For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Rocket Stock: రిలయన్స్ కంపెనీతో జతకట్టిన కంపెనీ.. పరుగులు తీస్తున్న స్టాక్ ధర

|

Olectra Greentech: దేశంలోని రవాణా రంగంలో పెనుమార్పులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. పెట్రోల్, డీజిట్ ఇంధనాలతో నడిచే వాహనాలకు ప్రత్యామ్నాయ టెక్నాలజీలు దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాలు మార్కెట్లో వాహనదారుల నుంచి మంచి ఆదరణను పొందుతున్నాయి.

 భవిష్యత్తు ఇంధనం..

భవిష్యత్తు ఇంధనం..

రానున్న కాలంలో కర్బన ఉద్ఘారాలను తగ్గించే క్రమంలో భాగంగా హైడ్రోజన్ ఆధారిత వాహనాలను కంపెనీలు తయారు చేస్తున్నాయి. పైగా ఇప్పటికే దేశీయ రిఫైనరీ రిలయన్స్ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిపై దృష్టి సారించింది. దీనికి తోడు ఈ రంగంలో వాహనాలను తయారు చేస్తున్న కంపెనీలతో జోడీ కట్టింది. ఈ తరుణంలో ఒలెక్ట్రా హైడ్రోజన్‌తో నడిచే బస్సుల అభివృద్ధిని వేగవంతం చేసేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో సాంకేతిక భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. భారత మార్కెట్‌కు తరువాతి తరం రవాణా వ్యవస్థను అందిచే ప్రయత్నంలో భాగంగా కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు Olectra వెల్లడించింది.

షేర్ దూకుడు..

షేర్ దూకుడు..

ఏడాదిలోనే హైడ్రోజన్ బస్సు వాణిజ్యపరంగా ప్రారంభించబడుతుందనే వార్తలు ఇన్వెస్టర్లలో జోష్ నింపాయి. భవిష్యత్తులో ప్రజా రవాణాకు సమర్థవంతమైన పరిష్కారంగా హైడ్రోజన్ ఆధారిత వాహనాలు వస్తున్నందున కంపెనీ భాగస్వామ్యం వార్తలతో స్టాక్ దాదాపు 18.36 శాతం మేర పెరిగాయి. ఈ క్రమంలో స్టాక్ ధర రూ.476.15 వద్ద మార్కెట్లో ట్రేడ్ అవుతోంది. కేవలం ఈ ఒక్కరోజే స్టాక్ ఏకంగా రూ.74 వరకు లాభపడింది.

 భారత లక్ష్యం..

భారత లక్ష్యం..

కార్బన్ రహిత ప్రజా రవాణా వ్యవస్థ ఏర్పాటు కోసం కంపెనీ చేస్తున్న ప్రయత్నం భారతదేశ పర్యావరణ లక్ష్యాలకు దోహదపడుతోంది. సాంప్రదాయ ప్రజా రవాణాకు హైడ్రోజన్ బస్సు పూర్తిగా కార్బన్ రహిత ప్రత్యామ్నాయం" అని మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ల అనుబంధ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ తెలిపింది. తెలంగాణకు చెందిన MEIL గ్రూప్ చేస్తున్న ప్రయత్నం దేశానికే కాక తెలుగు ప్రజలకు సైతం గర్వకారణమైనదిగా చెప్పుకోవచ్చు.

English summary

Rocket Stock: రిలయన్స్ కంపెనీతో జతకట్టిన కంపెనీ.. పరుగులు తీస్తున్న స్టాక్ ధర | Olectra Greentech stock rose steaply with technical partnership with Reliance for hydrogen buses

Olectra Greentech stock rose steaply with technical partnership with Reliance for hydrogen buses
Story first published: Friday, February 24, 2023, 15:08 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X