కంపెనీ డైరెక్టర్లు అదే సంస్థలో పని చేసే ఉద్యోగులు అయితే అలాంటి వారికి చెల్లించే వేతనాలపై జీఎస్టీ చెల్లించాల్సిన అవసరం లేదని కేంద్ర పరోక్ష పన్నులు, సుంకాల మండలి (CBIC) బుధవారం వెల్లడించింది. కంపెనీలు తమ డైరెక్టర్లకు వేతనంపై జీఎస్టీ చెల్లించాలని గత ఏప్రిల్ నెలలో రాజస్థాన్ అథారిటీ ఆఫ్ అడ్వాన్స్ రూలింగ్ (AAR) రూలింగ్ ఇచ్చింది. దీనిపై తాజాగా CBIC వివరణ ఇచ్చింది.

ఆ వేతనాలపై జీఎస్టీ చెల్లించాల్సిన అవసరం లేదు
డైరెక్టర్లు చెల్లించే వేతనాలను కంపెనీ పుస్తకాల్లో వేతనాల కింద చూపిస్తూ, ఐటీ చట్టంలోని సెక్షన్ 192 ప్రకారం మూలం వద్ద పన్ను కోత (TDS) విధిస్తుంటే కనుక సీజీఎస్టీ చట్టం 2017లోని సెక్షన్-3 ప్రకారం ఆ వేతనాలపై ఎలాంటి జీఎస్టీ చెల్లించవలసిన అవసరం లేదని CBIC పేర్కొంది. అయితే ఒకవేళ వారికి ప్రొఫెషనల్ ఫీజు రూపంలో చెల్లిస్తే ఆ మొత్తంపై రివర్స్ ఛార్జీ విధానంలో జీఎస్టీ చెల్లించాలని పేర్కొంది.

ఇలా అయితే జీఎస్టీ ఉంటుంది
కంపెనీలలో ఉద్యోగులుగా లేని స్వతంత్ర డైరెక్టర్లు పారితోషికం తీసుకుంటూ సదరు కంపెనీలకు అందించే సేవలపై కూడా జీఎస్టీ విధిస్తారని CBIC తెలిపింది. అంటే వేతనం కాకుండా వృత్తి ఫీజు రూపంలో ఉంటే రివర్స్ ఛార్జ్ విధానంలో జీఎస్టీ ఉంటుంది.

18 శాతం ఆదా
కంపెనీ డైరెక్టర్ల రెమ్యునరేషన్ పైన CBIC ఇచ్చిన స్పష్టత నేపథ్యంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లకు చెల్లించే వేతనంపై 18 శాతం పన్ను ఆదా అవుతుందని ఏఎంఆర్జీ అండ్ అసోసియేట్స్ సీనియర్ పార్ట్‌నర్ రజత్ మోహన్ చెప్పారు. వ్యాపార సంస్థలు ఇప్పుడు ఆదాయపు పన్ను, జీఎస్టీ, అకౌంటింగ్ కింద డైరెక్టర్ల వేతనాన్ని సమగ్రంగా అంచనా వేసుకోవచ్చునని నిపుణులు చెబుతున్నారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications