For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పేటీఎం విజయ్ శేఖర్ శర్మ: వ్యక్తిగత పెట్టుబడుల కోసం 2 కొత్త సంస్థలు, రూ.9 కోట్ల ప్రాథమిక పెట్టుబడి

|

ప్రముఖ డిజిటల్ పేమెంట్ల సంస్థ పేటీఎం ఫౌండర్ విజయ్ శేఖర్ శర్మ ఇటీవల వార్తల్లో ప్రముఖంగా కనిపిస్తున్నారు. 59 చైనా మొబైల్ ఆప్స్ పై ఇండియా నిషేధం విధించిన తర్వాత... శర్మ చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి. దీంతో మీడియా సంస్థలు అన్నీ విజయ్ శేఖర్ శర్మ వ్యాఖ్యలను ప్రముఖంగా ప్రచురించాయి. స్వయంగా పేటీఎం లో కూడా చైనా కు చెందిన అలీబాబా పెట్టుబడులు భారీ స్థాయిలో ఉన్నాయి.

అయినప్పటికీ చైనా సంస్థల కు చెందిన ఆప్స్ ను నిషేధిస్తే భారత్ కు అనుకూలంగా మాట్లాడటంతో అయన వ్యాఖ్యలకు ప్రాధాన్యత పెరిగింది. ఇదిలా ఉండగా... ఇప్పుడు మరో విషయంలో పేటీఎం ఫౌండర్ దూసుకుపోతున్నారు. అదే తన వ్యక్తిగత పెట్టుబడుల కోసం కొత్తగా రెండు ప్రత్యేక సంస్థలను ఏర్పాటు చేశారు. వాటి ద్వారా స్టార్టుప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టటం సహా ఇతరత్రా అనుబంధ కార్యకలాపాల కోసం వినియోగించనున్నారు.

కరోనాతో వీటి విలువ పెరిగింది, ఆర్బీఐని సుప్రీంకోర్టు ప్రశ్నించడమా!: HDFC పరేఖ్

భార్యతో కలిసి...

భార్యతో కలిసి...

వీఎస్ఎస్ ఇన్వెస్ట్ కో, వీఎస్ఎస్ హోల్డింగ్స్ అనే పేర్ల తో విజయ్ శేఖర్ శర్మ రెండు కొత్త పెట్టుబడి సంస్థలను ఏర్పాటు చేశారు. ఇందులో అయన భార్య మృదుల పరాశర్ భాగస్వామిగా ఉన్నారు. ఈ రెండు సంస్థల్లో కూడా విజయ్ శేఖర్ శర్మ అయన భార్య మాత్రమే వాటాదారులుగా ఉన్నారు. ప్రభుత్వానికి సమర్పించిన డాకుమెంట్స్ ప్రకారం... ఈ సంస్థల ద్వారా ఒక ఇన్వెస్ట్మెంట్ కంపెనీ తరహా కార్యకలాపాలు కొనసాగుతాయి. దీంతో పెట్టుబడులు పెట్టటం, షేర్లు, డిబెంచర్లు, సెక్యూరిటీ లను కొనుగోలు చేయటం, స్టాక్స్, బాండ్స్ ల కొనుగోలు వంటి కార్యకలాపాలు ఉంటాయి. అలాగే వాటి విక్రయం సహా అనుబంధ కార్యకలాపాలు కూడా ఇందులో భాగంగా ఉంటాయి.

రూ 9 కోట్ల పెట్టుబడి...

రూ 9 కోట్ల పెట్టుబడి...

ప్రాథమికంగా కొత్తగా ఏర్పాటు చేసిన ఇన్వెస్ట్మెంట్ కంపెనీల్లో విజయ్ శేఖర్ శర్మ సుమారు రూ 9 కోట్ల మేరకు పెట్టుబడులు పెట్టారు. ఇందులో భాగంగా వీఎస్ఎస్ ఇన్వెస్ట్ కో లో రూ 8.5 కోట్లు పెట్టుబడిగా పెట్టగా.. వీఎస్ఎస్ హోల్డింగ్స్ లో కూడా రూ 54 లక్షల ప్రాథమిక స్థాయి పెట్టుబడిని కూడా పెట్టారు. త్వరలోనే ఈ సంస్థ లకు మరిన్ని పెట్టుబడులను సమకూర్చే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే విజయ్ శేఖర్ శర్మ స్టార్టుప్ కంపెనీల్లో పెట్టుబడులు పెడుతున్నారు. అలాగే భవిష్యత్ లో ఇంకా పెద్ద మొత్తంలో ఆయన పెట్టుబడులు పెట్టె అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే వీటిని ఒక వ్యవస్థాగత పద్ధతిలో పెట్టాలని ఆయన యోచిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

25 సంస్థల్లో పెట్టుబడి...

25 సంస్థల్లో పెట్టుబడి...

విజయ్ శేఖర్ శర్మ ఇప్పటి వరకు సుమారు 25 స్టార్టుప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు. ఇందులో అనకాడేమి, గోకి, ఇన్నర్ చెఫ్, ఇన్నోవ్8, మిలాప్, ది కెన్, ఫాక్టర్ డైలీ వంటి సంస్థలు ఉన్నాయి. అయన పెట్టుబడులు సంస్థలు, వాటి వృద్ధి అవకాశాలను బట్టి కొన్ని లక్షల మొత్తం నుంచి కొన్ని కోట్ల వరకు ఉంటాయి. పేటీఎం కంపెనీ వాల్యుయేషన్ 10 బిలియన్ డాలర్ల కంటే అధిక మొత్తంలో ఉండటంతో పాటు రూ వేల కోట్లలో పెట్టుబడులు వచ్చి పడటంతో .. వ్యక్తిగతంగా కూడా విజయ్ శేఖర్ శర్మ కు భారీ మొత్తంలో లబ్ది చేకూరింది. ప్రస్తుతం అయన వద్ద రూ వందల కోట్లలో నిధులు అందుబాటులో ఉన్నాయని స్టార్టుప్ కంపెనీలను ట్రాక్ చేసే నిపుణులు చెబుతారు. అందుకే, వాటిని మరిన్ని స్టార్టప్ కంపెనీల్లో పెట్టుబడులుగా పెట్టి, మెరుగైన లాభాలను గడించాలని ఆశిస్తున్నట్లు వారు అభిప్రాయపడుతున్నారు.

English summary

Paytm Founder Vijay Shekhar launches two entities for investments

Paytm founder Vijay Shekhar Sharma has been an active angel investor for the past five, six years. With mega fundraising and towering valuation of Paytm, Sharma’s appetite for backing early-stage companies has increased rapidly in the past few years.
Story first published: Friday, July 3, 2020, 18:40 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Goodreturns sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Goodreturns website. However, you can change your cookie settings at any time. Learn more