వరుస నష్టాలు, భారీగా నష్టపోయిన మార్కెట్లు, నిఫ్టీ 15వేల దిగువకు
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం నష్టాల్లో ముగిశాయి. వరుసగా రెండో రోజు నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం మన మార్కెట్లపై చూపింది. ప్రధానంగా బ్యాంకింగ్, మెటల్, ఫైనాన్షియల్ స్టాక్స్ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. దీంతో నిఫ్టీ 15వేల దిగువన ముగిసింది. డాలర్ మారకంతో రూపాయి వ్యాల్యూ 73.02 వద్ద ముగిసింది. నిన్న 600 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ నేడు కూడా అదే ఒరవడిని కొనసాగించింది. వివిధ రంగాల్లో ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్‌కు మొగ్గు చూపుతున్నారు. దీనికి అంతర్జాతీయ పరిణామాలు తోడయ్యాయి.
NPS నుండి పాక్షిక ఉపసంహరణ చేసుకోవచ్చు: ఎంత, ఎలా, ఎన్నిసార్లు?

భారీ నష్టాలు
సెన్సెక్స్ నేడు 440 పాయింట్ల మేర నష్టపోయింది. ఉదయం 50,517.36 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్, 50,886.19 వద్ద గరిష్టాన్ని, 50,160.54 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. 720 పాయింట్ల మేర పైకి, కిందకు కదిలింది. సెన్సెక్స్ చివరకు 440.76 పాయింట్లు నష్టపోయి 50,405 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 14,977.95 పాయింట్ల వద్ద ప్రారంభమై, 15,092.35 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 14,862.10 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. చివరకు 142 పాయింట్లు నష్టపోయి 14,938 పాయింట్ల వద్ద ముగిసింది.

టాప్ గెయినర్స్, లూజర్స్
టాప్ గెయినర్స్ జాబితాలో ONGC 2.00 శాతం, గెయిల్ 1.87 శాతం, మారుతీ సుజుకీ 1.65 శాతం, కొటక్ మహీంద్రా 1.31 శాతం, హీరో మోటో కార్ప్ 1.22 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో ఇండస్ఇండ్ బ్యాంకు 4.77 శాతం, టాటా మోటార్స్ 4.14 శాతం, విప్రో 4.09 శాతం, UPL 3.88 శాతం, హిండాల్కో 3.32 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో టాటా మోటార్స్, ఎస్బీఐ, రిలయన్స్, విప్రో, ఐసీఐసీఐ బ్యాంకు ఉన్నాయి.

రంగాలవారీగా..
నిఫ్టీ 50 స్టాక్స్ 0.95 శాతం, మిడ్ క్యాప్ సూచీ 2.79 శాతం నష్టపోయాయి. నిఫ్టీ ఆటో 0.95 శాతం, నిఫ్టీ బ్యాంకు 1.60 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.41 శాతం,
నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 1.24 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.25 శాతం, నిఫ్టీ ఐటీ 1.57 శాతం, నిఫ్టీ మీడియా 0.86 శాతం, నిఫ్టీ మెటల్ 2.70 శాతం, నిఫ్టీ ఫార్మా 1.29 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 3.93 శాతం, నిఫ్టీ రియాల్టీ 1.42 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 1.58 శాతం నష్టపోయాయి. ఏ రంగం కూడా లాభాల్లో ముగియలేదు.