రోజుకూలీకి ఆదాయపు పన్ను శాఖ షాకిచ్చింది! రూ.1.47 కోట్ల ట్రాన్సాక్షన్‌కు గాను రూ.2.59 లక్షల పన్ను చెల్లించాలని నోటీసులు పంపించింది. ఈ సంఘటన ఒడిశాలో చోటు చేసుకుంది. నవరంగ్‌పూర్ జిల్లాలోని పుర్జారీభారండీ గ్రామంలో శానధర్ గంద్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. అతను కూలీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి ఈ నోటీసు వచ్చింది.
తనకు ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసులు వచ్చాయని, రూ.2.59 లక్షల మేర పన్ను చెల్లించాలని అందులో ఆదేశించారని, కానీ ఏం చేయాలో తనకు అర్థం కావడం లేదని, ఇంత పెద్ద మొత్తాన్ని తాను ఎలా చెల్లించగలనని శానధర్ గంద్ ఆవేదన వ్యక్తం చేశారు.

2014-15 ఆర్థిక సంవత్సరానికి గాను పన్ను చెల్లించాలని అధికారులు ఈ నోటీసులు ఇచ్చారు. తనకు ఈ నోటీసులు రావడానికి తన యజమాని కారణం కావొచ్చునని అతను ఆవేదన వ్యక్తం చేశాడు. తాను తన గ్రామానికి చెందిన పప్పూ అనే వ్యక్తి ఇంట్లో ఏడేళ్లకు పైగా పని చేశానని, ఆ సమయంలో తన భూమి పట్టాతో పాటు తెల్ల కాగితంపై సంతకం చేసి ఇచ్చానని, తన యజమాని తనను మోసం చేశాడని, అందుకే నోటీసు వచ్చిందన్నాడు.
ఐసీఐసీఐ బ్యాంకు నుంచి పెద్ద మొత్తంలో ట్రాన్సాక్షన్ చేసినట్లుగా వచ్చిందని, ఇందుకు గాను ఈ నోటీసు వచ్చిందన్నాడు. అతనేం చేశాడో కచ్చితంగా తెలియదని, కానీ తనకు మాత్రం నోటీసులు వచ్చాయన్నారు.


Click it and Unblock the Notifications