For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

US ఫెడ్ ఎఫెక్ట్, భారీ లాభాల్లో మార్కెట్లు: 500 పాయింట్లు ఎగిసిన సెన్సెక్స్

|

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం (ఫిబ్రవరి 24) భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. అవసరమైనంత కాలం వడ్డీ రేట్లు ప్రస్తుత కనిష్టం వద్దే ఉంటాయని యూఎస్ ఫెడ్ చైర్ జెరోమ్ పోవెల్ అన్నారు. వడ్డీ రేట్లు తక్కువగా ఉంటే ఈక్విటీ మార్కెట్లు లాభపడటం సహజం. ఆయన ప్రకటన అమెరికా, అంతర్జాతీయ మార్కెట్లకు ఊతమిచ్చింది. బడ్జెట్ రోజు నుండి స్టాక్ మార్కెట్లు భారీగా లాభపడినప్పటికీ, ఆ తర్వాత వరుసగా ఐదు సెషన్లు నష్టపోయాయి. నిన్న నష్టాలకు చెక్ చెప్పి, ఫ్లాట్‌గా ముగిశాయి. నేడు దాదాపు అన్ని రంగాలు కూడా లాభాల్లో ఉన్నాయి. కేవలం ఐటీ రంగం మాత్రం అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటోంది.

ఎట్టకేలకు లాభాల్లోకి..

ఎట్టకేలకు లాభాల్లోకి..

సెన్సెక్స్ ఉదయం 49,763.94 పాయింట్ల వద్ద ఫ్లాట్‌గా ప్రారంభమైంది. నిన్న 49,751 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. నేడు 50,249 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 49,737 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. ఓ సమయంలో నేడు దాదాపు 500 పాయింట్లు లాభపడింది. నిఫ్టీ 14,729.15 పాయింట్ల వద్ద ప్రారంభమై, 14,822 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 14,723 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.11.30 సమయానికి సెన్సెక్స్ 418 పాయింట్లు లాభపడి 50,129 వద్ద, నిఫ్టీ 112 పాయింట్లు ఎగిసి 14,820 పాయింట్ల వద్ద ఉంది.

టాప్ గెయినర్స్, లూజర్స్

టాప్ గెయినర్స్, లూజర్స్

నేటి టాప్ గెయినర్స్ జాబితాలో బజాజ్ ఫైనాన్స్ 2.25 శాతం, యాక్సిస్ బ్యాంకు 2.22 శాతం, HDFC బ్యాంకు 2.15 శాతం, BPCL 2.01 శాతం లాభపడ్డాయి.

టాప్ లూజర్స్ జాబితాలో GAIL 1.93 శాతం, TCS 1.28 శాతం, యూపీఎల్ 1.24 శాతం, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ 0.74 శాతం, టాటా మోటార్స్ 0.83 శాతం ఉన్నాయి.

మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో టాటా స్టీల్, టాటా మోటార్స్, ఎస్బీఐ, టీసీఎస్, బజాజ్ ఫైనాన్స్ ఉన్నాయి.

రిలయన్స్ స్టాక్ ధర నేడు నేడు 0.90 శాతం ఎగిసి రూ.2,041 వద్ద ట్రేడ్ అయింది.

రంగాలవారీగా...

రంగాలవారీగా...

నిఫ్టీ 50 సూచీ 0.7 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 0.90 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ఆటో 0.90 శాతం, నిఫ్టీ బ్యాంకు 1.45 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.34 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 1.21 శాతం, నిఫ్టీ మీడియా 1.37 శాతం, నిఫ్టీ మెటల్ 1.09 శాతం, నిఫ్టీ ఫార్మా 0.09 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 3.45 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.96 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 1.32 శాతం లాభపడ్డాయి.నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.12 శాతం, నిఫ్టీ ఐటీ 0.32 శాతం నష్టపోయాయి.

English summary

US ఫెడ్ ఎఫెక్ట్, భారీ లాభాల్లో మార్కెట్లు: 500 పాయింట్లు ఎగిసిన సెన్సెక్స్ | Sensex bucks global trend, rises nearly 500 points, Nifty above 14,750

Except for IT, most other sectors witnessed buying today with metal stocks leading the rally. Nifty Metal, the metal sub-index of NSE, rose nearly 2%.
Story first published: Wednesday, February 24, 2021, 11:50 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X