కరోనా వైరస్ తెచ్చిన మార్పులు అన్నీ ఇన్నీ కావు. ఈ మాయదారి మహమ్మారి దెబ్బకు ఇండియా లో చాలా మంది ఉద్యోగుల జీతాలు కోతకు గురయ్యాయి. దీంతోనే బాధపడుతున్న వారికి మరో షాకింగ్ న్యూస్ ఎదురవుతోంది. ఉద్యోగుల వేతనాలను కంపెనీ కట్ చేసినప్పటికీ... ఇన్‌కం టాక్స్ నుంచి ఆ మేరకు ప్రయోజనం దక్కేలా లేదు. ఆదాయ పన్ను చట్టం లోని నిబంధనల ప్రకారం ఉద్యోగుల జీతం తగ్గినా ఇన్‌కం టాక్స్ తగ్గేలా లేదు. ఈ అంశంపై కొంత మంది నిపుణుల అభిప్రాయాలతో ది ఎకనామిక్ టైమ్స్ ఒక ప్రత్యేక కథనం ప్రచురించింది. ఆ వివరాలు మీ కోసం. కంపెనీలు తగ్గించిన శాలరీ లో బేసిక్, హెచ్ ఆర్ ఏ కూడా ఉండే అవకాశం ఉంది. అలా కాదంటే మాత్రం ఇన్‌కం టాక్స్ దానిని పరిగణన లోకి తీసుకోదని నిపుణులు చెబుతున్నారు. కొంత మంది ఛార్టర్డ్ అకౌంటెంట్లు మాత్రం పే కట్ ను వేతన బకాయిలుగా ఇన్‌కం టాక్స్ డిపార్ట్మెంట్ ట్రీట్ చేసే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. దీనిని ఒక స్పష్టత లేని విభాగంగా చూస్తున్నారు. దీంతో ఉద్యోగుల వేతనాలు, దానిపై పన్ను చెల్లింపులు చేసిన పత్రం ఫారం -16 నే ఫైనల్ అని చెబుతున్నారు. దాని ఆధారంగానే పన్ను చెల్లింపు ఎంత అన్నది తేలుతుందని భావిస్తున్నారు.

చెల్లింపు ఆధారంగా పన్ను...
సాధారణంగా అయితే ఆదాయ పన్ను చట్టాల ప్రకారం... ఉద్యోగికి చెల్లించాల్సిన వేతనం బకాయి ఉన్నా... లేదా చెల్లించినా దానినే పన్ను కు గీటురాయిగా పరిగణిస్తారు. ఇందులో ఏది ముందు జరిగితే దానినే లెక్కలోకి తీసుకుంటారు. అయితే, టీడీఎస్ మాత్రం సంబంధిత పేమెంట్ (వేతనం) చెల్లింపు సమయంలోనే కట్ చేస్తారు. ఇకపోతే ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావంతో తగ్గిన వేతనాలకు ఆయా కంపెనీలు తమ ఉద్యోగులకు సవరించిన వేతన ప్యాకేజీ వివరాలు వెల్లడించాయా లేదా అన్నది తేలాలి. అందులో కాస్ట్ టు కంపెనీ (సిటిసి) ఎంత ఉంది అనే దాని ఆధారంగా కూడా సరిగ్గా పన్ను ఎంత పడుతుందనే స్పష్టత లభిస్తుంది. వేతనాల తగ్గింపు అనేది వాస్తవిక శాలరీ లో తగ్గింపా... లేదంటే కేవలం అది వాయిదానా అనే విషయం తప్పనిసరిగా సంబంధిత కంపెనీ తమ ఉద్యోగులకు వెల్లడించాల్సి ఉంటుందని ఆదాయ పన్ను నిపుణులు పేర్కొంటున్నారు.

అలా అయితే పన్ను పడుద్ది..
ముందే విశ్లేషించినట్లు కంపెనీ తమ ఉగ్యోగులకు ఇచ్చే వేతనాలకు సంబంధించి సవరణలతో కూడిన సిటిసి వెల్లడిస్తే ఫరవా లేదు. కానీ... సిటిసి యధావిధిగా ఉంచి కేవలం ఇచ్చే వేతనాన్ని తగ్గిస్తే మాత్రం ఉద్యోగులకు పన్ను పోటు తప్పదు. ఎందుకంటే... ఉద్యోగికి లభించిన వేతనం లో మిగిలిన వాటా (కట్ చేసినది) ను బకాయిగా పరిగణించి దానిని కూడా పన్ను పరిధిలోకి తీసుకువస్తారు. ఇక్కడే చాలా మందికి అతిపెద్ద సవాలు ఎదురవుతుంది. కంపెనీలు తమ ఉద్యోగులకు వేతనం తగ్గించినట్లయితే... అందులోని బేసిక్ పేమెంట్, హౌస్ రెంట్ అలవెన్సు (హెచ్ ఆర్ ఏ ) వంటి కీలక అంశాలను కూడా అందుకు అనుగుణంగా సవరించాల్సి ఉంటుంది. లేదంటే ఒకవైపు తగ్గిన శాలరీ, రెండో వైపు అధిక పన్ను పోటుతో ఉద్యోగులు ఇబ్బంది పడతారని ప్రముఖ టాక్స్ నిపుణులు పేర్కొంటున్నారు.

ఆ బాధ్యత ఉద్యోగిదే ..
సహజంగా ఒక వ్యక్తి సంపాదనపై తగిన పన్ను చెల్లించాల్సిన బాధ్యత అతనిపైనే ఉంటుందని పన్ను నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలోనూ ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని వారు సూచిస్తున్నారు. అందుకే, ఒక వేళ ఉద్యోగుల కంపెనీలు వారికి తగ్గించిన వేతనం గురించిన పూర్తి సమాచారం అందించకపోతే ఆదాయ పన్ను భారం ఉద్యోగులపై పడుతుంది కానీ... కంపెనీలపై పడదు. కాంట్రాక్టు ఒప్పందం ప్రకారం ఉద్యోగికి ఇచ్చే స్థూల వేతనం (గ్రాస్ శాలరీ) పైన తగిన పన్ను ను ముందస్తుగా టీడీఎస్ రూపంలో కట్ చేసి దానిని ఆదాయ పన్ను శాఖకు చెల్లించాల్సిన బాధ్యత యాజమాన్యాలపై ఉంటుంది. దీని ఆధారంగా ప్రస్తుతం శాలరీ తగ్గిన ఉద్యోగులకు సవరించిన వేతన ప్యాకేజీ వివరాలు రాత పూర్వకంగా ఇవ్వకపోయినా కంపెనీలకు వచ్చే ఇబ్బంది లేదు. కాబట్టి చాలా వరకు కంపెనీలు ఈ మార్గాన్ని ఎంచుకునే అవకాశం ఉంటుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండి అధిక పన్ను భారం నుంచి బయట పడాలంటే ఉద్యోగులే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు. తమ యాజమాన్యాల నుంచి రాతపూర్వక తగ్గింపు లేఖలను పొందేలా చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..



Click it and Unblock the Notifications