కరోనా మహమ్మారి నేపథ్యంలో అమెరికా, భారత్ సహా ప్రపంచ దేశాలు చైనాపై ఆధారపడటం తగ్గించి, సొంతగా ఉత్పత్తులు పెంచుకోవాలని చూస్తున్నాయి. ఇక, గాల్వాన్ ఘటన అనంతరం భారత ప్రజల్లో ఆత్మనిర్భర్ భారత్ సెంటిమెంట్ పెరిగింది. సాధ్యమైనన్ని ఉత్పత్తులు ఇక్కడే తయారు చేసుకోవాలని, తద్వారా చైనా నుండి దిగుమతులు తగ్గించాలని పరిశ్రమల నుండి ప్రజల వరకు భావిస్తున్నారు. ఇందుకు అనుగుణంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అధిక ఉత్పత్తి ఖర్చు సహా వివిధ కారణాలతో అప్పుడే సాధ్యం కాదని ప్రధాని ఎకనమిక్ అడ్వైజర్ కౌన్సిల్ మెంబర్ వీ అనంద నాగేశ్వరన్ అన్నారు. సరిహద్దు వివాదాల కారణంగా రక్షణ రంగం వ్యయం పెరిగే అవకాశముందన్నారు.

ఉత్పత్తి ఖర్చు సహా..
స్థానికంగా ఉత్పత్తి ఖర్చు ఎక్కువగా ఉండటం, నిబంధనలు తదితర ఎన్నో కారణాల వల్ల చైనాతో పోటీ అంత సులభం కాదని చెప్పారు. ఎస్పీ జైన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ రీసెర్చ్ వర్చువల్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు ఆనంద నాగేశ్వరన్. ఈ సందర్భంగా భారత్‌లో వ్యాపారాల కోసం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తగ్గించాలని అభిప్రాయపడ్డారు. దీనికి తోడు ఉత్పత్తి ఖర్చు ఉందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో డ్రాగన్ దేశంతో అప్పుడే పోటీ పడలేమని.. అంటే దిగుమతులు తగ్గించుకోవడం సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు.

ఉత్పాదకతపై దృష్టి
చైనా నుండి వెళ్లిపోతున్న కంపెనీలు వియత్నాం, బంగ్లాదేశ్, మెక్సికో వంటి దేశాలకు వెళ్లడానికి ఉత్పత్తి ఖర్చు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సహా ఎన్నో ఉన్నాయని చెప్పారు. వీటి కారణంగా మన దేశానికి రావడం తగ్గిందన్నారు. మనం ఈ పరిస్థితిని అధిగమించాలని నాగేశ్వరన్ సూచించారు. ఎక్కడో ఓచోట దీనిని ప్రారంభించాలని, మూడు నుండి ఆరు నెలల్లో ఇది పూర్తయ్యేది కాదని చెప్పారు. అవసరమైతే ప్రస్తుతం ఉత్పాదక పెంపుపై దృష్టి సారించాలన్నారు. అవసరం లేని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్‌ను ప్రస్తుతం పక్కన పెట్టేయడం సమస్య పరిష్కారానికి ఓ మార్గం అన్నారు.

మరింతగా విస్తరించవచ్చు
ప్రభుత్వం పరిశ్రమలకు అండగా ఉంటోందని నాగేశ్వరన్ చెప్పారు. ఉత్పాదకతను మెరుగుపరచడం వంటి పరిస్థితులకు లోబడి ప్రభుత్వాలు... పరిశ్రమలకు సహకారం అందించే అవకాశాలు మరింతగా ఉన్నాయన్నారు. కరోనా నేపథ్యంలో దెబ్బతిన్న ఎంఎస్ఎంఈలకు కేంద్రం రూ.3 లక్షల కోట్లకు పైగా ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్‌ను ప్రకటించింది. కంపెనీలకు ద్రవ్యపరమైన మద్దతు కోసం ఈ స్కీం తెచ్చింది. ఇది మరిన్ని కంపెనీలకు ప్రయోజనం కలిగేలా విస్తరింప చేయవచ్చునన్నారు. ప్రభుత్వం పూర్తిగా గ్రాంట్స్ ఇచ్చే పరిస్థితులో లేదన్నారు. స్థూల ఆర్థిక డేటా క్రెడిబిలిటీని రాష్ట్ర, కేంద్రస్థాయిల్లో పునరుద్ధరించాలన్నారు.
More From GoodReturns

ఇరాన్ యుధ్ధం.. హార్ముజ్ జలసంధిని దాటిన రెండు భారత ఎల్పీజీ నౌకలు.. ఎలా సాధ్యమయిందంటే..

చమురు సంక్షోభంలో స్నేహితుడికి అండగా రష్యా.. భారత రిఫైనరీ కంపెనీలకు 6 కోట్ల బ్యారెళ్ల ముడి చమురు సరఫరా

భారతదేశంలో లాక్డౌన్.. గూగుల్‌లో తెగ వెతికేస్తున్న నెటిజన్లు.. వెస్ట్ ఆసియా దేశాల్లో ఎమర్జెన్సీ ప్రకటన..

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications