For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు: రిలయన్స్ రూ.2000 దిగువనే

|

ముంబై: స్టాక్ మార్కెట్లు మంగళవారం(నవంబర్ 24) భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 445.87 పాయింట్లు(1.01%) శాతం లాభపడి 44,523.02 వద్ద, నిఫ్టీ 128.70 పాయింట్లు(1.00%) ఎగిసి 13,055.20 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. 1603 షేర్లు లాభాల్లో, 1167 నష్టాల్లో ముగిశాయి. 175 షేర్లలో ఎలాంటి మార్పులేదు. సెన్సెక్స్ 44,523 పాయింట్లతో సరికొత్త శిఖరాలను తాకింది. నిఫ్టీ కూడా నేడు మొదటిసారి 13 వేల మార్క్‌ను క్రాస్ చేసింది. నిఫ్టీ బ్యాంకు సూచీ 2 శాతం లాభపడగా, ఆటో, మెటల్, ఫార్మా సూచీలు ఒక శాతం చొప్పున పెరిగాయి.

కరోనా టైంలోను మోడీ వెనుకాడలేదు, మరింత జోరు.. ఆగదు: నిర్మల సీతారామన్కరోనా టైంలోను మోడీ వెనుకాడలేదు, మరింత జోరు.. ఆగదు: నిర్మల సీతారామన్

సెన్సెక్స్, నిఫ్టీ సరికొత్త రికార్డు

సెన్సెక్స్, నిఫ్టీ సరికొత్త రికార్డు

సెన్సెక్స్ ఉదయం నుండి లాభాల్లోనే కొనసాగింది. ఏ సమయంలోను కిందకు పడిపోలేదు. 274.67 పాయింట్లు( 0.62%) వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ అంతకంతకూ ఎగిసి చివరకు 400 పాయింట్ల పైకి చేరుకుంది.

టాప్ గెయినర్స్ జాబితాలో అదానీ పోర్ట్స్ 4.56 శాతం, యాక్సిస్ బ్యాంకు 4.04 శాతం, ఐచర్ మోటార్స్ 3.69 శాతం, హిండాల్కో 3.65 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా 3.39 శాతం, లాభాల్లో ముగిశాయి.

టాప్ లూజర్స్ జాబితాలో టైటాన్ కంపెనీ 1.52 శాతం, HDFC 1.47 శాతం, BPCL 1.19 శాతం, శ్రీ సిమెంట్స్ 0.91 శాతం, భారతీ ఎయిర్‌టెల్ 0.63 శాతం నష్టాల్లో ముగిశాయి.

మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంకు, కొటక్ మహీంద్ర బ్యాంకు ఉన్నాయి.

రిలయన్స్ స్టాక్ 1 శాతం లాభపడి రూ.1971 వద్ద క్లోజ్ అయింది. అయినప్పటికీ రూ.2,000కు దిగువనే ఉంది.

నిఫ్టీ రికార్డులు

నిఫ్టీ రికార్డులు

నిఫ్టీ మొదటిసారి 13000 పైన క్లోజ్ అయింది. నిఫ్టీ 12,000 మార్కు నుండి 13000 మార్కు చేరుకోవడానికి 18 నెలలు పట్టింది. కరోనా నేపథ్యంలో నిఫ్టీ మార్చి 24వ తేదీన 7511 పాయింట్ల కనిష్టాన్ని తాకింది. ఈ రెండేళ్ల కనిష్టంతో పోలిస్తే 75 శాతం లాభపడింది. నిఫ్టీ బ్యాంకు 713 పాయింట్లు లాభపడింది.

నిఫ్టీ 10,000 నుండి 13,000 మార్క్ చేరడానికి 40 నెలలు పట్టింది. జూలై 25, 2017న 10,000 మార్కు చేరుకున్న నిఫ్టీ ఆ తర్వాత 6 నెలలకు అంటే జనవరి 23, 2018న 11,000 పాయింట్లకు చేరుకుంది. 16 నెలల తర్వాత అంటే మే 23, 2019న 12,000ను తాకింది. ఇప్పుడు (నవంబర్ 24, 2020) 18 నెలల తర్వాత 13,000ను తాకింది. కరోనా మహమ్మారి లేకుంటే ఇంకా ముందుగానే ఈ మార్కును తాకేది. కరోనా వల్ల ఆలస్యమైంది.

ఏ రంగాలు ఎంత అంటే

ఏ రంగాలు ఎంత అంటే

నిఫ్టీ ఆటో 1.71 శాతం, నిఫ్టీ బ్యాంకు 2.46 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.34 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 1.54 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.84 శాతం, నిఫ్టీ ఐటీ 0.26 శాతం, నిఫ్టీ మీడియా 0.05 శాతం, నిఫ్టీ మెటల్ 1.09 శాతం, నిఫ్టీ ఫార్మా 1.22 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 1.11 శాతం, నిఫ్టీ రియాల్టీ 1.79 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 2.33 శాతం లాభపడ్డాయి.

టీసీఎస్ 0.064 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 0.21 శాతం, ఇన్ఫోసిస్ 0.026 శాతం, టెక్ మహీంద్ర 1.53 శాతం, విప్రో 0.042 శాతం, మైండ్ ట్రీ 1.01 శాతం, కోఫోర్జ్ 1 శాతం లాభపడ్డాయి.

English summary

భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు: రిలయన్స్ రూ.2000 దిగువనే | Nifty ends above 13K for the first time, Sensex at record closing high

Among the sectors, Nifty Bank index up 2 percent, while auto, metal and pharma indices rose 1 percent each.
Story first published: Tuesday, November 24, 2020, 17:31 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X