For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మూడో రోజు నష్టాల్లో ముగిసిన మార్కెట్లు, సెన్సెక్స్ భారీగా ఎగిసి.. అంతలోనే

|

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం (మార్చి 16) భారీ లాభాల్లో ప్రారంభమై, చివరకు స్థిరంగా లేదా అతి స్వల్ప నష్టాల్లో ముగిశాయి. మధ్యాహ్నం వరకు భారీగా లాభపడిన మార్కెట్లు ఆ తర్వాత పతనమై, చివరకు కాస్త కోలుకున్నప్పటికీ 31 పాయింట్ల నష్టంతో ముగించింది సెన్సెక్స్. అమెరికా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న ఆసియా సూచీలు దాదాపు అన్నీ లాభాల్లోనే ముగిశాయి. అయితే దేశీయ కీలక రంగాల్లో అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోవడంతో నష్టాల్లోకి వెళ్లాయి. బ్యాంకింగ్, ఫైనాన్షియల్, మెటల్, రియాల్టీ రంగాలు నష్టాల్లో, ఐటీ, టెలికం, ఎఫ్ఎంసీజీ రంగాలు లాభాల్లో ముగిశాయి.

భారీ లాభాల నుండి నష్టాల్లోకి

భారీ లాభాల నుండి నష్టాల్లోకి

సెన్సెక్స్ ఉదయం 50,608.42 పాయింట్ల వద్ద ప్రారంభమై, 50,857.98 వద్ద గరిష్టాన్ని, 50,289.44 పాయింట్ల వద్ద కనిష్టాన్న తాకింది. సెన్సెక్స్ చివరకు 31.12 (0.062%) పాయింట్లు నష్టపోయి 50,363.96 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్ నేడు దాదాపు 600 పాయింట్ల మేర పైకి, కిందకు కదలాడింది. ఓ సమయంలో 51,000 పాయింట్ల సమీపానికి చేరుకుంది. చివరకు 50,500 పాయింట్ల దిగువన ముగిసింది. నిఫ్టీ 14,996.10 పాయింట్ల వద్ద ప్రారంభమై, 15,051.60 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 14,890.65 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 19 పాయింట్లు నష్టపోయి 14,910 పాయింట్ల వద్ద ముగిసింది. ఓ సమయంలో 15వేల మార్కు దాటినప్పటికీ దానిని నిలబెట్టుకోలేదు.

టాప్ గెయినర్స్, లూజర్స్

టాప్ గెయినర్స్, లూజర్స్

నేటి టాప్ గెయినర్స్ జాబితాలో ఏషియన్ పేయింట్స్ 4.82 శాతం, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ 2.47 శాతం, HUL 1.50 శాతం, HCL టెక్ 1.50 శాతం, TCS 1.43 శాతం లాభపడ్డాయి.

టాప్ లూజర్స్ జాబితాలో టాటా స్టీల్ 1.68 శాతం, సిప్లా 1.64 శాతం, లార్సన్ 1.48 శాతం, BPCL 1.45 శాతం, ICICI బ్యాంకు 1.42 శాతం నష్టపోయాయి.

మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో టీసీఎస్, ఎస్బీఐ, రిలయన్స్, ఇన్ఫోసిస్, టాటా మోటార్స్ ఉన్నాయి.

రంగాలవారీగా..

రంగాలవారీగా..

నిఫ్టీ 50 స్టాక్స్ 0.13 శాతం నష్టపోగా, నిఫ్టీ మిడ్ క్యాప్ 0.30 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ బ్యాంకు 0.15 శాతం, నిఫ్టీ బ్యాంకు 1.07 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.15 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.82 శాతం, నిఫ్టీ మీడియా 0.08 శాతం, నిఫ్టీ మెటల్ 0.85 శాతం, నిఫ్టీ ఫార్మా 0.10 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 1.32 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.56 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.98 శాతం నష్టపోయాయి. నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.89 శాతం, నిఫ్టీ ఐటీ 1.27 శాతం లాభపడ్డాయి.

English summary

మూడో రోజు నష్టాల్లో ముగిసిన మార్కెట్లు, సెన్సెక్స్ భారీగా ఎగిసి.. అంతలోనే | Nifty ends lower for 3rd day, may break out of consolidation phase soon

Indian stock markets continued to remain volatile and ended lower for the third day in a row. The NSE Nifty 50 index fell 0.1% to 14,910.45, while the S&P BSE Sensex ended flat at 50,363.96. The Nifty and the Sensex had earlier risen as much as 0.8% and 0.9%, respectively earlier in the session. The Nifty Bank Index and the public sector bank index were top losers, falling 1.1% and 1.32%, respectively.
Story first published: Tuesday, March 16, 2021, 22:12 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X