For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లాభాలు.. నష్టాలు.. ఇన్వెస్టర్లతో మార్కెట్ ఆట: ఊగిసలాటలో దలాల్ స్ట్రీట్

|

ముంబై: వరుస భారీ నష్టాలతో ఇటీవలి వరకు కుప్పకూలిన మార్కెట్లు మంగళ వారం లాభాల ఊరట లభించింది. బుధవారం (మార్చి 25) మార్కెట్ ప్రారంభంలోను లాభాలు కనిపించాయి. 300 పాయింట్ల లాభంతో ప్రారంభమైన సెన్సెక్స్ 500 పాయింట్ల సమీపానికి కూడా చేరుకుంది. కాసేపటికి స్వల్ప నష్టాల్లోకి వెళ్లినప్పటికీ, మళ్ళీ లాభాల్లో కనిపించింది. మొత్తంగా మార్కెట్ నేడు తొలి గంటలో ఊగిసలాటలో ఉంది.

కరోనా: 2 రోజులు లేదా మార్చి 31 దాకా... స్టాక్ మార్కెట్లు క్లోజ్!? నేడు యథాతథంకరోనా: 2 రోజులు లేదా మార్చి 31 దాకా... స్టాక్ మార్కెట్లు క్లోజ్!? నేడు యథాతథం

ప్రీ ఓపెన్ మార్కెట్ స్వల్ప నష్టాలు కనిపించినప్పటికీ, ఓపెనింగ్ మాత్రం స్వల్ప లాభాలతో ప్రారంభమైంది. ఉదయం గం.09:19 సమయానికి సెన్సెక్స్ 353.09 పాయింట్లు (1.32%) పెరిగి 27,027.12, నిఫ్టీ 97.55 పాయింట్లు (1.25%) ఎగిసి 7,898.60 వద్ద ట్రేడ్ అయింది. ప్రారంభ సమయానికి 243 షేర్లు లాభాల్లో, 348 షేర్లు నష్టాల్లో ఉండగా, 35 షేర్లలో ఎలాంటి మార్పు లేదు.

Markets gain: Nifty above 7,900, Sensex up 450 points

రిలయన్స్ ఇండస్ట్రీస్, సిప్లా, టెక్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, హిండాల్కో, గెయిల్, విప్రో లాభాల్లో ఉండగా, ఇండస్ ఇండి బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, ఎల్ అండ్ టీ, మారుతీ సుజుకీ నష్టాల్లో ఉన్నాయి. రిలయన్స్ షేర్లు 9 శాతం లాభాల్లోకి వచ్చాయి.

రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్, టెక్ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ, నెస్ట్లే ఇండియా, పవర్ గ్రిడ్, ఇన్ఫోసిస్, టీసీఎస్, భారతీ ఎయిర్‌టెల్, కొటక్ మహీంద్రా బ్యాంకు, టాటా స్టీల్, హిందూస్తాన్ యూనీ లీవర్, ఎన్టీపీసీ, ఎస్బీఐఎన్, ఐటీసీ కంపెనీలు 0 శాతం నుండి 9 శాతం వరకు లాభాల్లో కనిపించాయి. హీరో మోటో కార్ప్, ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంకు, టైటాన్, ఓఎన్జీసీ, హెచ్‌సీఎల్ టెక్, మారుతీ, ఏషియన్ పేయింట్స్, మహీంద్రా అండ్ మహీంద్ర్, ఎల్ అండ్ టీ, అల్ట్రా టెక్ సిమెంట్, ఇండస్ ఇండ్ బ్యాంకు, 0.28 శాతం నుండి 4 శాతం వరకు నష్టాల్లో ట్రేడింగ్ ప్రారంభించాయి.

English summary

లాభాలు.. నష్టాలు.. ఇన్వెస్టర్లతో మార్కెట్ ఆట: ఊగిసలాటలో దలాల్ స్ట్రీట్ | Markets gain: Nifty above 7,900, Sensex up 450 points

After witnessing the biggest ever fall in history on March 23, the Indian indices saw some recovery and ended on a positive note on Tuesday and Benchmark indices opened higher on March 25 with Nifty around 7900. after some relief package announced by the government.
Story first published: Wednesday, March 25, 2020, 9:56 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X