For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

280 పాయింట్ల లాభంలో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ 14,800 పైన..

|

దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాల్లో ముగిశాయి. ఉదయం సానుకూలంగా ప్రారంభమైన సూచీలు ఆద్యంతం లాభాల్లో కదలాడాయి. ఓ దశలో స్వల్ప సమయంలో నష్టాల్లోకి వెళ్లిన సూచీలు, ఆ తర్వాత తిరిగి లాభాల్లోకి వచ్చాయి. అమెరికా మార్కెట్లు గతవారం లాభాలతో ముగియడం, బాండ్స్ ప్రతిఫలాల్లో స్థిరత్వం, ఆసియా మార్కెట్ల సానుకూల కదలికలు మార్కెట్లను ముందుకు నడిపించాయి. కీలకరంగాల్లోని షేర్లు లాభాల్లో పయనించడం సూచీలకు దన్నుగా నిలిచింది.

పెట్రోల్, డీజిల్‌పై 300% పెరిగిన ఆదాయం, భారీగా పెరిగిన పన్ను వసూళ్లుపెట్రోల్, డీజిల్‌పై 300% పెరిగిన ఆదాయం, భారీగా పెరిగిన పన్ను వసూళ్లు

సెన్సెక్స్, నిఫ్టీ జంప్

సెన్సెక్స్, నిఫ్టీ జంప్

సెన్సెక్స్ ఉదయం 49,876.21 పాయింట్ల వద్ద ప్రారంభమై, 50,264.65 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 49,661.92 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. చివరకు 280.15 (0.56%) పాయింట్లు లాభపడి 50,051.44 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్ 50వేల పాయింట్లను క్రాస్ చేసింది. నేడు 600 పాయింట్ల మధ్య కదలాడింది.

నిఫ్టీ 14,768.55 పాయింట్ల వద్ద ప్రారంభమై, 14,878.60 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 14,707.00 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ నేడు 78.35 (0.53%) పాయింట్లు ఎగిసి 14,814.75 పాయింట్ల వద్ద ముగిసింది.

టాప్ గెయినర్స్, లూజర్స్

టాప్ గెయినర్స్, లూజర్స్

నేటి మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో అదానీ పోర్ట్స్, టాటా మోటార్స్, ICICI బ్యాంకు, రిలయన్స్, SBI ఉన్నాయి.

నేటి టాప్ గెయినర్స్ జాబితాలో శ్రీ సిమెంట్స్ 5.04 శాతం, అల్ట్రా టెక్ సిమెంట్ 3.14 శాతం, దివిస్ ల్యాబ్స్ 2.64 శాతం, టైటాన్ కంపెనీ 2.40 శాతం, అదానీ పోర్ట్స్ 2.31 శాతం లాభపడ్డాయి.

టాప్ లూజర్స్ జాబితాలో IOC 2.42 శాతం, హిండాల్కో 2.37 శాతం, ONGC 2.24 శాతం, పవర్ గ్రిడ్ కార్పోరేషన్ 2.04 శాతం, గెయిల్ 1.75 శాతం నష్టపోయాయి.

రంగాలవారీగా..

రంగాలవారీగా..

నిఫ్టీ 50 స్టాక్స్ 0.53 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ 0.97 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ఆటో 0.47 శాతం, నిఫ్టీ బ్యాంకు 1.73 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.07 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ స్టాక్స్ 0.90 శాతం, నిఫ్టీ ఐటీ 0.27 శాతం, నిఫ్టీ ఫార్మా 0.48 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 2.91 శాతం, నిఫ్టీ రియాల్టీ 1.05 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 1.73 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.39 శాతం, నిఫ్టీ మీడియా 0.29 శాతం, నిఫ్టీ మెటల్ 0.66 శాతం నష్టపోయాయి.

English summary

280 పాయింట్ల లాభంలో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ 14,800 పైన.. | Sensex closes 280 pts higher, Nifty at 14,800

Asian stock markets closed lower on Tuesday due to a combination of fears over the efficacy of the AstraZeneca vaccine, Western sanctions against China as well as the after effects of the sacking of the Turkish central bank chief.
Story first published: Tuesday, March 23, 2021, 18:50 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X