For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Petrol prices today: పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి.

|

పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా నేడు (మంగళవారం, మే 2022) 47వ రోజు స్థిరంగా ఉన్నాయి. మోడీ ప్రభుత్వం లీటర్ పెట్రోల్ పైన రూ.8, లీటర్ డీజిల్ పైన రూ.6 ఎక్సైజ్ డ్యూటీ మూడు రోజుల క్రితం తగ్గించిన విషయం తెలిసిందే. దీంతో వాహనదారులకు భారీ ఊరట కలిగింది. గత దీపావళి సమయంలో పెట్రోల్, డీజిల్ పైన ఎక్సైజ్ డ్యూటీని తగ్గించిన కేంద్ర ప్రభుత్వం, తాజాగా రెండోసారి అంతకు రెండింతలు తగ్గించింది. కేంద్రం బాటలో రాష్ట్రాలు కూడా నడిస్తే వాహనదారులకు మరింత ఊరట కలుగుతుంది.

కేంద్రం తగ్గింపును పక్కన పెడితే చమురు మార్కెటింగ్ సంస్థల పెట్రోల్, డీజిల్ ధరలు నేడు కూడా స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.66గా ఉంది. మోడీ ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపు నేపథ్యంలో నిన్న డీజిల్ ధర రూ.105.49 నుండి రూ.97.82కు తగ్గింది. నేడు యథాతథంగా ఉంది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.105.41 నుండి రూ.96.72, డీజిల్ రూ.96.67 నుండి రూ.89.62కు పడిపోయింది. ముంబైలో పెట్రోల్ రూ.111.35, డీజిల్ రూ.97.28, చెన్నైలో పెట్రోల్ రూ.102.65, డీజిల్ రూ.94.24, కోల్‌కతాలో పెట్రోల్ రూ.106.03, డీజిల్ రూ.92.76, బెంగళూరులో పెట్రోల్ రూ.101.94, డీజిల్ రూ.87.89, గురుగ్రామ్‌లో పెట్రోల్ రూ.97.81, డీజిల్ రూ.90.05గా ఉంది.

Petrol, diesel prices today: No change in prices on 24 May 2022

దేశీయ చమురు రంగ సంస్థలు చివరిసారి 6, ఏప్రిల్ రోజున లీటర్ పెట్రోల్ పైన పెంపును అమలు చేశాయి. మార్చి 22వ తేదీ నుండి పక్షం రోజుల పాటు మొత్తం రూ.10 వరకు పెరిగింది. ఆ తర్వాత స్థిరంగా నెలకు పైగా స్థిరంగా ఉంది. అంతకుముందు నవంబర్ 4వ తేదీ నుండి ధరల్లో ఎలాంటి మార్పులేదు. నాలుగున్నర నెలల పాటు స్థిరంగా ఉన్న ధరలు మార్చి 22వ తేదీ వరకు స్థిరంగానే కొనసాగాయి. ఆ తర్వాత పది రోజుల పాటు సవరించారు. తిరిగి స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇప్పుడు కేంద్రం భారీగా ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించి వాహనదారులకు ఊరటను కల్పించింది.

English summary

Petrol prices today: పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. | Petrol, diesel prices today: No change in prices on 24 May 2022

The prices of petrol and diesel have remained unchanged today after FM Nirmala Sitharaman announced a cut in excise duty.
Story first published: Tuesday, May 24, 2022, 7:17 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X