వారం ప్రారంభం (సోమవారం) 39వేలకు పైగా ప్రారభమై ఇప్పుడు 39వేల దిగువన ముగిసింది.

నిన్న ఐపీవోకు వచ్చిన హ్యాపీయెస్ట్ మైండ్స్ టెక్నాలజీస్ ఈ రోజు నష్టాల్లో ముగిసింది. ఈ స్టాక్స్ 3.61 శాతం మేర నష్టపోయి రూ.357 వద్ద ముగిసింది. నిన్న రూ.371 వద్ద క్లోజ్ అయిన షేరు, ఈ రోజు ఉదయం రూ.375 వద్ద ప్రారంభమైంది. చివరకు రూ.13.40 నష్టంతో ముగిసింది.

ఆసియా మార్కెట్ మిశ్రం

ఆసియా మార్కెట్ మిశ్రం

ఆసియా మార్కెట్ల విషయానికి వస్తే మిశ్రమంగా ఉన్నాయి. చైనా మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. షాంఘై కాంపోజిట్ ఇండెక్స్ 2.1 శాతం లాభపడింది. హాంగ్ కాంగ్ హాంగ్ షెంగ్ 0.37 శాతం, జపాన్ నిక్కీ 0.18 శాతం, తైవాన్‌కుచెందిన టీఎస్ఈసీ 50 ఇండెక్స్ 0.02 శాతం మేర లాభపడ్డాయి. ఆస్ట్రేలియా మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి.

English summary

చివర్లో అమ్మకాల ఒత్తిడి, నష్టాల్లో మార్కెట్లు: మిశ్రమంగా ఆసియా మార్కెట్ | Sensex falls 134 points, Nifty holds 11,500: Happiest Minds slips 2 percent

Among the sectoral indices, BSE Healthcare ended with gains of over 3 percent. Telecom, Realty and Utilities also logged gains of over 1 percent.
Story first published: Friday, September 18, 2020, 18:37 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X