51,000 పాయింట్లు దాటిన సెన్సెక్స్, టాప్ గెయినర్స్, లూజర్స్ ఇవే
స్టాక్ మార్కెట్లు గురువారం (ఫిబ్రవరి 25) భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 51,000 పాయింట్ల పైన క్లోజ్ అయింది. ఎనర్జీ షేర్లు పరుగులు పెట్టాయి. దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల పరిణామాలు కలిసి వచ్చింది నిఫ్టీ 15,100కు అడుగు దూరంలో నిలిచింది. డాలర్ మారకంతో రూపాయి విలువ 72.42 వద్ద ముగిసింది. దాదాపు అన్ని రంగాలు కూడా లాభాల్లో ముగిశాయి. లాభంలో స్వల్పంగా హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ, రోజంతా అదే జోరు కనిపించింది. ఓ దశలో దాదాపు 500 పాయింట్ల మేర ఎగిసిన సెన్సెక్స్ చివరకు 257 పాయింట్ల లాభంతో ముగిసింది.

సెన్సెక్స్ భారీ జంప్
సెన్సెక్స్ నేడు 257.62 పాయింట్లు లేదా 0.51% ఎగిసి 51,039.31 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 115.40 పాయింట్లు లేదా 0.77% లాభపడి 15,097.40. పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. 1755 షేర్లు లాభాల్లో, 1149 షేర్లు నష్టాల్లో ముగియగా, 169 షేర్లలో ఎలాంటి మార్పులేదు. నేడు రూపాయి 10 పైసలు క్షీణించి 72.42 వద్ద ముగిసింది. 72.30 వద్ద ప్రారంభమైన రూపాయి 72.30-72.52 మధ్య ట్రేడ్ అయింది. క్రితం సెషన్లో 72.32 వద్ద క్లోజ్ అయింది.

మోస్ట్ యాక్టివ్ స్టాక్స్
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో కోల్ ఇండియా 8.10 శాతం, UPL 7.05 శాతం, అదానీ పోర్ట్స్ 5.88 శాతం, హిండాల్కో 5.38 శాతం, BPCL 5.21 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో ICICI బ్యాంకు 2.04 శాతం, నెస్ట్లే 1.42 శాతం, లార్సన్ 1.32 శాతం, టైటాన్ కంపెనీ 1.20 శాతం, దివిస్ ల్యాబ్స్ 1.15 శాతం, నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్ రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంకు, టాటా మోటార్స్, యాక్సిస బ్యాంకు, ఎస్బీఐ ఉన్నాయి.

రంగాలవారీగా...
నిఫ్టీ 50 సూచీ 0.77 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 1.42 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ఆటో 0.89 శాతం, నిఫ్టీ బ్యాంకు 0.27 శాతం, నిఫ్టీ ఎనర్జీ 3.05 శాతం, నిఫ్టీ ఐటీ 0.38 శాతం,నిఫ్టీ మీడియా 1.34 శాతం, నిఫ్టీ మెటల్ 3.97 శాతం, నిఫ్టీ ఫార్మా 0.88 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 1.15 శాతం, నిఫ్టీ రియాల్టీ 1.68 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.49 శాతం లాభపడ్డాయి.
నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.19 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.27 శాతం నష్టపోయాయి.