For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రూ.1 లక్ష కోట్ల దిగువకు జీఎస్టీ వసూళ్లు, మార్చిలో రూ.97,597

|

మార్చి నెలలో జీఎస్టీ వసూళ్లు రూ.97,597 కోట్లుగా ఉన్నాయి. రూ.1 లక్ష కోట్ల కంటే తక్కువ నమోదు కావడం నాలుగు నెలల తర్వాత ఇప్పుడే. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నేపథ్యంలో ఈ ప్రభావం జీఎస్టీ వసూళ్లపై పడింది. మార్చి నెలకు రూ.97,597 కోట్లు వసూలు కాగా ఇందులో రూ.19,183 కోట్లు సీజీఎస్టీ, రూ.25,601 కోట్లు ఎస్జీఎస్టీ, రూ.44,508 కోట్లు ఐజీఎస్టీ కింద, రూ.8,306 కోట్లు సెస్ రూపంలో వసూలయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది.

ఇబ్బంది లేకుండా 10 బ్యాంకుల విలీనం, చరిత్ర పుటల్లోకి ఆంధ్రా బ్యాంక్ఇబ్బంది లేకుండా 10 బ్యాంకుల విలీనం, చరిత్ర పుటల్లోకి ఆంధ్రా బ్యాంక్

2019 మార్చి నెలలో రూ.1.06 లక్షల కోట్లు వసూలయ్యాయి. దీంతో పోలిస్తే 8.4 శాతం తగ్గుదల నమోదయింది. సమ్మిళిత జీఎస్టీ నుండి కేంద్ర వాటా రూ.19,718 కోట్లు, రాష్ట్రాల వాటా రూ.14,915 కోట్లుగా ఉండనుంది. ఫలితంగా కేంద్రానికి రూ.41,901 కోట్లు, రాష్ట్రాలకు రూ.43,516 కోట్లు లభిస్తాయి.

March GST collections below Rs 1 lakh crore

2019 నవంబర్ నుంచి 2020 ఫిబ్రవరి వరకు ప్రతి నెలా జీఎస్టీ వసూళ్లు రూ.లక్ష కోట్లు దాటాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో 83 లక్షల జీఎస్టీ రిటర్న్స్ నమోదయ్యాయి. మార్చిలో 76.5 లక్షలకు తగ్గాయి. మార్చి చివరి పది రోజుల్లో జనతా కర్ఫ్యూ, లాక్ డౌన్ ప్రభావం కారణంగా ఎక్కువ వ్యాపారాలు మూతబడటం ఇందుకు కారణం.

English summary

రూ.1 లక్ష కోట్ల దిగువకు జీఎస్టీ వసూళ్లు, మార్చిలో రూ.97,597 | March GST collections below Rs 1 lakh crore

Goods and services tax collections for March, 2020 stood at Rs.97,597 crore, lower than Rs.1.05 lakh crore collected in February, 2020. Until February, GST collections crossed ₹1 lakh crore for four consecutive months.
Story first published: Thursday, April 2, 2020, 10:16 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X