For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారీ నష్టాల్లో మార్కెట్లు, 46,000 దిగువకు సెన్సెక్స్: IRCTC, అల్ట్రా టెక్ భారీ పతనం

|

ముంబై: నిన్న భారీగా లాభపడిన దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు (గురువారం, డిసెంబర్ 10) నష్టాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 46వేల దిగువకు, నిప్టీ 13,500 దిగువకు వచ్చాయి. ఉదయం గం.09:16 సమయానికి సెన్సెక్స్ 179.07 పాయింట్లు(0.39%) నష్టపోయి 45,924.43 పాయింట్ల వద్ద, నిఫ్టీ 58 పాయింట్లు(0.43%) క్షీణించి 13,471.10 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. 660 షేర్లు లాభాల్లో, 677 షేర్లు నష్టాల్లో ప్రారంభం కాగా, 86 షేర్లలో ఎలాంటి మార్పులేదు. పీఎస్‌యూ బ్యాంకు, ఐటీ, మెటల్ స్టాక్స్ అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. బ్యాంకింగ్, ఐటీ స్టాక్స్ నష్టాల్లో ఉన్నాయి.

రూ.1 లక్ష కోట్లకు పైగా పెరిగిన సంపద, మార్కెట్ దూకుడుకు కారణాలివేరూ.1 లక్ష కోట్లకు పైగా పెరిగిన సంపద, మార్కెట్ దూకుడుకు కారణాలివే

IRCTCపై ఆఫర్ సేల్ ప్రభావం

IRCTCపై ఆఫర్ సేల్ ప్రభావం

ఉదయం గం.10.10 సమయానికి సెన్సెక్స్ 356.76 (0.77%) పాయింట్లు నష్టపోయి 45,746.74 పాయింట్ల వద్ద ఉంది. గత కొద్దిరోజులుగా పైపైకి కదిలిన IRCTC స్టాక్ నేడు ఓ దశలో 15 శాతం నష్టపోయింది. ఉదయం గం.10 సమయానికి 6 శాతం నష్టపోయి రూ.1,515 వద్ద ఉంది. IRCTCకి చెందిన 20 శాతం వాటాలను ఆఫర్ సేల్ కింద విక్రయిస్తున్నట్లు ప్రకటించడం ప్రతికూల ప్రభావం చూపింది. ఈ ఆఫర్ ద్వారా IRCTC రూ.4,374 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. అల్ట్రా టెక్ సిమెంట్ షేర్ రెండు శాతం పడిపోయింది.

టాప్ గెయినర్స్, లూజర్స్

టాప్ గెయినర్స్, లూజర్స్

నేడు టాప్ గెయినర్స్ జాబితాలో నెస్ట్లే 1.47 శాతం, మారుతీ సుజుకీ 1.13 శాతం, టైటాన్ కంపెనీ 0.60 శాతం, బ్రిటానియా 0.41 శాతం, HCL టెక్ 0.19 శాతం లాభపడ్డాయి.

టాప్ లూజర్స్ జాబితాలో UPL 14.28 శాతం, టాటా మోటార్స్ 2.71 శాతం, ఐవోసీ 2.45 శాతం, అల్ట్రా టెక్ సిమెంట్ 2.38 శాతం, శ్రీసిమెంట్స్ 2.22 శాతం నష్టపోయాయి.

నేటి మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో యూపీఎల్, రిలయన్స్, మారుతీ సుజుకీ, టాటా స్టీల్, ఇన్ఫోసిస్ ఉన్నాయి. యూపీఎల్ స్టాక్ ఏకంగా 14 శాతానికి పైగా పడిపోయింది.

రిలయన్స్ స్టాక్ 0.84 శాతం క్షీణించి రూ.2,009 వద్ద ఉంది.

రంగాలవారీగా..

రంగాలవారీగా..

ఎల్ అండ్ టీ టెక్నాలజీ సర్వీసెస్ స్టాక్ 52 వారాల గరిష్టాన్ని తాకింది. రంగాల వారీగా చూస్తే నిఫ్టీ 50 0.69 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ 1.42 శాతం నష్టపోయింది. నిఫ్టీ ఆటో 0.28 శాతం, నిఫ్టీ బ్యాంకు 1.08 శాతం, నిఫ్టీ ఎనర్జీ 1.46 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ స్టాక్స్ 1.07 శాతం, నిఫ్టీ ఐటీ 0.21 శాతం, నిఫ్టీ మీడియా 2.42 శాతం, నిఫ్టీ మెటల్ 1.05 శాతం, నిఫ్టీ ఫార్మా 0.61 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 2.73 శాతం, నిఫ్టీ రియాల్టీ 3.65 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 1.04 శాతం చొప్పున నష్టపోయాయి.కేవలం నిఫ్టీ ఎఫ్ఎంసీజీ మాత్రం స్వల్పంగా 0.20 శాతం లాభపడింది.

English summary

భారీ నష్టాల్లో మార్కెట్లు, 46,000 దిగువకు సెన్సెక్స్: IRCTC, అల్ట్రా టెక్ భారీ పతనం | Sensex drops 350 points, Nifty 13,450: IRCTC drops 9 percent

All the sectoral indices trading in the red led by the PSU Bank, infra and energy. UPL, UltraTech Cement, Tata Motors, IOC and Gail were among major losers on the Nifty.
Story first published: Thursday, December 10, 2020, 11:19 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X