ముంబై: స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం గం.9.16 సమయానికి సెన్సెక్స్ 240.35 పాయింట్లు లేదా 0.68% నష్టపోయి 34,930.92 వద్ద, నిఫ్టీ 68.50 పాయింట్స్ లేదా 0.66% పడిపోయి 10,314 వద్ద ప్రారంభమైంది. ఆ తర్వాత మధ్యాహ్నం గం.1.45 సమయానికి సెన్సెక్స్ 400 పాయింట్లు నష్టపోయింది. 614 షేర్లు లాభాల్లో, 621 షేర్లు నష్టాల్లో ప్రారంభం కాగా, 72 షేర్లలో ఎలాంటి మార్పు లేదు. డాలర్ మారకంతో రూపాయి ఉదయం 75.63 వద్ద ఫ్లాట్‌గా ప్రారంభమైంది. అంతకుముందు సెషన్‌లో 75.64 వద్ద క్లోజ్ అయింది.

ఆంధ్రా పేపర్స్ 17 శాతం ర్యాలీ
ఆంధ్రా పేపర్స్ షేర్ ధర ఈ రోజు ఏకంగా 18 శాతానికి పైగా పెరిగింది. డీమార్ట్ అధినేత రాధాకిషన్ ధమానీకి చెందిన బ్రైట్ స్టార్ జూన్ 26వ తేదీన 1.25% వాటాను కొనుగోలు చేసింది. దీంతో ఆంధ్రా పేపర్ షేర్ ఎగిసింది. ఒక్కో షేర్‌కు రూ.206.23 వద్ద 5 లక్షల షేర్లను కొనుగోలు చేసింది.

మార్కెట్ నష్టాలకు కారణం
కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటం, రెండోసారి కరోనా విజృంభిస్తుందనే ఆందోళనలు స్టాక్ మార్కెట్‌ను నష్టాలకు పురికొల్పాయి. వివిధ నగరాల్లో లాక్ డౌన్ విధిస్తారనే వార్తలు వస్తున్నాయి. దీంతో సూచీలు నష్టాల బాట పట్టాయి. ఆసియా మార్కెట్లు కూడా నష్టాల్లో ట్రేడ్ కావడం దెబ్బతీసింది. భారత ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఇబ్బందుల్లో ఉందని ఎస్ అండ్ బీ హెచ్చరించింది. ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు మైనస్ 5 శాతం ఉండవచ్చునని అంచనా వేసింది.

కరాచీ స్టాక్ మార్కెట్‌పై ఉగ్రదాడి
పాకిస్తాన్ కరాచీ స్టాక్ ఎక్స్చేంజ్ భవనంపై ఉగ్రవాద దాడి జరిగింది. ఈ ఘటనలో నలుగురైదుగురు మృతి చెందారు. నలుగురు మిలిటెంట్లు చొచ్చుకు వచ్చి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. స్టాక్ ఎక్స్చేంజ్ భవనంలోకి చొచ్చుకు వచ్చి ఉగ్రదాడి జరగడం కలకలం రేపింది.
More From GoodReturns

Sensex today: సెన్సెక్స్ సంచలనం: 20 నిమిషాల్లో 900 పాయింట్లు జంప్.. కారణం ఇదే!

మూడో రోజూ కుప్పకూలిన స్టాక్ మార్కెట్..రికార్డు కనిష్టానికి రూపాయి.. పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన..

భారత స్టాక్ మార్కెట్లు పతనం.. చమురు ధరలు పెరగడంతో కుప్పకూలిన మార్కెట్

ఇరాన్ యుద్ధంతో స్టాక్ మార్కెట్లో భయాందోళన..728 పాయింట్లు పడిపోయిన గిఫ్ట్ నిఫ్టీ.. భారీగా పెరిగిన ఇండియా VIX..

Stock market: మార్కెట్ షాక్ ఇచ్చినా భయం వద్దు.. ఇన్వెస్టర్లకు ఇవే సేఫ్ ఆప్షన్లు!

Investment: మార్కెట్ ఒడిదుడుకులకు భయపడుతున్నారా? ఈ టైంలో ధనవంతులు ఏం చేస్తారో తెలుసా?

భారీ నష్టాలతో ప్రారంభమైన భారత స్టాక్ మార్కెట్..రూ. 9 లక్షల కోట్ల నష్టం.. సెన్సెక్స్, నిఫ్టీ పతనం..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్‌లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications