For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లాభాల నుండి భారీ నష్టాల్లోకి స్టాక్ మార్కెట్లు, ఇన్ఫోసిస్ 5% డౌన్

|

ముంబై: స్టాక్ మార్కెట్లు గురువారం లాభాల్లో ప్రారంభమై, నష్టాల్లోకి వెళ్లాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్ ఫలితాల అనంతరం ఐటీ రంగం నష్టాల్లో కనిపిస్తోంది. మెటల్ రంగం భారీగా లాభపడింది. ప్రపంచ పరిణామాలు, భారీ నష్టాల అనంతరం ఒకరోజు మార్కెట్లకు సెలవు రావడంతో కోలుకోవడానికి సహకరించిందని ఆశించిన క్షణాల్లోనే నష్టపోయాయి. ఓ సమయంలో దాదాపు 300 పాయింట్లు నష్టపోయింది. ఉదయం మాత్రం స్వల్పంగా 140 పాయింట్ల లాభం కూడా కనిపించింది. నేడు విప్రో, హాత్‌వే భవానీ కేబుల్స్ అండ్ డేటాకామ్ వంటి సంస్థలు ఫలితాలు ప్రకటిస్తున్నాయి.

లాభాల్లో మార్కెట్లు

లాభాల్లో మార్కెట్లు

సెన్సెక్స్ ఉదయం 48,512.77 పాయింట్ల వద్ద ప్రారంభమై, 48,686.17 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 48,274.03 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 14,522.40 పాయింట్ల వద్ద ప్రారంభమై, 14,566.80 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 14,432.35 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. ఉదయం గం.10 సమయానికి సెన్సెక్స్ 156.15 (0.32%) పాయింట్లు నష్టపోయి 48,388 పాయింట్ల వద్ద, నిఫ్టీ 34.55 (0.24%) పాయింట్లు క్షీణించి 14,470 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది.

టాప్ లూజర్స్, గెయినర్స్

టాప్ లూజర్స్, గెయినర్స్

ఉదయం సమయంలో నేటి టాప్ గెయినర్స్ జాబితాలో సిప్లా 3.37 శాతం, విప్రో 2.88 శాతం, ఓఎన్జీసీ 2.50 శాతం, హిండాల్కో 2.44 శాతం, సన్ ఫార్మా 1.51 శాతం లాభపడ్డాయి.

టాప్ లూజర్స్ జాబితాలో ఐచర్ మోటార్స్ 3.56 శాతం, గ్రాసీమ్ 3.39 శాతం, ఇన్ఫోసిస్ 3.15 శాతం, మారుతీ సుజుకీ 2.58 శాతం, ఇండస్ఇండ్ బ్యాంకు 2.21 శాతం నష్టపోయాయి.

మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో ఇన్ఫోసిస్, టాటా మోటార్స్, టాటా స్టీల్, HDFC బ్యాంకు, JSW స్టీల్ ఉన్నాయి.

రంగాలవారీగా...

రంగాలవారీగా...

నిఫ్టీ 50 స్టాక్స్ 0.38 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 0.38 శాతం నష్టపోయాయి. నిఫ్టీ ఆటో 1.87 శాతం, నిఫ్టీ బ్యాంకు 0.32 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.06 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.42 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.56 శాతం, నిఫ్టీ ఐటీ 0.40 శాతం, నిఫ్టీ మీడియా 0.41 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 1.94 శాతం, నిఫ్టీ రియాల్టీ 1.54 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.65 శాతం నష్టపోయాయి. నిఫ్టీ మెటల్ 0.40 శాతం, నిఫ్టీ ఫార్మా 1.58 శాతం లాభపడ్డాయి.

English summary

లాభాల నుండి భారీ నష్టాల్లోకి స్టాక్ మార్కెట్లు, ఇన్ఫోసిస్ 5% డౌన్ | Sensex down 100 points, Nifty sub-14,500: Infosys falls 5 percent

Trade was volatile on Thursday, with the Sensex touching a low of 48,334.46 and a high of 48,686.17 in early deals. The Nifty has moved in a range of 14,441.65-14,566.80 so far today. IT index fell 1%, while metal, pharma indices rose 1-2%.
Story first published: Thursday, April 15, 2021, 10:46 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X