For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

4 గంటలు.. ఎక్స్చేంజీ చరిత్రలో మొదటిసారి: అసలేం జరిగింది.. అడిగిన SEBI

|

ముంబై: నేషనల్ స్టాక్ ఎక్స్చేంజీ(NSE)లో ట్రేడింగ్ నిలిచిపోవడంపై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(SEBI) ఆరా తీసింది. సాంకేతిక సమస్య తలెత్తినప్పుడు ప్రత్యామ్నాయ మార్గం వైపు ఎందుకు వెళ్లలేదో తెలియజేయాలని NSE నుండి వివరణ కోరింది. ట్రేడింగ్ నిలిపివేతకు సంబంధించి పూర్తి కారణాలను వెల్లడించాలని పేర్కొంది.

కనెక్టివిటీ కోసం రెండు టెలికం సంస్థలపై ఆధారపడ్డామని, అయితే ఆ రెండు సంస్థలు విఫలమవ్వడంతో టెక్నికల్ సమస్య తలెత్తిందని NSE స్పష్టం చేసింది. మధ్యాహ్నం గం.11.40కి నిలిచిన ట్రేడింగ్ గ.3.30 వరకు కానీ పునఃప్రారంభం కాలేదు. దాదాపు 4 గంటలు నిలిచింది. ఎక్స్చేంజీ చరిత్రలో ఇంతసేపు నిలిచిపోవడం మొటిసాి.

సాంకేతిక లోపంతో ఎన్ఎస్ఈలో నిలిచిన ట్రేడింగ్, లింక్స్ ఇష్యూనే కారణం!సాంకేతిక లోపంతో ఎన్ఎస్ఈలో నిలిచిన ట్రేడింగ్, లింక్స్ ఇష్యూనే కారణం!

ఏం జరిగింది? సాయంత్రం వరకు ట్రేడింగ్

ఏం జరిగింది? సాయంత్రం వరకు ట్రేడింగ్

NSEలో ట్రేడింగ్ నిలిచిపోయింది. సాంకేతిక సమస్య కారణంగా ట్రేడింగ్ నిలిచిపోవడం ఆందోళన కలిగించింది. NSE ఎఫ్ అండ్ వోలో ఉదయం గం.11.40 నిమిషాల నుండి ట్రేడింగ్ నిలిచింది. దీంతో క్యాష్ మార్కెట్లోను NSE ట్రేడింగ్ ఆపేసింది. ప్రస్తుతం సర్వర్‌ను రీస్టార్ట్ చేశామని, ట్రేడింగ్ ఎప్పుడు ప్రారంభించేది వెల్లడిస్తామని ట్రేడింగ్ నిలిచిన సమయంలో చెప్పింది.

తర్వాత ట్రేడింగ్ మధ్యాహ్నం గం.3.30కు పునఃప్రారంభమైంది. సాయంత్రం 4 వరకు కొనసాగుతుందని తెలిపింది. ట్రేడింగ్ పునఃప్రారంభం తర్వాత సూచీలు, షేర్లు ఊగిసలాట మధ్య కదలాడాయి. సాయంత్రం గం.4 సమయానికి ఒక్కసారిగా పరుగులు తీశాయి.

కాసేపటికే సమస్య...

కాసేపటికే సమస్య...

ఉదయం గం.9 గంటలకు స్టాక్ మార్కెట్ ప్రారంభమైంది. కాసేపటికి ఎన్ఎస్ఈలో టెక్నికల్ సమస్యకారణంగా షేర్ల కదలికలు ఆగిపోయాయి. డెరివేటివ్స్ కాంట్రాక్టుల్లో మాత్రం ధరలు మారాయి. టెక్నికల్ సమస్యను పరిష్కరిస్తామని ఎక్స్చేంజీకి తెలిపింది. బీఎస్ఈలో మాత్రం ట్రేడింగ్ కొనసాగింది. గం.11.40కి టెక్నికల్ సమస్య పరిష్కారం కాకపోవడంతో ఈక్విటీ, డెరివేటివ్స్, కరెన్సీలో ట్రేడింగ్ నిలిపివేశారు. పునఃప్రారంభం కోసం ఇన్వెస్టర్లు వేచి చూశారు. మధ్యాహ్నం గం.3 వరకు కూడా ట్రేడింగ్ ప్రారంభం కాలేదు. దీంతో ఇన్వెస్టర్లు ఆందోళన చెందారు.

ఇంట్రాడే టెన్షన్

ఇంట్రాడే టెన్షన్

ఇంట్రాడే ట్రేడింగ్ చేసే వాళ్ల మరింతగా ఆందోళన చెందారు. రేపటి వరకు పొజిషన్లను బ్రోకరేజీలు కొనసాగిస్తాయా, లేదా? స్క్వేర్ ఆఫ్ చేస్తాయా, అలా చేస్తే నష్టపోవాల్సి వస్తుందా అనిఆందోళన చెందారు. ఇంట్రాడే ఆర్డర్స్ పైన బ్రోకరేజీ సంస్థలూ ఆలోచనలోనే ఉన్నాయి. మొత్తానికి సాయంత్రం ట్రేడింగ్ పునఃప్రారంభం కావడం అందరికి ఉత్తేజాన్నిచ్చింది. దీనికి తోడు సూచీలు జంప్ చేశాయి.

English summary

4 గంటలు.. ఎక్స్చేంజీ చరిత్రలో మొదటిసారి: అసలేం జరిగింది.. అడిగిన SEBI | Sebi seeks explanation from NSE on trading halt

The Securities and Exchange Board of India (Sebi) has initiated a probe into the National Stock Exchange (NSE) after the country’s largest bourse halted trading on Wednesday because of a technical snag, said two people, including a government official, aware of Sebi’s decision.
Story first published: Thursday, February 25, 2021, 7:48 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X