For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నష్టాల్లో స్టాక్ మార్కెట్లు: బ్యాంకింగ్, ఫైనాన్షియల్ స్టాక్స్ అమ్మకాల ఒత్తిడి

|

ముంబై: స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం ఓ సమయంలో అతి స్వల్ప లాభాల్లోకి వచ్చినప్పటికీ, ఆ వెంటనే మళ్లీ పతనమయ్యాయి. రెండు రోజుల క్రితం సూచీలు భారీగా ఎగిశాయి. సెన్సెక్స్ 1100 పాయింట్లకు పైగా లాభపడింది. నిన్న 600 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ నేడు కూడా అదే బాటపట్టాయి. వివిధ రంగాల్లో ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్‌కు మొగ్గు చూపుతున్నారు. దీనికి అంతర్జాతీయ పరిణామాలు తోడయ్యాయి. సెన్సెక్స్ ఓ సమయంలో 500 పాయింట్లు నష్టపోయింది. ఎనర్జీ రంగం మాత్రమే ఒక శాతం మేర లాభపడింది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ స్టాక్స్‌లో అమ్మకాలు వెల్లువెత్తాయి.

నష్టాల్లో మార్కెట్లు

నష్టాల్లో మార్కెట్లు

సెన్సెక్స్ నేడు ఉదయం 50,517.36 పాయింట్ల లాభపడి, 50,886.19 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 50,311.47 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. ఉదయం సెషన్లో ఓ సమయంలో కేవలం 40 పాయింట్ల వరకు మాత్రమే లాభపడింది. మొత్తంగా నష్టాల్లోనే ఉంది. ఉదయం 500 పాయింట్లకు పైగా కూడా నష్టపోయింది. ఉదయం గం.11 సమయానికి సెన్సెక్స్ 161.72 (0.32%) నష్టపోయి 50,684.36 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 14,977.95 వద్ద ప్రారంభమై, 15,092.35 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 14,929.25 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది.

టాప్ లూజర్స్, గెయినర్స్

టాప్ లూజర్స్, గెయినర్స్

నేటి టాప్ గెయినర్స్ జాబితాలో ONGC 3.28 శాతం, గెయిల్ 3.05 శాతం, బీపీసీఎల్ 1.69 శాతం, అల్ట్రా టెక్ సిమెంట్ 1.53 శాతం, మారుతీ సుజుకీ 1.18 శాతం లాభపడ్డాయి.

టాప్ లూజర్స్ జాబితాలో ఇండస్ఇండ్ బ్యాంకు 3.97 శాతం, విప్రో 3.40 శాతం, టాటా మోటార్స్ 2.71 శాతం, హిండాల్కో 2.56 శాతం, SBI 2.29 శాతం నష్టపోయాయి.

మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో రిలయన్స్, టాటా మోటార్స్, విప్రో, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంకు ఉన్నాయి.

రంగాలవారీగా..

రంగాలవారీగా..

నిఫ్టీ 50 స్టాక్స్ 0.75 శాతం, మిడ్ క్యాప్ సూచీ 1.95 శాతం నష్టపోయాయి. నిఫ్టీ ఎనర్జీ 0.18 శాతం, నిఫ్టీ మీడియా 0.16 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ఆటో 0.66 శాతం, నిఫ్టీ బ్యాంకు 1.74 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 1.35 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.34 శాతం, నిఫ్టీ ఐటీ 0.80 శాతం, నిఫ్టీ మెటల్ 2.41 శాతం, నిఫ్టీ ఫార్మా 1.05 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 3.32 శాతం, నిఫ్టీ రియాల్టీ 1.10 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 1.62 శాతం నష్టపోయాయి.

English summary

నష్టాల్లో స్టాక్ మార్కెట్లు: బ్యాంకింగ్, ఫైనాన్షియల్ స్టాక్స్ అమ్మకాల ఒత్తిడి | Nifty tops 15,050, Sensex rises from day’s low

Sensex, Nifty, Share Prices LIVE: Domestic equity market benchmarks BSE Sensex and Nifty 50 were trading lower on Friday, following global peers.
Story first published: Friday, March 5, 2021, 11:09 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X