For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

New Year 2021: నిఫ్టీ అదుర్స్, 2010 తర్వాత తొలిసారి సెన్సెక్స్ '9'వ సారి...

|

ముంబై: స్టాక్ మార్కెట్లు కొత్త సంవత్సరం (2021) మొదటి రోజున లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ మొదటిసారి 14,000 మార్కు దాటి క్లోజ్ అయింది. ఇక సెన్సెక్స్ 48,000 మార్కుకు 32 పాయింట్ల దూరంలో మాత్రమే నిలిచింది. ఈ వారంతో సెన్సెక్స్ వరుసగా 9వ వారం లాభాల్లో ముగిసింది. 2010 ఏప్రిల్ తర్వాత మళ్లీ ఇలా క్లోజ్ కావడం ఇదే మొదటిసారి. 1998 స్టాక్స్ లాభాల్లో ముగియగా, 940 స్టాక్స్ నష్టాల్లో ముగిశాయి. 163 షేర్లలో ఎలాంటి మార్పు లేదు. నిఫ్టీ బ్యాంకు మాత్రం నష్టాల్లో ముగిసింది. ప్రయివేటు రంగ బ్యాంకు అద్భుతంగా రాణించింది.

సెన్సెక్స్, నిఫ్టీ రికార్డ్
2021 జనవరి 1.. మొదటి రోజునే మార్కెట్లు లాభాలు నమోదు చేశాయి. సెన్సెక్స్ 117.65 పాయింట్లు(0.25%) లాభపడి 47,868.98 పాయింట్ల వద్ద, నిఫ్టీ 36.70 పాయింట్లు(0.26%) ఎగిసి 14,018.50 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. సెన్సెక్స్ మరో సరికొత్త శిఖరం 48000కు 32 పాయింట్ల దూరంలో ముగిసింది. ఐటీ సూచీ రికార్డ్ స్థాయిని తాకాయి. జీఎస్టీ కలెక్షన్లు రికార్డ్ స్థాయిలో వసూలైన విషయం తెలిసిందే. జీఎస్టీ అమలైనప్పటి నుండి ఇదే గరిష్టం. డిసెంబర్ నెలలో వసూళ్లు రూ.1.15 లక్షల కోట్లు దాటాయి.ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ డిసెంబర్ క్వార్టర్ ఫలితాలను జనవరి 13న ప్రకటించనుంది.

 Nifty closes above 14K for 1st time, Sensex Posts Longest Weekly Gains Since 2010

2020లో కంపెనీలకు 568 శాతం లాభం, అయినా భారీగా ఉద్యోగాలు కట్2020లో కంపెనీలకు 568 శాతం లాభం, అయినా భారీగా ఉద్యోగాలు కట్

రంగాలవారీగా..
నిఫ్టీ 50 స్టాక్స్ 0.26 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ 1.59 శాతం లాభపడ్డాయి. రంగాలవారీగా నిఫ్టీ ఆటో 0.86 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.32 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.63 శాతం, నిఫ్టీ ఐటీ 0.84 శాతం, నిఫ్టీ మీడియా 0.61 శాతం, నిఫ్టీ మెటల్ 0.13 శాతం, నిఫ్టీ ఫార్మా 0.67 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 3.25 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.81 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ బ్యాంకు 0.12 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.15 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.32 శాతం నష్టపోయాయి.

English summary

New Year 2021: నిఫ్టీ అదుర్స్, 2010 తర్వాత తొలిసారి సెన్సెక్స్ '9'వ సారి... | Nifty closes above 14K for 1st time, Sensex Posts Longest Weekly Gains Since 2010

Adani Ports, ITC, TCS, M&M and SBI were among major gainers on the Nifty, while losers were ICICI Bank, SBI Life Insurance, Hindalco, HDFC Bank and Titan Company.
Story first published: Friday, January 1, 2021, 17:20 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X