ప్రస్తుతం యూత్ లో పొదుపు పట్ల అవగాహన పెరుగుతోందని రిపోర్ట్ లు చెప్తున్నాయి. గతంతో పోలిస్తే ఇప్పుడు 20 ఏళ్ల వయసు నుంచే చాలామంది సిస్టమాటిక్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్ (sip investment) ద్వారా సంపదను సృష్టించాలని కలలు కంటున్నారు. అయితే ఇక్కడే ఒక పెద్ద చిక్కు వచ్చి పడింది. మెజారిటీ యువత పెట్టుబడి సలహాల కోసం అనుభవజ్ఞులైన ఆర్థిక నిపుణుల కంటే, సోషల్ మీడియాలోని 'ఫిన్ -ఫ్లుయెన్సర్ల' (Fin-fluencers) మీదే ఎక్కువగా ఆధారపడుతున్నారట. అంటే రీల్స్, షార్ట్ వీడియోలలో కనిపించే ఆకర్షణీయమైన లాభాలను చూసి గుడ్డిగా ఇన్వెస్ట్ చేస్తున్నారన్న మాట. అయితే దీనివల్ల లాభాల కంటే తీవ్రమైన నష్టాలే ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. దీని గురించి మరిన్ని వివరాల్లోకి వెళ్తే..

మ్యూచువల్ ఫండ్స్ వంటివి మార్కెట్ ట్రెండ్స్ కు అణుగుణంగా మారుతుంటాయి. వీటిలో పెట్టుబడి పెట్టేముందు తగిన రీసెర్చ్ చేసి సరైన నిర్ణయం తీసుకోవడం ఉత్తమం. అయితే వాటి పట్ల ఎలాంటి అవగాహన లేని వాళ్లు.. నిపుణులైన ఆర్థిక సలహాదారుల సూచన పాటిస్తే నష్టపోకుండా జాగ్రత్తపడొచ్చు. అలాకాకుండా రీల్స్ చూసి ఈజీ లాభాల కోసం ఆరాటపడితే నష్టపోయే ప్రమాదముంటుంది. ముఖ్యంగా సోషల్ మీడియా సలహాల వల్ల ఉన్న ప్రమాదాలు ఏంటంటే..
అందరికీ ఒకే ఫార్ములా వర్తించదు
సోషల్ మీడియాలో చెప్పే సలహాలు సాధారణంగా అందరినీ ఉద్దేశించి ఉంటాయి. కానీ, ఆర్థిక ప్రణాళిక అనేది ప్రతి వ్యక్తి ఆదాయం, వయసు, రిస్క్ తీసుకునే సామర్థ్యం, భవిష్యత్తు లక్ష్యాలపై ఆధారపడి ఉంటుంది. ఒకరికి లాభం ఇచ్చిన ప్లాన్ మరొకరికి నష్టాన్ని మిగల్చవచ్చు.
తప్పుదోవ పట్టించే 'గ్యారెంటీడ్' లాభాలు
చాలామంది ఇన్ఫ్లుయెన్సర్లు కేవలం వ్యూస్ కోసమో లేదా కొన్ని యాప్స్ ప్రమోషన్ కోసమో "నెలకు రూ. 500 పెడితే కోటీశ్వరులు అయిపోవచ్చు" అని నమ్మబలుకుతారు. మార్కెట్ ఒడిదుడుకులను వారు అస్సలు ప్రస్తావించరు. స్టాక్ మార్కెట్ లేదా మ్యూచువల్ ఫండ్స్‌లో ఎప్పుడూ రిస్క్ ఉంటుందనే నిజాన్ని వారు దాచిపెడతారు.
స్వార్థ ప్రయోజనాలు ఉండవచ్చు
సోషల్ మీడియాలో సలహాలు ఇచ్చే ప్రతి ఒక్కరూ సెబీ (SEBI) గుర్తింపు పొందిన నిపుణులు కాదు. కొన్ని కంపెనీల నుండి కమిషన్లు తీసుకుని, పనికిరాని ఫండ్స్‌ను లేదా స్టాక్స్‌ను ప్రమోట్ చేసే అవకాశం ఉంది. వారు చెప్పే టిప్స్ వెనుక వారి స్వంత లాభం ఉండవచ్చని గమనించాలి.
పరిమిత సమాచారం - అధిక నష్టం
30 సెకన్ల రీల్లో పెట్టుబడి గురించి పూర్తి అవగాహన రావడం అసాధ్యం. అసంపూర్ణ సమాచారంతో చేసే పెట్టుబడులు ఎప్పుడూ ప్రమాదకరమే. ముఖ్యంగా క్రమశిక్షణతో కూడిన సిప్ (sip investment) చేసేటప్పుడు దీర్ఘకాలిక వ్యూహం ఉండాలి. కానీ, క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు కాదు.
సురక్షితమైన పెట్టుబడికి ఏం చేయాలి?
- నిపుణులను సంప్రదించండి: ఎప్పుడూ సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ల (RIA) సలహా తీసుకోండి.
- సొంతంగా రీసెర్చ్ చేయండి: ఒక ఫండ్‌లో డబ్బులు పెట్టే ముందు దాని గత చరిత్ర, ఎగ్జిట్ లోడ్, రిస్క్ పారామీటర్లను స్వయంగా తనిఖీ చేయండి.
- రియలిస్టిక్ గోల్స్ పెట్టుకోండి: రాత్రికి రాత్రే సంపన్నులు అయిపోవాలనే ఆశ వద్దు. మ్యుచువల్ ఫండ్స్ లేదా ఎస్ఐపీ ద్వారా సంపద సృష్టించడానికి సహనం చాలా అవసరం.
మీ డబ్బు.. మీ బాధ్యత!
సోషల్ మీడియా అనేది సమాచారం తెలుసుకోవడానికి మంచి వేదిక కావచ్చు. కానీ, అది పెట్టుబడి నిర్ణయాలకు ఏకైక ప్రాతిపదిక కాకూడదు. ఇన్ఫ్లుయెన్సర్ల లైఫ్ స్టైల్ చూసి మురిసిపోయి.. మీ కష్టార్జితాన్ని రిస్క్ లో పెట్టకండి. సరైన అవగాహనతో, నిపుణుల పర్యవేక్షణలో చేసే ఇన్వెస్ట్ మెంట్స్ మాత్రమే మీకు ఆర్థిక స్వేచ్ఛను అందిస్తుంది.
More From GoodReturns

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?



Click it and Unblock the Notifications