For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారీగా తగ్గిన డిమాండ్, ఆరున్నరేళ్ల కనిష్టానికి బంగారం దిగుమతులు

|

మార్చిలో బంగారం దిగుమతులు ఆరున్నర సంవత్సరాల కనిష్టానికి చేరుకున్నాయి. కరోనా వ్యాధిని అరికట్టేందుకు దేశవ్యాప్త లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ బంగారం దిగుమతులపై ప్రభావం చూపింది. దీంతో దేశీయంగా బంగారం దిగుమతులు మార్చిలో రికార్డు స్థాయిలో తగ్గాయి. వార్షిక ప్రాతిపదికన 73 శాతానికి పైగా పడిపోయిన పసిడి దిగుమతి ఆరున్నర ఏళ్ల కనిష్ట స్థాయికి చేరుకున్నాయి.

ప్రపంచంలోనే బంగారానికి రెండో అతిపెద్ద దిగుమతిదారు భారత్. మార్చి నెలలో దిగుమతులు ఏకంగా 73 శాతం పడిపోయాయి. వాల్యూపరంగా మార్చి దిగుమతులు దాదాపు 63 శాతం తగ్గి 1.22 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. 2019 మార్చిలో 93.24 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంది భారత్. ఈ సంవత్సరం మార్చిలో కేవలం 25 టన్నులకు పడిపోయింది.

70 ఏళ్లలోనే అతిపెద్ద సంక్షోభం..మోడీకి రఘురాం రాజన్ కీలక సూచన70 ఏళ్లలోనే అతిపెద్ద సంక్షోభం..మోడీకి రఘురాం రాజన్ కీలక సూచన

March gold imports hit 6.5 year low on record price

గత ఆరున్నర సంవత్సరాలలో ఇదే కనిష్ట దిగుమతి. కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోంది. దీంతో ప్రపంచమంతా లాక్ డౌన్ పరిస్థితులు నెలకొన్నాయి. అంతర్జాతీయ రవాణా పూర్తిగా స్తంభించింది. మన దేశంలోను రిటైల్ కొనుగోల్లు లేవు. దీంతో దిగుమతులపై ప్రభావం పడింది.

English summary

భారీగా తగ్గిన డిమాండ్, ఆరున్నరేళ్ల కనిష్టానికి బంగారం దిగుమతులు | March gold imports hit 6.5 year low on record price

India’s gold imports plunged more than 73% year on year in March to their lowest in 6-1/2 years as record domestic prices and a lockdown to curb the spread of coronavirus squeezed retail demand, a government source said on Monday.
Story first published: Monday, April 6, 2020, 18:51 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X