For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హోరాహోరీగా అమెరికా ఫలితాలు: ఐటీ సహా స్టాక్స్ పైపైకి.. సెన్సెక్స్ 600 పాయింట్లు జంప్

|

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం (నవంబర్ 5) భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం గం.9.16 సమయానికి సెన్సెక్స్ 499.51 పాయింట్లు(1.23%) లాభపడి 41,115.65 వద్ద, నిఫ్టీ 143.80 పాయింట్లు(1.21%) ఎగిసి 12,052.30 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. మధ్యాహ్నం గం.11.30 సమయానికి సెన్సెక్స్ దాదాపు 600 పాయింట్లు (597) లాభాల్లో ఉంది.

729 షేర్లు లాభాల్లో, 182 షేర్లు నష్టాల్లో, 42 మార్పు లేకుండా ప్రారంభమైంది. ఆసియా మార్కెట్లు కూడా భారీ లాభాల్లో ఉన్నాయి. మెటల్, పీఎస్‌యూ బ్యాంకింగ్ రంగాలు భారీగా లాభపడ్డాయి. అన్ని రంగాలు కూడా పుంజుకున్నాయి. ఈ వారంలో నిన్నటి వరకు మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. నేడు భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. డాలర్ మారకంతో రూపాయి 74.29 వద్ద ప్రారంభమైంది.

మోడీతో 3వ అమెరికా అధ్యక్షుడు! జోబిడెన్ గెలిస్తే భారత్‌తో సంబంధాలు ఎలా ఉంటాయి?మోడీతో 3వ అమెరికా అధ్యక్షుడు! జోబిడెన్ గెలిస్తే భారత్‌తో సంబంధాలు ఎలా ఉంటాయి?

ఐటీ సహా ఈ స్టాక్స్ అదరగొట్టాయి

ఐటీ సహా ఈ స్టాక్స్ అదరగొట్టాయి

ఉదయం గం.11 సమయానికి నిఫ్టీ ఆటో 0.81 శాతం, నిఫ్టీ బ్యాంకు 1.15 శాతం, నిఫ్టీ ఎనర్జీ 1.97 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 1.97 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 1.66 శాతం, నిఫ్టీ ఐటీ 1.94 శాతం, నిఫ్టీ మీడియా 2.94 శాతం, నిఫ్టీ మెటల్ 2.50 శాతం, నిఫ్టీ ఫార్మా 0.62 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 2.25 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.38 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.83 శాతం లాభపడ్డాయి.

ప్రధానంగా ఎనర్జీ, బ్యాంకింగ్, ఐటీ, మీడియా, మెటల్ స్టాక్స్ అదరగొట్టాయి.

టాప్ గెయినర్స్ జాబితాలో SBI(4.73శాతం), BPCL(4.23శాతం), టాటా స్టీల్ (3.97 శాతం), UPL (3.81 శాతం), HCL టెక్ టెక్ (3.43 శాతం) ఉన్నాయి.

టాప్ లూజర్స్ జాబితాలో హీరో మోటా కార్ప్ (0.57 శాతం) ఉంది.

మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌‌లో ఎస్బీఐ, రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్, ఇండస్ ఇండ్ బ్యాంకు, టాటా స్టీల్ ఉన్నాయి.

ఎస్బీఐ భారీ జంప్

ఎస్బీఐ భారీ జంప్

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) స్టాక్ ఓ సమయంలో ఏకంగా 6 శాతం ఎగిసింది. రెండో త్రైమాసికంలో నికర లాభం 52 శాతం ఎగిసింది. దీంతో షేర్ 6.76 శాతం లాభపడి రూ.220ని తాకింది.

రిలయన్స్ స్టాక్ ధర కూడా 1.85 శాతం లాభపడి రూ.1,948 వద్ద ఉంది. ఓ సమయంలో రూ.1951ని దాటింది.

హ్యాపీయెస్ట్ మైండ్ స్టాక్ 5 శాతం క్షీణించింది.

HPCL 7 శాతం పెరిగింది.

సెన్సెక్స్ 30 స్టాక్స్‌లో అన్నీ లాభాల్లోనే ఉన్నాయి. 3.60 శాతం నుండి 0.03 శాతం మేర లాభపడ్డాయి.

ఐటీ స్టాక్స్ లాభాల్లో

ఐటీ స్టాక్స్ లాభాల్లో

ఐటీ స్టాక్స్ భారీ లాభాల్లో ఉన్నాయి. టీసీఎస్ 1.62 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 3.09 శాతం, ఇన్ఫోసిస్ 1.74 శాతం, టెక్ మహీంద్ర 2.26 శాతం, విప్రో 0.96 శాతం, మైండ్ ట్రీ 1.33 శాతం, కోఫోర్జ్ 1.14 శాతం లాభపడ్డాయి.

అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న ట్రంప్, జోబిడెన్‌లకు సమాన అవకాశాలు కనిపించిన పరిస్థితుల్లో అమెరికా, యూరోప్ మార్కెట్లు 1.5 శాతం నుండి 4 శాతం లాభాల్లో కనిపించాయి. ఈ ప్రభావం ఆసియా, భారత మార్కెట్లపై పడింది. కాగా, ట్రంప్ కంటే జోబిడెన్ ముందంజలో ఉన్నారు. గెలుపుకు మెట్టు దూరంలో ఉన్నారు. ఇద్దరి మధ్య పోటాపోటీ నెలకొనడం, ఫలితాలు బిడెన్ వైపు కాస్త మొగ్గు చూపుతున్న నేపథ్యంలో ఐటీ స్టాక్స్ భారీగా లాభపడ్డాయి.

English summary

హోరాహోరీగా అమెరికా ఫలితాలు: ఐటీ సహా స్టాక్స్ పైపైకి.. సెన్సెక్స్ 600 పాయింట్లు జంప్ | RIL, Infosys, lift Sensex by 600 points, Nifty above 12,000

All the sectoral indices are trading in the green led by the metal and PSU Bank. SBI, Tata Steel, HCL Tech, Grasim Industries and Hindalco were among major gainers on the Nifty.
Story first published: Thursday, November 5, 2020, 11:40 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X