For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Dubai Gold: దుబాయ్‌లో గోల్డ్ ధర తక్కువా..? గ్రాముకు రేటు ఎంత..? ఇందులో అసలు వాస్తవం ఎంతంటే..?

|

Dubai Gold: బంగారం రేటు తక్కువ అనే మాట వినంగానే భారతీయుల్లో ఉత్సాహం పెరిగిపోతుంది. ఈ క్రమంలో దుబాయ్‌లో బంగారం చౌకగా ఉంటుందనే వార్తలు చాలా మంది వినే ఉంటారు. బంగారు ఆభరణాలపై ఉండే స్టిక్కర్లను చూస్తే అనేక విషయాలపై అవగాహన వస్తుంది. అప్పుడు దుబాయ్‌లో బంగారం కొనుగోలు చేయాలనే ప్లాన్ గురించి మీరు ఒకటికి రెండుసార్లు తప్పక ఆలోచిస్తారు. అసలు వాస్తవాలను ఇప్పుడు చూద్దాం..

తాజా రేట్లను పరిశీలిస్తే..

తాజా రేట్లను పరిశీలిస్తే..

సెప్టెంబర్ 19న దుబాయ్‌లో 1 గ్రాము 22 క్యారెట్ బంగారం ధర 196.50 AED అంటే రూ.4,250. ఆ రోజు ముంబై మార్కెట్‌లోగ్రాము ధర రూ.4,656. ఈ వ్యత్యాసానికి కేంద్రం దిగుమతి సుంకాన్ని 15 శాతానికి పెంచటమే కారణం. జూలైలో ప్రభుత్వం డ్యూటీని 10.75 శాతం నుంచి 15 శాతానికి పెంచింది. ఈ పండుగ సీజన్‌లో ధర కారణంగా దేశీయ బంగారు ఆభరణాల వ్యాపారం దుబాయ్‌ నుంచి గట్టి పోటీని ఎదుర్కొంటోంది.

దుబాయ్‌లో గోల్డ్ కొనటం వేస్ట్..

దుబాయ్‌లో గోల్డ్ కొనటం వేస్ట్..

దుబాయ్‌లో బంగారం కొనడం చౌక కొంత చౌకే అయినప్పటికీ.. భారత్‌కు తీసుకువస్తే దానిపై సుంకం చెల్లించాల్సి ఉంటుంది. పైగా దుబాయ్‌లో మేకింగ్ ఛార్జీలు కూడా ఎక్కువే. పండుగల సీజన్ కావటంతో దుబాయ్‌లో నివసిస్తున్న ఎన్నారైలను ఇక్కడికి వచ్చేటప్పుడు గోల్డ్ తమతో పాటు తీసుకురావాలని చాలా మంది బంధువులు కోరుతున్నారు. ఇవన్నీ కలిపితే పెద్ద తేడా ఏమీ ఉండదని నిపుణులు చెబుతున్నారు. పైగా కస్టమ్స్ కష్టాలు సైతం ఉంటాయని వారు అంటున్నారు.

కొనుగోలు దారులతో కళకళ..

కొనుగోలు దారులతో కళకళ..

దుబాయ్‌లోని మీనా బజార్, గోల్డ్ సౌక్, బనియా స్ట్రీట్ షాపులు భారతీయ కస్టమర్లతో నిండిపోయాయి. మలబార్ గోల్డ్, జోయల్లుకాస్, కళ్యాణ్ జ్యువెలర్స్, పాప్లీ, తనిష్క్, అట్లాస్ జ్వెలర్స్ వంటి భారతీయ ఆభరణాల బ్రాండ్‌లు కూడా దుబాయ్ మార్కెట్‌లలో ఉన్నాయి. గత త్రైమాసికంలో భారతీయ పాస్‌పోర్ట్‌లు ఉన్న కస్టమర్లకు అమ్మకాలు 30 శాతం పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. ఎక్కువ మంది 18 క్యారెట్లలో నెక్లెస్‌లు, 22 క్యారెట్ల ఆభరణాలను కొంటున్నట్లు తేలింది.

దుబాయ్ బంగారం రేటు ఎక్కువ..

దుబాయ్ బంగారం రేటు ఎక్కువ..

ప్రాథమికంగా గ్రాముకు బంగారం ధర మనకంటే దుబాయ్‌లో తక్కువగానే ఉన్నప్పటికీ అక్కడ మిగిలిన ఛార్జీలు భారీగా ఉన్నాయి. దుబాయ్‌లోని దుకాణాల నిర్వహణ వ్యయం, మేకింగ్ ఛార్జీలు, కరెన్సీ కన్వర్షన్ ఖర్చులను లెక్కిస్తే 22 క్యారెట్ల స్వచ్ఛమైన 20 గ్రాముల బంగారం కొనటానికి దుబాయ్ లో రూ.7,500 అదనంగా ఖర్చవుతుంది. అందుగే దూరపు కొండలు నునుపు అనే సామెత ఇక్కడ సరిగ్గా అన్వయించుకోవచ్చు. వాస్తవాలను గమనిస్తే భారతదేశంలో బంగారం కొనుగోలు చేయటం ఖర్చు తక్కువని చెప్పుకోవాలి.

English summary

Dubai Gold: దుబాయ్‌లో గోల్డ్ ధర తక్కువా..? గ్రాముకు రేటు ఎంత..? ఇందులో అసలు వాస్తవం ఎంతంటే..? | know facts about dubai gold and why it is expensive than indian gold in detail

know facts about dubai gold and why it is expensive than indian gold in detail ..
Story first published: Thursday, September 29, 2022, 16:10 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X