For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మార్కెట్ భారీ నష్టాలకు కారణాలివే! సెన్సెక్స్ 900 పాయింట్లు డౌన్

|

ముంబై: స్టాక్ మార్కెట్ నేడు(బుధవారం, జనవరి 27) కుప్పకూలింది. సెన్సెక్స్ 937 పాయింట్లు నష్టపోగా, నిఫ్టీ 271 పాయింట్లు పతనమైంది. అన్ని రంగాలు కూడా నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు, ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న బడ్జెట్, విదేశీసంస్థాగత ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడం వంటి పలు కారణాలతో సూచీలు నేల చూపులు చూశాయి. సెన్సెక్స్ 47,500 దిగువన ముగియగా, నిఫ్టీ 14,000 దిగువకు వచ్చింది. డాలర్ మారకంతో రూపాయి 72.92 వద్ద క్లోజ్ అయింది.

2021లో భారత్ అదరగొడుతుంది! ప్రపంచ దేశాలకు ఐక్యరాజ్య సమితి చీఫ్ ఎకనమిస్ట్ హెచ్చరిక2021లో భారత్ అదరగొడుతుంది! ప్రపంచ దేశాలకు ఐక్యరాజ్య సమితి చీఫ్ ఎకనమిస్ట్ హెచ్చరిక

సెన్సెక్స్ వెయ్యి పాయింట్లు డౌన్

సెన్సెక్స్ వెయ్యి పాయింట్లు డౌన్

సెన్సెక్స్ ఓ దశలో 1,100 పాయింట్లకు పైగా నష్టపోయింది. 48,385.28 పాయింట్ల వద్ద ప్రారంభమై, దాదాపు అక్కడే అంటే 48,387.25 గరిష్టాన్ని తాకి, 47,269.60 వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ 937.66 పాయింట్లు లేదా 1.94% నష్టపోయి 47,409.93 వద్ద ముగిసింది. నిఫ్టీ 271.40 పాయింట్లు లేదా 1.91% కోల్పోయి 13,967.50 పాయింట్ల వద్ద ముగిసింది. 1053 షేర్లు లాభాల్లో, 1809 షేర్లు నష్టాల్లో ముగియగా, 141 షేర్లలో ఎలాంటి మార్పులేదు. ఎఫ్ఎంసీజీ మినహా అన్ని రంగాలు నష్టపోయాయి.

టాప్ గెయినర్స్, లూజర్స్

టాప్ గెయినర్స్, లూజర్స్

టాప్ గెయినర్స్ జాబితాలో టెక్ మహీంద్రా 2.58 శాతం, SBI లైఫ్ ఇన్సురా 2.19 శాతం, విప్రో 2.10 శాతం, ఐటీసీ 1.37 శాతం, పవర్ గ్రిడ్ కార్ప్ 1.13 శాతం లాభాల్లో ముగిశాయి.టాప్ లూజర్స్ జాబితాలో టాటా మోటార్స్ 4.17 శాతం, యాక్సిస్ బ్యాంకు 3.99 శాతం, టాటా స్టీల్ 3.98 శాతం, గెయిల్ 3.95 శాతం, టైటాన్ కంపెనీ 3.94 శాతం నష్టపోయాయి.

మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో రిలయన్స్, టాటా మోటార్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు ఉన్నాయి.

నిఫ్టీ 50 స్టాక్స్ 1.91 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ 1.85 శాతం నష్టపోయాయి. నిఫ్టీ ఆటో 2.14 శాతం, నిఫ్టీ బ్యాంకు 2.93 శాతం, నిఫ్టీ ఎనర్జీ 1.73 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 2.77 శాతం, నిఫ్టీ ఐటీ 0.61 శాతం, నిఫ్టీ మీడియా 0.61 శాతం, నిఫ్టీ మెటల్ 2.52 శాతం, నిఫ్టీ ఫార్మా 2.04 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 1.52 శాతం, నిఫ్టీ రియాల్టీ 2.17 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 3.05 శాతం నష్టపోయాయి. కేవలం నిఫ్టీ ఎఫ్ఎంసీజీ మాత్రమే 0.30 శాతం లాభపడింది.

కారణాలివే

కారణాలివే

స్టాక్ మార్కెట్ నష్టానికి పలు కారణాలు ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి. యూరోస్టాక్స్ 50 ఫ్యూచర్స్ 0.3 శాతం నష్టపోయింది. బ్రిటన్ వ్యాక్సీన్ డైవర్ట్ అంశం ప్రభావం చూపింది. అమెరికా అధ్యక్షులు జోబిడెన్ 1.9 ట్రిలియన్ డాలర్ల కొవిడ్ 19 రిలీఫ్ ప్రకటించారు. దీని టైమ్ లైన్ పైన స్పష్టత కొరవడిందని అంటున్నారు. బడ్జెట్‌కు ముందు మార్కెట్లు ఊగిసలాటలో ఉంటుంటాయి. ఇలా వివిధ కారణాలతో సూచీలు పడిపోయాయి.

English summary

మార్కెట్ భారీ నష్టాలకు కారణాలివే! సెన్సెక్స్ 900 పాయింట్లు డౌన్ | Nifty ends below 14K, Sensex drops 938 points: factors behind the crash

Except FMCG, all other sectoral indices ended in the red. BSE Midcap and Smallcap indices shed 0.5-1.3 percent.
Story first published: Wednesday, January 27, 2021, 17:30 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X