For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మురిసిన ఇన్వెస్టర్లు, సెన్సెక్స్ సూపర్: మార్కెట్ జూంలో రిలయన్స్ వాటానే అధికం

|

ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు గురువారం (సెప్టెంబర్) భారీ లాభాల్లో ముగిశాయి. ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు ఎగిసిపడ్డాయి. ఉదయం ప్రారంభంలోనే లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు, ఆ తర్వాత అదే ఒరవడి కొనసాగించాయి. చివరకు సెన్సెక్స్ 646 పాయింట్లు లేదా 1.69 శాతం లాభంతో 38,840.32 వద్ద, నిఫ్టీ 171 పాయింట్లు లేదా 1.52 శాతం లాభంతో 11,449.25 పాయింట్ల వద్ద ముగిశాయి. సెన్సెక్స్ 39వేల సమీపానికి చేరుకోగా, నిఫ్టీ 11,500 సమీపానికి చేరుకుంది. బీఎస్ఈ మిడ్ క్యాప్ 0.92 శాతం లాభపడగా, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.27 శాతం లాభపడింది. నేడు ఇన్వెస్టర్లు లాభాల వర్షంతో తడిసిపోయారు.

'టార్గెట్'ను చేధించిన రిలయన్స్, షేర్ రికార్డ్: రూ.15 లక్షల కోట్లతో సరికొత్త రికార్డ్'టార్గెట్'ను చేధించిన రిలయన్స్, షేర్ రికార్డ్: రూ.15 లక్షల కోట్లతో సరికొత్త రికార్డ్

అదరగొట్టిన రిలయన్స్

అదరగొట్టిన రిలయన్స్

రిలయన్స్ ఇండస్ట్రీస్ విభాగం రిలయన్స్ రిటైల్‌లోకి సిల్వర్ లేక్ పెట్టుబడులు రావడం, కేకేఆర్ పెట్టుబడులు పెడుతుందనే వార్తలు, అమెజాన్‌తో చర్చలు జరుగుతున్నాయనే వాదనల నేపథ్యంలో ఈ షేర్లు అదరగొట్టాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏకంగా 7 శాతానికి పైగా లాభపడి రూ.2,314 వద్ద ముగిసింది. టాప్ గెయినర్స్ జాబితాలో రిలయన్స్ తర్వాత బీపీసీఎల్, ఏషియన్ పేయింట్స్, గ్రాసీమ్, ఐవోసీ ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో భారతీ ఇన్ఫ్రాటెల్, హిండాల్కో, టాటా స్టీల్, భారతీ ఎయిర్టెల్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఉన్నాయి.

నిఫ్టీ లాభంలో రిలయన్స్ వాటానే అధికం.. రూ.1 లక్ష కోట్లకు పైగా

నిఫ్టీ లాభంలో రిలయన్స్ వాటానే అధికం.. రూ.1 లక్ష కోట్లకు పైగా

నేటి మార్కెట్లో రిలయన్స్ కాంట్రిబ్యూషన్ ఎక్కువ. నిఫ్టీ 171 పాయింట్లు లాభపడగా ఇందులో రిలయన్స్ కాంట్రిబ్యూషన్ 126 పాయింట్లు కావడం గమనార్హం. మార్కెట్ క్యాపిటలైజేషన్ 200 బిలియన్ డాలర్లకు చేరుకున్న తొలి ఇండియన్ కంపెనీగా రిలయన్స్ ఘతన సాధించింది. రిలయన్స్ ఒక్కో షేర్ వ్యాల్యూ రూ.157.65 పైసలు ఎగబాకింది. ఈ రోజు రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1 లక్ష కోట్లకు పైగా పెరిగింది.

మార్కెట్ లాభాలకు కారణం...

మార్కెట్ లాభాలకు కారణం...

నిఫ్టీ లాభంలో రిలయన్స్ వాటానే ఎక్కువ. దీంతో మార్కెట్ లాభాలపై ఈ ప్రభావం పడింది. ఇతర అంశాల విషయానికి వస్తే చైనా - భారత్ మధ్య తీవ్ర ఉద్రిక్తతల కారణంగా ఆ ప్రభావం నిన్నటి వరకు మార్కెట్లపై పడింది. తాజాగా చర్చల నేపథ్యంలో మార్కెట్లు సానుకూలంగా స్పందించాయి. నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగాలు వరుసగా 0.9 శాతం, 0.7 శాతం లాభపడ్డాయి. కరోనా కేసు రికవరీలు పెరగడం, వ్యాక్సీన్ పైన మళ్లీ ఆశాజనక వార్తలు రావడం మార్కెట్లపై ప్రభావం కనిపించింది.

English summary

మురిసిన ఇన్వెస్టర్లు, సెన్సెక్స్ సూపర్: మార్కెట్ జూంలో రిలయన్స్ వాటానే అధికం | Sensex ends 646 points higher, Nifty above 11,450: 4 factors that lifted market

Experts, however, have advised caution ahead of the European Central Bank's policy meeting later in the day.
Story first published: Thursday, September 10, 2020, 19:33 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X