For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కరోనా సెకండ్ వేవ్, అంతర్జాతీయ ప్రభావం: మార్కెట్లు భారీ పతనం

|

ముంబై: స్టాక్ మార్కెట్లు బుధవారం (మార్చి 24) భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఏకంగా 870 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ 265 పాయింట్లు పతనమైంది. అంతర్జాతీయంగా మార్కెట్లు బలహీనంగా ఉండటం, కరోనా సెకండ్ వేవ్ భయాల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయనే వార్తలు ఇన్వెస్టర్లను కలవరపెట్టాయి. దీంతో ఏ సమయంలో మార్కెట్ కోలుకోలేదు. ఉదయం నుండి అంతకంతకూ అమ్మకాలు వెల్లువెత్తాయి. డాలర్ మారకంతో రూపాయి 72.61 వద్ద క్లోజ్ అయింది.

రూ.5 లక్షల వరకు పీఎఫ్ కాంట్రిబ్యూషన్‌పై పన్ను మినహాయింపు, ఎవరికి ప్రయోజనమంటే?రూ.5 లక్షల వరకు పీఎఫ్ కాంట్రిబ్యూషన్‌పై పన్ను మినహాయింపు, ఎవరికి ప్రయోజనమంటే?

సెన్సెక్స్, నిఫ్టీ భారీ పతనం

సెన్సెక్స్, నిఫ్టీ భారీ పతనం

ఉదయం 49,786.47 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్, 49,854.58 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 49,120.34 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. ఏ సమయంలోను సెన్సెక్స్ కోలుకోలేదు. 49,120 పాయింట్ల కనిష్టానికి సమీపంలో 49,180 పాయింట్ల వద్ద ముగిసింది. అంటే కనిష్టం నుండి 60 పాయింట్లు మాత్రమే పెరిగింది. నిఫ్టీ 14,712.45 పాయింట్ల వద్ద ప్రారంభమై, 14,752.35 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 14,535.00 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. చివరకు 265.35 (1.79%) పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ 14,549.40 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది.

టాప్ గెయినర్స్, లూజర్స్

టాప్ గెయినర్స్, లూజర్స్

మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌వో జాబితాలో టాటా మోటార్స్, రిలయన్స్, SBI, అదానీ పోర్ట్స్, టాటా స్టీల్ ఉన్నాయి.

టాప్ గెయినర్స్ జాబితాలో సిప్లా 2.17 శాతం, ఏషియన్ పేయింట్స్ 1.38 శాతం, పవర్ గ్రిడ్ కార్పోరేషన్ 0.94 శాతం లాభపడ్డాయి.

టాప్ లూజర్స్ జాబితాలో టాటా స్టీల్ 5.17 శాతం, అదానీ పోర్ట్స్ 4.29 శాతం, టాటా మోటార్స్ 4.21 శాతం, హిండాల్కో 4.21, మహీంద్రా అండ్ మహీంద్రా 3.94 శాతం నష్టపోయాయి.

రంగాలవారీగా..

రంగాలవారీగా..

నిఫ్టీ 50 స్టాక్స్ 1.79 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ 2.45 శాతం నష్టపోయాయి. నిఫ్టీ ఆటో 2.58 శాతం, నిఫ్టీ బ్యాంకు 2.61 శాతం, నిఫ్టీ ఎనర్జీ 1.73 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 2.13 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 1.41 శాతం, నిఫ్టీ ఐటీ 1.16 శాతం, నిఫ్టీ మీడియా 2.48 శాతం, నిఫ్టీ మెటల్ 3.24 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 3.30 శాతం, నిఫ్టీ రియాల్టీ 2.94 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 2.56 శాతం నష్టపోయాయి. నిఫ్టీ ఫార్మా మాత్రమే 0.08 శాతం లాభపడింది.

English summary

కరోనా సెకండ్ వేవ్, అంతర్జాతీయ ప్రభావం: మార్కెట్లు భారీ పతనం | Market spooked by weak global cues, rising COVID cases

The market ended near a 1-month low on March 24 amid weak global cues and fears of a second wave of COVID infections in India. At close, Sensex was down 871.13 points, or 1.74%, at 49,180.31, and Nifty was down 265.40 points, or 1.79%, at 14,549.40.
Story first published: Wednesday, March 24, 2021, 18:32 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X