For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రిలయన్స్ మార్కెట్ క్యాప్ జర్నీ ఇలా: ఎప్పుడు, ఎంత? టాప్ 10 కంపెనీలివే..

|

ముంబై: రూ.10 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటల్ కలిగిన తొలి భారత కంపెనీగా ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) రికార్డ్ సృష్టించింది. RIL షేర్ గురువారం నాటి ట్రేడింగ్‌లో ఉదయం 0.69 శాతం పెరిగి రూ.1,579కు చేరుకున్న సమయంలో రూ.10,00,000 కోట్ల మార్కెట్‌ను దాటింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ తర్వాత టీసీఎస్ రెండో స్థానంలో ఉంది.

జియో ఎఫెక్ట్: రూ.10 లక్షల కోట్ల కంపెనీగా... ముఖేష్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఘనతజియో ఎఫెక్ట్: రూ.10 లక్షల కోట్ల కంపెనీగా... ముఖేష్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఘనత

టాప్ 10 కంపెనీలు ఇవే

టాప్ 10 కంపెనీలు ఇవే

రూ.10,00,000 కోట్ల ఎం-క్యాప్‌తో రిలయన్స్ ఇండస్ట్రీస్ మొదటి స్థానంలో నిలిచింది. టీసీఎస్ 7.81 లక్షల కోట్లతో రెండో స్థానంలో ఉంది. రూ.7 లక్షల కోట్లకు పైగా ఎం-క్యాప్‌తో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు మూడో స్థానంలో, రూ.4.5 లక్షల కోట్లతో HUL నాలుగో స్థానంలో, రూ.4 లక్షల కోట్లతో HDFC ఐదో స్థానంలో, రూ.3.2 లక్షల కోట్లకు పైగా ఎం-క్యాప్‌తో ఐసీఐసీఐ ఆరో స్థానంలో, రూ.3.1 లక్షల కోట్లతో కొటక్ మహీంద్రా ఏడో స్థానంలో, రూ.3.1 లక్షల కోట్లతో SBI ఎనిమిదో స్థానంలో, రూ.3 లక్షల కోట్లతో ITC తొమ్మిదో స్థానంలో, రూ.2.9 లక్షల కోట్లతో పదో స్థానంలో ఇన్ఫోసిస్ నిలిచింది.

రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎం-క్యాప్ జర్నీ

రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎం-క్యాప్ జర్నీ

రిలయన్స్ ఇండస్ట్రీస్ 25 సెషన్లలో రూ.9 లక్షల కోట్ల ఎం-క్యాప్ నుంచి రూ.10 లక్షల కోట్ల ఎం-క్యాప్‌కు చేరుకుంది. అంతకుముందు ఎం-క్యాప్ జర్నీ ఇలా ఉంది... ప్రారంభం నుంచి రూ.5 లక్షల కోట్లకు చేరుకునేందుకు 6,329 సెషన్స్, రూ.6 లక్షల కోట్లకు చేరుకునేందుకు 90 సెషన్లు, రూ.7 లక్షల కోట్లకు చేరుకునేందుకు 162 సెషన్లు, రూ.8 లక్షల కోట్లకు చేరుకునేందుకు 23 సెషన్లు, రూ.9 లక్షల కోట్లకు చేరుకునేందుకు 284 సెషన్లు, రూ.10 లక్షల కోట్లకు చేరుకునేందుకు 25 సెషన్లు తీసుకుంది.

ఎప్పుడు ఏ మార్క్ దాటిందంటే?

ఎప్పుడు ఏ మార్క్ దాటిందంటే?

- రిలయన్స్ ఇండస్ట్రీస్ జూలై 17, 2017న రూ.5 లక్షల కోట్ల మార్క్ చేరుకుంది.

- నవంబర్ 24, 2017న రూ.6 లక్షల కోట్ల మార్క్ చేరుకుంది.

- జూలై 19, 2018న రూ.7 లక్షల కోట్ల మార్క్ చేరుకుంది.

- ఆగస్ట్ 23, 2018న రూ.8 లక్షల కోట్ల మార్క్ చేరుకుంది.

- అక్టోబర్ 24, 2019న రూ.9 లక్షల మార్క్ చేరుకుంది.

- నవంబర్ 28, 2019న రూ.10 లక్షల కోట్ల మార్క్ చేరుకుంది.

English summary

రిలయన్స్ మార్కెట్ క్యాప్ జర్నీ ఇలా: ఎప్పుడు, ఎంత? టాప్ 10 కంపెనీలివే.. | RIL's Rs 10 Lakh Crore Market Cap Journey

The RIL company's market value jumped to Rs 10 lakh crore from Rs 9 lakh crore in just 25 trading days. The journey from Rs 8 lakh crore to Rs 9 lakh crore had taken 284 sessions.
Story first published: Thursday, November 28, 2019, 15:23 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X