For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జెరోధాను దాటేసి... 66 లక్షల వినియోగదారులతో పేటీఎం మనీ

|

వన్97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ నేతృత్వంలోని పేటీఎం మనీ విభాగం అత్యాధునిక సేవలతో 66 లక్షల మంది వినియోగదారుల సంఖ్యకు చేరుకుంది. ఇది దేశంలోని అతిపెద్ద రిటైల్ బ్రోకరేజీ సంస్థలలో ఒకటైన జెరోధాను అధిగమించింది. ఈ విజయంపై పేటీఎం సీఈవో విజయ్ శేఖర్ శర్మ స్పందించారు. తొలిసారి వినియోగిస్తున్న వారే 70 శాతం ఇన్‌స్టాల్ చేసుకున్నారని తెలిపారు. అయితే 60 శాతం మంది వినియోగదారులు చిన్న పట్టణాలు, నగరాల నుండి తమ యాప్‌ను ఉపయోగిస్తున్నారన్నారు.

జెరోధా 3 మిలియన్ల మంది యూజర్లను కలిగి ఉంది. ఇందులో 65 శాతం మంది ఫస్ట్ టైమ్ ఇన్వెస్టర్లు. ప్రస్తుతం పేటీఎం మనీ రూ.20 కోట్ల విలువైన డైరెక్ట్ మ్యుచువల్ ఫండ్స్‌ను విక్రయిస్తోంది. ఇది జాతీయ పెన్షన్ స్కీం (NPS), స్టాక్స్‌కు సంబంధించిన ఉత్పత్తిని కూడా విక్రయిస్తోంది.

ప్రయివేటీకరించినా.. బీపీసీఎల్ గ్యాస్ సబ్సిడీపై గుడ్‌న్యూస్ప్రయివేటీకరించినా.. బీపీసీఎల్ గ్యాస్ సబ్సిడీపై గుడ్‌న్యూస్

Paytm Money surpasses Zerodha with 6.6 million users

లక్షలమంది సంపదను పెంచడానికి పేటీఎం మనీ కీలకచర్యలు తీసుకుందని పేటీఎం మనీ సీఈవో వరుణ్ శ్రీధర్ తెలిపారు. ప్రజల ఆదాయాల్ని పెంచే ఆత్మనిర్భర్ భారత్ విజయం సాధించడంలో పేటీఎం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఇటీవలే స్టాక్ బ్రోకరేజ్ రంగంలోకి పేటీఎం ప్రవేశించింది. ఇందుకు కావాల్సిన అనుమతులను సెబీ ద్వారా పొందింది.

English summary

జెరోధాను దాటేసి... 66 లక్షల వినియోగదారులతో పేటీఎం మనీ | Paytm Money surpasses Zerodha with 6.6 million users

Paytm Money, the wealth management arm of One97 Communications Ltd. (which owns Paytm), claims to have reached a customer base of 6.6 million, surpassing Zerodha, one of the largest retail brokerage firms in the country, by volume.
Story first published: Monday, September 7, 2020, 19:03 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X